కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు
నల్గొండ : తన ప్రభుత్వ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. విపక్షాలన్నీ ఏకమవడం సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బుధవారం నల్గొండలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... మావోయిస్టు సిద్ధాంతాన్ని సీపీఎం ఏనాడూ సమర్థించలేదన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కానీ తమ పార్టీ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకమని తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరవు మండలాలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.