TAL
-
లండన్‌లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్‌లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు) -
టీఏఎల్ క్రికెట్ లీగ్ విజేతగా కూల్ క్రూయిర్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చైర్మన్ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్ నార్త్’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయని తెలిపారు. ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గర్ల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు. 2008లో లండన్‌లో టీఏఎల్ క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్ లీగ్ ఫార్మాట్‌గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్‌లను అభినందించారు. -
లండన్‌లో 'తాల్' ఉగాది ఉత్సవాలు
లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను లండన్‌లోని రెడ్ బ్రిడ్జ్ టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించింది. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది తెలుగు కుటంబాలతో కలిసి నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ ఉగాది వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకలను తాల్ ఉగాది కన్వీనర్ శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. తాల్ కల్చరల్ సెంటర్ (టీసీసీ) లలో సంగీతం, నృత్య కళలను అభ్యసిస్తున్న చిన్నారుల నృత్యాలు, ఆటపాటలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. టీసీసీ సంగీత అధ్యాపకురాలు వీణా పాణి కీర్తనలు, జ్యోత్స్నల వయోలిన్ కచేరి, సిజ్జ్ మీనన్, అరుణి మాల నృత్య ప్రదర్శనలు, తాల్ యూత్ బృంద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్యగాయకులు గోపిక పూర్ణిమ, మల్లికార్జున వైవిధ్య భరితమైన పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. కమెడియన్లు అభి, అవినాష్‌లు తమ హాస్య ప్రదర్శనలు, అనుకరణలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి సినీ నటి ప్రణీత, ఇల్ఫోర్డ్ ఎంపీ మైక్ గేప్స్, ఈస్ట్ హామ్ కౌన్సెలర్ పాల్ సతియానెసన్, భారత రాయబార కార్యాలయ అధికారి సౌమేంద్ర మహాపాత్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలను ప్రణీత అభినందించారు. లండన్‌లోని పిల్లలు తెలుగులో మాట్లాడటం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల, వైస్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి, ట్రస్టీలు మల్లేష్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, శ్రీవాస రావు కొర్నెపాటి, కిరణ్ కప్పెటలు ఈ వేడుకను విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు. ఈ ఏడాది హేమ మాచెర్ల సంపాదకీయంతో వచ్చిన తాల్ వార్షిక పత్రిక 'మా తెలుగు'ను ఆవిష్కరించారు. ప్రతిఏటా తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)పేరిట నిర్వహించే క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాల్ ఉగాది 2017 ఆర్గనైజింగ్ టీం, ప్రేక్షకులు, కళాకారులు, వాలంటీర్లు, సహకరించిన ఇతర సంస్థలకు, ఆర్థికంగా సహకరించిన వ్యాపార సంస్థలకు తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల కృతజ్క్షతలు తెలిపారు.