breaking news
Swarna rathotsavam
-
శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు:స్వర్ణరథంపై గోవిందుడు
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథంపై దర్శనమిస్తున్నారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగుతున్నారు స్వర్ణరథనాకి కల్యాణకట్ట నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. ఈరోజు ఉదయం హనుమంత వాహనంలో దర్శనమిచ్చారు శ్రీవారు. ఈ రాత్రికి గజవాహనంలో దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. టీటీడీ ఏర్పాట్లు భేష్.. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు. -
తిరుచానూరులో వైభవంగా స్వర్ణ రథోత్సవం
తిరుచానూరు (చిత్తూరు): తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. ఏటా అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో నిద్రమేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం సన్నిధి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. ఉదయం 7గంటలకు భక్తుల కోలాటాల నడుమ సర్వాంగ శోభితురాలైన శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి స్వర్ణరథాన్ని లాగే కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్వర్ణరథోత్సవంలో టీటీడీ తిరుపతి జేఈవో భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.