breaking news
Tani Oruvan movie
-
సాహసం శ్వాసగా...
ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్. కెరీర్లో పాతిక చిత్రాలు పూర్తి చేసిన ఆయన తర్వాతి చిత్రం కోసం సాహసాలు చేయడానికి రెడీ అవుతున్నారు. గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. కోలీవుడ్‌లో ‘తని ఒరువన్’ ఫేమ్ దర్శకుడు మోహన్‌రాజా దగ్గర అసోసియేట్‌గా పని చేశారట బిన్ను సుబ్రమణ్యం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. అడ్వెంచరస్ ఎంటర్టైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. దీంతో ఆ పాత్ర కోసం కొంతమంది ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. డిసెంబర్లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
జయం రవితో రొమాన్స్
క్యాథరిన్ ట్రెసా తమిళసినిమా: యువ నటుడు జయం రవితో జతకట్టిన హీరోయిన్లందరూ విజయపథంలో సాగారు. తొలి చిత్ర హీరోయిన్ సదా నుంచి త్రిష, జెనీలియా, ఆసిన్ వీళ్లందరూ టాప్ పొజిషన్‌కి చేరారు. ప్రస్తుతం తనీ ఒరువన్ చిత్రంలో నయనతార, రోమియో జూలియట్ చిత్రంలో హన్సిక జయం రవితో డ్యూయెట్స్ పాడుతున్నారు. అలాగే ఇటీవల ప్రారంభమైన తాజా చిత్రంలో ఒక హీరోయిన్గా అంజలి నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయంరవికి పక్కన మరో హీరోయిన్‌కు చోటుందట. ఈ పాత్ర క్యాథరిన్ ట్రెసాను వరించనున్నది తాజా సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే కార్తీ సరసన మెడ్రాస్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదల కాకముందే అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయట. అందులో ఒకటి జయం రవి చిత్రం. ఈ చిత్రంలో అంజలి గ్రామీణ యువతిగా, క్యాథరిన్ ట్రెసా నాగరిక పాత్రలో స్టైలిష్‌గా అందాలతో దుమ్మురేపే పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. అయితే జయం రవి సరసన నటించడానికి చిత్ర యూనిట్ అడిగిన మాట నిజమేగానీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని క్యాథరిన్ ట్రెసా వర్గం అంటున్నారు. ఈ బ్యూటీ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రజనీకాంత్ చిత్రంలో ఒక పాటకు ఆడి అదరగొట్టారు.