breaking news
Taara
-
అర్జున్ పై నటీమణుల ప్రకటనలు
శాండల్‌వుడ్‌లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరో అర్జున్ సర్జాను తనను వేధిం చారని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండించడం జరిగిపోయింది. మేఘనా గాంవ్కర్, అవంతిక షెట్టి శ్రుతికి సోమవారం మద్దతు ప్రకటించగా, ఈ తరుణంలో అర్జున్‌కు అండగా ఖుష్బు, హర్షిక, తార గళమెత్తారు. అర్జున్ జెంటిల్మెన్ అన్నారు. కర్ణాటక, యశవంతపుర: మీటూ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు అర్జున్‌కు పలువురు నటీనటులు అండగా నిలిచారు. అర్జున్‌పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలను ఖండిస్తూ ప్రముఖ నటి ఖుష్బూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘శ్రుతి ఆరోపించిన విధమైన వ్యక్తి అర్జున్ కాదు. ప్రతి ఒక్కరికీ ఆయన మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. అయన అలా చేయలేదనటానికి నేరు గ్యారంటీ ఇస్తాను. 34 ఏళ్ల నుండి సినిమా రంగంలో నాకు పరిచయం. నేను నటించిన మొదటి సినిమాకు ఆయన హీరో. ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదదు. శ్రుతి హరిహరన్ ఆరోపణలు విని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక కుటుంబానికి తండ్రైన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆరోపణలు చేసే ముందు యోచించాలి. ఇప్పుడు అర్జున్‌కు నేను మద్దతు ఇవ్వకుంటే 34 ఏళ్ల స్నేహానికి అవమానం కలుగుతుంది’ అని ఆమె చెప్పారు. అలాంటి వ్యక్తులా మీ టూ అనేది: హర్షిక అర్జున్‌కు అందాల నటీమణి హర్షికా పూణచ్ఛ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రుతి హరిహరన్పై పరోక్షంగా ఆరోపణల వర్షం కురిపించారు. ‘నేడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే నాడు ప్రముఖు వ్యక్తుల జతలో అర్థనగ్న ప్రదర్శనలు చేశారు’ అని హర్షిక సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్డడం సంచలనం కలిగిస్తోంది. ‘మీటూ ఆరోపణలను గమనిస్తున్నాను. అయితే ఒక మహిళగా నేను చిత్రరంగాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా. ఒక మహిళను గౌరవించటం ధర్మం. అయితే పబ్లిసిటీ కోసం ఒక కుటుంబాన్ని విడదీసి వారి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దశాబ్దాలుగా చిత్ర రంగంలో ఉంటున్న వ్యక్తుల పేరును ఒక అసత్యం ద్వారా చెడగొట్టవద్దు. అ వ్యక్తి (అర్జున్) ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో గమనించాలి. పేరు రావడానికి ఏం చేసినా సరిపోతుంది. పేరు వచ్చిన తరువాత తను ఏం మాట్లాడినా సరిపోతుందని భావించటం పద్ధతి కాదు’ అని శ్రుతిపై మండిపడ్డారు. పేరున్న నిర్మాత తనకు ఒక వీడియో చూపించారని, మీటూ అంటున్న నటి ఆ వ్యక్తి భుజం మీద నిద్రిస్తున్న వీడియోను చూశానని, అలాంటి మీ టూ అంటుంటే సిగ్గేస్తోందని చెప్పారు. అర్జున్ సర్జా మంచోడు : నటి తార మండ్య: మీటూ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ నాయకురాలు, నటి తారా అనురాధ తెలిపారు. ప్రచారంలో ఆమె మాట్లాడారు. బహుభాషా నటుడు అర్జున్ సర్జాపై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన ఆరోపణల వ్యవహారంలో అర్జున్ సర్జాకే మద్దతు తెలుపుతున్నామన్నారు. అర్జున్‌తో తాము గతంలో పలు చిత్రాల్లో కలసి నటించామని ఎప్పుడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. అయితే నటి శృతి ఆరోపణలు అవాస్తమనేది తమ ఉద్దేశం కాదన్నారు. అర్జున్‌పై ఎందుకు ఆరోపణలు చేశారో తమకు అంతుచిక్కడం లేదన్నారు. -
ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన
ముంబై:క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్'. గత మే నెలలో రిలీజ్ అయిన 'సచిన్' మూవీకి మంచి ఆదరణే లభించింది. అటు పెద్దల్ని నుంచి ఇటు చిన్నల వరకూ సచిన్ మూవీ బాగానే అలరించింది. ఈ క్రమంలోనే ఆ సినిమా చూసిన ఆరేళ్ల పాప తార సచిన్ కు లేఖ రాసి వార్తల్లో నిలిచింది. సచిన్ అంకుల్ అంటూ లేఖను మొదలుపెట్టిన తార.. సినిమా గురించి పలు విషయాల్ని సచిన్ తో షేర్ చేసుకుంది. మీరు చివరి మ్యాచ్ ఆడేటప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందంటూ లేఖలో వివరించింది. మిమ్మల్ని, అంజలీ ఆంటీని కలవాలని ఉందంటూ ముగించింది. దీనికి సచిన్ స్పందించాడు. ఈ లేఖ రాసినందుకు నీకు కృతజ్ఞతలు.నా సినిమా చూసి ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ముందుకు సాగు'అని సచిన్ బదులిచ్చారు. దీనిలో భాగంగా ఆ పాప రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సచిన్. Hi, Taara! Thank you so much for writing to me.. I'm really glad that you enjoyed the movie. Keep smiling :) pic.twitter.com/2UWFJ3kZB9 — sachin tendulkar (@sachin_rt) 8 September 2017