breaking news
Team India management
-
‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్‌కు గంభీర్ వార్నింగ్!
గాలే వేదికగా రేపటి నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇంకా ఖరారు కాలేదు. తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక్క స్థానం విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. సాయి సుదర్శన్ గాయపడడంతో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్‌కు మేనేజ్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని కోచ్ గంభీర్ అతడికి సున్నితంగానే హెచ్చరించినట్లు సమాచారం. పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఉండడంతో ఇంతకాలం జురెల్ అదనపు బ్యాటర్‌గా జట్టులో కొనసాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2025లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ తన ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్గన్‌తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంక-ఏ జట్టుపై సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ ఇటీవలే లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంతో జురెల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించకపోవడం అతడికి మైనస్‌గా మారే అవకాశముంది. అంతేకాదు జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువే ఆడినప్పటికీ, ఒక సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం! -
ఇషాన్ కిషన్ కు పాకిస్థాన్ క్రికెటర్ సపోర్ట్..
-
పిచ్ ఎవరికి అనుకూలం? మార్పులు ఎందుకు చేశారు?
టీ20 వరల్డ్ కప్‌లో మరో ప్రతిష్టాత్మక పోరు కోసం మొహాలి సిద్ధమైంది. సెమిస్ బరిలోని నిలువాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతున్నది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకు మేలు చేసేలా మొహాలీ పిచ్‌లో మార్పులు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ సూచన ప్రకారం టర్నింగ్ ట్రాక్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. 'పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం సిద్ధం చేసిన తరహా పిచ్‌నే మొదట అనుకున్నాం. కానీ టీమిండియా ఈ రకమైన పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్పులు చేయాల్సిందిగా సూచించింది. దీంతో వారు కోరినట్టుగా స్పిన్‌కు, కొద్దిగా బౌన్స్‌కు దోహదపడే పిచ్‌ను రెడీ చేశాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నిజానికి నాగ్‌పూర్ పిచ్ విషయంలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. భారత టీమ్ మేనేజ్మెంట్ సూచన ప్రకారం నాగ్‌పూర్ పిచ్‌లోనూ మార్పులు చేశారు. అయితే న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచేల్ సాంట్నర్, ఐష్ సోధీ రాణించడంతో ఈ వ్యూహం బెడిసికొట్టింది. టీమిండియా దారుణంగా ఓడింది. సహజంగా స్వదేశంలో సిరీస్‌లు జరుగుతున్నప్పుడు ఆతిథ్య జట్టు సూచనల మేరకు పిచ్ సిద్ధం చేయడం మామూలు విషయమే. కానీ, ఐసీసీ పెద్ద టోర్నమెంట్లలో ఆతిథ్యమిస్తున్న జట్టు ఇష్టానుసారంగా పిచ్ మార్చడం కుదరదు. ఐసీసీ నియమించిన క్యూరెటర్ సూచన మేరకు పిచ్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు క్రికెట్‌ను నడిపిస్తున్నది కేవలం డబ్బే. ఆ డబ్బు దండిగా రావాలంటే ఈ మెగా టోర్నమెంట్లో భారత్ ఎక్కువగా ముందుకువెళ్లి ఆడాలి. టీమిండియా ముందుకువెళ్లినప్పుడే టీవీ ప్రసారాల ద్వారా దండిగా సొమ్ము అందుతుంది. ఆ డబ్బే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు కావాల్సిన ఊతమిస్తుంది. కాబట్టే ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా గెలిచేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐ తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. పిచ్ మార్చినా మార్చకున్నా.. ఆటగాళ్లు బాగా ఆడిన జట్టే విజయం సాధిస్తుందని నిపుణులు అంటున్నారు.


