breaking news
Takita Tadimi Tandana Movie
-
నవ్విస్తూనే ఆలోచింపజేసే చిత్రం ‘తకిట తదిమి తందాన’
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘తకిట తదిమి తందాన’(Thakita Thadhimi Tandana). రాజ్ లొహిత్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆదిత్య (ఘన ఆదిత్య) నకిలీ సర్టిఫికెట్స్‌తో ఓ పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. సాలరీ అంతా జల్సాల కోసం ఖర్చు చేస్తాడు. ఇక పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవుదామనుకునే సమయంలో ఉద్యోగం ఊడిపోతుంది. దీంతో క్రెడిట్ కార్డులను వాడేసి పెళ్లి చేసుకుంటాడు. ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని అబద్దం చెప్తాడు. చాన్నాళ్ళపాటు ఉద్యోగం రాక ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చుని ఉద్యోగం కోసం వెతుకుతాడు. అదే సమయంలో లోన్ యాప్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి. ఒకవైపు ఉద్యోగం లేదు..మరోవైపు అప్పు కట్టమని బెదిరింపులు.. మరి ఆదిత్య ఏం చేశాడు? తన తప్పుడు నిర్ణయాలు తన జీవితాన్ని ఎలా మార్చాయి? అనేదే ఈ సినిమా కథ. జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసే చిత్రమే తకిట తధిమి తందాన. ఓవర్ కాన్ఫిడెన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ.ఎప్పటికీ ఇలాగే పెద్ద మొత్తంలో నెలనెలా జీతం అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుందనే భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు కొంతలోకొంత కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.స్వయంగా కథ - సంభాషణలు సమకూర్చుకున్న రాజ్ లోహిత్... రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా... దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యగా... హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో... ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం "స్విగ్గి బాయ్" అవతారం ఎత్తడం వంటి సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి.రామ్ గోపాల్ వర్మ "మర్డర్"తోపాటు... "సమ్మేళనం" అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యువతరానికి ప్రతినిధిలా తన పాత్రలో ఒదిగిపోయాడు. తనను తాను ఇంకొంచెం సానబెట్టుకుంటే ఈ కుర్రాడికి హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి "ప్రియ కొమ్మినేని"కి కూడా. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. హావభావాలపై మరి కాస్త దృష్టి పెడితే, ఈ అచ్చ తెలుగమ్మాయికి కూడా ప్రేక్షకులు కచ్చితంగా పట్టం కడతారు. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా... కథకు/సినిమాకు చాలా హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. యూత్ ఫుల్ చిత్రం అనగానే.. అనవసరమైన అసభ్యతను చొప్పించే నేటి కాలంలో... హీరోహీరోయిన్ల నడుమ వచ్చే రొమాంటిక్ సీన్స్.. శృతి మించకుండా, పొయిటిక్ గా తెరకెక్కించడం యూత్ కూడా ఇష్టపడేలా ఉన్నాయి. -
తకిట తదిమి...
ఘన ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేసి, ‘‘మంచి కంటెంట్ ఉన్న ఫీల్‌గుడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ‘‘సినెటేరియా మీడియా వర్క్స్ వెంకట్ బులెమోని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చందన్‌కుమార్ తెలిపారు -
ఏ చిత్రానికయినా కంటెంటే అత్యంత కీలకం: మంత్రి కోమటిరెడ్డి
తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త నటీనటులా అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌గా నిలిచే చిత్రాలు మంచి విజయాలను అందుకొంటున్నాయని తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయని ఆయన్ తెలిపారు. "తకిట తదిమి తందాన"(Takita Tadimi Tandana Movie) చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కారం అనంతరం ఆయన చిత్రబృందాన్ని అభినందిస్తూ పైవిధంగా పేర్కొన్నారు."మర్డర్" మూవీలో హీరోగా నటించిన ఘన ఆదిత్య, నూతన తెలుగు అమ్మాయి ప్రియ జంటగా యువ దర్శకుడు రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మాంగో ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన "తకిట తదిమి తందాన" చిత్ర ఫస్ట్ లుక్ ను మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, సినీటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమోని, చిత్ర దర్శకుడు రాజ్ లోహిత్, నిర్మాత చందన్ కుమార్ కొప్పులతోబాటు, నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన తకిట తదిమి తందాన" చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత చందన్ కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆద్వర్యంలో విడుదల కానుంది.