breaking news
Tamil voters
-
కర్నాటకలో కీలకంగా మారిన తమిళ ఓటర్లు
-
ఒట్టేసి చెబుతున్నా..
ఓటుకు నోటు నో..నో 10న కోటి మందితో ప్రతిజ్ఞ చెన్నై: ఓటు హక్కు అనే మాటకు అర్థం మారి పోయి ఓటుకు నోటు హక్కు అనే మనస్తత్వాల్లో మార్పు తెచ్చేం దుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అవును ఒట్టేసిచెబుతున్నా..‘ఓటుకు నోటు తీసుకోను, ఇవ్వను’ అని ఈనెల 10వ తేదీన కోటి మందితో ప్రమాణం చేయిస్తోంది. ఓటు వేసేందుకు డబ్బు పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం కూ డా నేరమే. ఈ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని, నేర తీవ్రతను బట్టి ఏడాది జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. అయినా రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంచే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో నోట్లు పంచడమే కాదు, నగదు అందని ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన సంద ర్భాలు ఉ న్నాయి. ఓటుకు నోటు లేదా, పంచెలు, చీరలు, మద్యం బాటి ళ్లు, బిరియానీ పొట్లాలు పంచడం నేతలు అలవాటుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొని ఉంది. పార్టీల నేతలు, అభ్యర్థులంతా అధికారంలోకి వచ్చేది నువ్వా నేనా అని సవాళ్లు విసురుకుంటున్న దశలో ఎన్నికల నిర్వహణ కఠినతరమైంది. ఎ న్నికల్లో అన్ని ఏర్పాట్ల కంటే నగదు పంపిణీ కాకుండా చేయడం ఈసీకి సవాలుగా మారింది. నగదు చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నడూ లేని విధంగా ఆదాయపు పన్నుశాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. ఈ పరిస్థితిలో ఓటర్లు, నేతల్లో మార్పు తెచ్చేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజలు, వివిధ పార్టీల నేత ల చేత ఓటు వేసేందుకు నోటు తీసుకోం, ఇవ్వం అంటూ ప్రతి జ్ఞ చేయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 66 పోలింగ్ బూతుల వద్ద సుమారు కోటి మందితో ఈ ప్రతిజ్ఞ చే యించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. క నీసం 50 వేల మందైనా వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అలాగే పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఎ న్నికల కార్యాలయాల్లో సైతం సిబ్బం ది చేత ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని తె లిపారు. పార్టీల నేతలు తమ ప్రచా రం ప్రారంభించేటప్పుడు ప్రతిజ్ఞ చే యవచ్చని అన్నారు. రోటరీ, లయన్స్క్లబ్బులు, ఎన్జీవో సంఘాలు, నివాసగృహాల అసోసియేషన్లు, గుడిసెవాసులు సైతం ప్రతిజ్ఞలో పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని అన్నారు. ఒట్టు తీసి చెరువు గట్టుమీద పెట్టకుండా కనీసం ప్రతిజ్ఞ చేసినవారైనా కట్టుబడి ఉంటారని ఆశిద్దాం. -
ఒక్కసారి చెబితే.. మోడీ బలమైన నేత: రజనీకాంత్
తమిళ రాజకీయాలపై సినిమా ప్రభావం అంతా ఇంతా కాదు. 1950ల నుంచే తమిళ నాట సినిమా, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. తమిళ ఓటర్లను ప్రభావితం చేయడంలో తమిళ సినీస్టార్లు ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంతే సానుకూలంగా మాట్లాడితే.. ఏ పార్టీకైనా అది బంపర్ ఆఫరే. తమిళనాడులో తమ పార్టీని పాగా వేయించాలంటే రజనీ సర్ సపోర్ట్ తప్పదని అర్థమైన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఏకంగా రజనీకాంత్ ఇంటికే వెళ్లారు. అయితే, మోడీని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన రజనీకాంత్.. మద్దతు విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారట. ‘మోడీ బలమైన నేత. మంచి పాలనాదక్షుడు. ఆయన ఆకాంక్ష నెరవేరాలి’ అని వ్యాఖ్యానించారట. అది చాలు అనుకున్న రాష్ట బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను, మోడీ-రజనీకాంత్ ఫొటోలను తమ ప్రచారంలో విపరీతంగా వాడుకుంటున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో బీజేపీ ఆరు మిత్రపక్షాల్లో ఒకటైన ఎండీఎంకే కూడా రజనీకాంత్‌ను ఇటీవల తమ అధినేత వైగో కలిసి మద్దతు కోరినప్పటి ఫొటోను ప్రచారంలో ఉపయోగించుకుంటోంది. డీఎంకే బహిషృ్కత నేత, ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కూడా ఇటీవల రజనీకాంత్‌ను కలిశారు.