breaking news
Technologies Development
-
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్‌న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్‌కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్‌కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్‌వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
రిజిస్ట్రేషన్ ఈజీ
సాక్షి, బెంగళూరు : పౌరసేవలకు సంబంధించి సమాచార, సాంకేతిక రంగాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు మరో సేవను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ఆస్తి ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులోనైనా సదరు ఆస్తిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌కు నిపుణులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించి ఇల్లు, ఇంటి స్థలం, పొలం తదితర స్థిరాస్తులు ఏ ప్రాతంలో ఉంటే ఆ ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనే క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయించాల్సి ఉంటుంది. దీని వల్ల స్థిరాస్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పని ఒత్తిడి ఎక్కువవుతోంది. అంతేకాకుండా అదే ప్రాంతంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధనను అలుసుగా చేసుకుని ప్రభుత్వ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వీటినన్నింటికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులనైనా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోనైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేలా కొత్త విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. బెంగళూరు పరిధిలోని బసవనగుడి, గాంధీనగర్, జయనగర్, రాజాజీనగర్, శివాజీనగర్ ప్రాంతాల్లోని 43 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ఏడాది పెలైట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేసి.. మంచి ఫలితం సాధించింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రంలోని 203 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాఫ్వేర్ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అభివృద్ధి పరిచింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన అధికారులు కొన్ని చిన్నచిన్న మార్పులు చేయమని సదరు కంపెనీకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ విధానం అమల్లోకి రావడం వల్ల తమ వ్యక్తిగత ఆదాయం పడిపోతుందని భావిస్తున్న కొంతమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విధానం రాష్ట్రమంతటా అమలు కాకుండా చేయాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉన్నత స్థాయి అధికారి ఒకరు మాట్లాడుతూ...‘ ఈ నూతన విధానం కోసం ఇప్పటికే రూ.147 కోట్లను ఖర్చు చేశాం. ఈ విధానం వల్ల శాఖలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్టపడబోతోంది. ఈ విధానం అమల్లోకి రాకుండా చేయాలని ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయినా త్వరలోనే ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్’ ప్రక్రియను రాష్ట్రమంతటా ప్రవేశపెట్టితీరుతాం.’ అని పేర్కొన్నారు.