breaking news
suryakantam
-
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
పూజ.. కాంతం.. నేను
‘‘నా తొలి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ రిలీజ్ కాకముందే సైన్ చేసిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ అన్న చెబితే కథ విన్నా, నచ్చింది చేశా. నా తొలి సినిమా ఎంత ఆడిందనే విషయాన్ని పక్కనపెడితే నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కుర్రాడు బాగా చేశాడు’ అని అందరూ అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నా పాత్రకు నేను న్యాయం చేసినప్పుడు బాధపడను’’ అని రాహుల్ విజయ్ అన్నారు. నిహారిక కొణిదెల, పెర్లెన్ భేసానియా, రాహుల్ విజయ్ ముఖ్య తారలుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ విజయ్ చెప్పిన విశేషాలు. ► ‘సూర్యకాంతం’ తొలి సగం ఫన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్ చాలా బాగుంటాయి. ఇందులో నేను అభి అనే పాత్ర చేశాను. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండే పాత్ర. పూజ , కాంతం పాత్రల మధ్య నలిగిపోయే ఇన్నోసెంట్ పాత్ర. నా నిజ జీవితానికి, ఈ పాత్రకీ సంబంధం ఉండదు. అందుకే ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా. ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంటుంది. ► నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయడం నాకు ఇష్టమే. ఇప్పటికిప్పుడు యాక్షన్ హీరో అయిపోవాలనేం లేదు. 30 ఏళ్లలోపు వీలైనన్ని ప్రయోగాలు చేయాలని ఉంది. నటుడిగా నా వంతు కృషి చేయాలి. అందుకే ఈ సినిమా చేశా. నిహారిక చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమన్. ఎవరితో ఎలా ఉండాలో తనకి తెలుసు. అలా లేకుంటే అడ్వాంటేజ్ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి అంశాలకు తను ఎక్కడా స్కోప్ ఇవ్వదు. ఈ సినిమా తర్వాత ప్రణీత్ చాలా ఎత్తుకు ఎదుగుతాడు. ► తెలుగు, తమిళ్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నా. కన్నడ ‘కాలేజ్ కుమారా’ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రంలో మా నాన్న పాత్రలో తెలుగులో శ్రీకాంత్‌గారు, తమిళ్లో ప్రభుగారు చేస్తున్నారు. ఏప్రిల్ మూడోవారం నుంచి షూటింగ్ ఉంటుంది. దీని తర్వాత మణి అనే కొత్తబ్బాయి డైరెక్షన్లో కిక్ బాక్సింగ్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తా. నేను కూడా నాలుగేళ్లు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించా. నాన్నగారు (విజయ్) స్టంట్ మాస్టరే అయినప్పటికీ ఆయన దగ్గర ఎప్పుడూ నేర్చుకోలేదు. నాన్నగారు కథ విని, అవసరమైతే సలహాలు ఇస్తారు. ఫైనల్‌గా నిర్ణయం మాత్రం నాదే. -
ఎవరి లైఫ్‌లోనూ ఆమె ఉండకూడదు
‘‘సూర్యకాంతం’ సినిమా టీజర్ చూడగానే థ్రిల్ ఫీలయ్యా. సినిమా ఓపెనింగ్ టైమ్‌లో నిహారిక పాత్ర బావుందని వరుణ్ తేజ్‌తో చెప్పా. లేడీ అర్జున్రెడ్డిలాగా బాగా చేసింది. ఈ నెల 29న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది మా బ్యానర్లో ఇది మూడో హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్ అయ్యే పాత్రలో రాహుల్ విజయ్ నటన నన్ను ఆకట్టుకుంది. రాహుల్‌లో ఆ టాలెంట్ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నా. నా లైఫ్‌లోనే కాదు, ఎవరి లైఫ్‌లోనూ సూర్యకాంతం ఉండకూడదు’’ అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నాగబాబుగారి కొడుకుగా ఓ సినిమాలో నటించా. అందుకే నిహారికకు అన్నగా ఇక్కడికి వచ్చాను. ‘సూర్యకాంతం’ టీజర్ చాలా బావుంది. నా ‘అర్జున్ రెడ్డి’ సినిమాని సృజన్, సందీప్ అమెరికాలో విడుదల చేశారు. వాళ్లకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘సూర్యకాంతం’ సినిమా ఈ రోజు ఇక్కడి వరకు వచ్చిందంటే కారణం మా అన్న వరుణ్‌తేజ్. టీమ్ అంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి ఈ సినిమా చేశాం. నా పాత్రకు 100 శాతం న్యాయం చేశానని అనుకుంటున్నా’’ అన్నారు నిహారిక కొణిదెల. ‘‘ప్రణీత్‌ను పిలిపించి అభి క్యారెక్టర్‌కి నేను సూట్ అవుతానని వరుణ్ తేజ్ అన్న సూచించారు. నిహారికగారు సూర్యకాంతం టైటిల్‌కి కరెక్టుగా సరిపోయారు’’ అని రాహుల్ విజయ్ అన్నారు. ‘‘దిల్’ రాజుగారు మా సినిమా చూసి, రిలీజ్ చేస్తుండటం మాకు చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా’’ అన్నారు ప్రవీణ్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒక్కరైన సందీప్ ఎర్రంరెడ్డి’’ అన్నారు. కృష్ణకాంత్, విజయ్ మాస్టర్, దివ్య, కాలభైరవ, పెర్లిన్, మార్క్ తదితరులు పాల్గొన్నారు. -
అవతలివాళ్ళకు కష్టం వచ్చిందంటే... అమ్మే మొక్కుకొనేది!
సూర్యకాంతం... సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. విచిత్రమైన మాటవిరుపు, విసురైన చేతి వాటంతో తెరపై గయ్యాళితనం వెలిగించిన నట సూర్యమణి ఆమె. సూర్యకాంతమనే పేరే గయ్యాళి తనానికి మారుపేరన్నంత పేరు తెచ్చిన ఆమె నిజజీవితంలో ఆ స్క్రీన్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా శాంతమూర్తి. ఆపదలో ఉన్నవాళ్ళెవరైనా సరే వాళ్ళ కోసం దేవుడికి మొక్కే ప్రేమమూర్తి. అందరికీ వండి వడ్డించే మాతృమూర్తి. మరి, ‘పొన్నాడ’ వారి ఇంట పుట్టి, ‘పెద్దిభొట్ల’ వారింట మెట్టి, అక్క కొడుకునైన తననే సొంత కొడుకుగా పెంచుకున్న ‘అమ్మ’ గురించి ఆమె దత్తపుత్రుడు ఏమంటారు? ఇవాళ సూర్యకాంతం 90వ జయంతి సందర్భంగా, మునుపెన్నడూ పత్రికల్లోకి ఎక్కని మాజీ బ్యాంకు ఉద్యోగి, హోమియో డాక్టర్ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి ‘అమ్మ’ గురించి ఆత్మీయంగా పంచుకున్న ముచ్చట్లు... మా అమ్మ సూర్యకాంతం నిజానికి నాకు స్వయానా పిన్ని. నన్ను దత్తత తీసుకొని, కన్నబిడ్డలా పెంచి, పిన్నే నాకు అమ్మ అయింది. అమ్మ పుట్టింది ఇప్పటికి సరిగ్గా 90 ఏళ్ళ క్రితం. కాకినాడకు 8 కిలోమీటర్ల దూరంలోని వెంకట కృష్ణరాయ పురంలో. తాతయ్య పొన్నాడ అనంతరామయ్య ఆ ఊరికి కరణం. మా అమ్మమ్మ (వెంకట రత్నం), తాతయ్యలకు అమ్మ సూర్యకాంతం 14వ సంతానం. ఆ 14 మందిలో మిగిలింది నలుగురే! మూడో బిడ్డ నాకు జన్మనిచ్చిన తల్లి సత్యవతి అయితే, కడగొట్టు బిడ్డ - అమ్మ సూర్యకాంతం. మా తాతయ్య జ్ఞాపకంగా నాకు అనంత పద్మనాభమూర్తి అని అమ్మ పేరు పెట్టింది. అందుకే పేరుతో కాకుండా, ‘నాన్నా’ అనే పిలిచేది. నా కన్నతల్లి వారింటి పేరు నిలపడం కోసం నాకు ‘దిట్టకవి’ అనే ఇంటిపేరే కొనసాగించింది. మద్రాసు బండిలో... అమ్మ, అమ్మమ్మ అమ్మ సినిమాల్లోకి రావడం గమ్మత్తుగా జరిగింది. అమ్మకు ఆరేడేళ్ళ వయసులోనే తాతయ్య చనిపోయారు. దాంతో, కొన్నాళ్ళు కాకినాడలో తన పెద్దక్క, బావల దగ్గర అమ్మ పెరిగింది. అయితే, చదువు ఒంటబట్టలేదు. చిన్నతనంలో అమ్మ కొద్దిగా పెంకి. పృథ్వీరాజ్ కపూర్ హిందీ చిత్రాలంటే తగని పిచ్చి. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి హిందీ సినిమాలు చూసేవారట. అలా చిన్నప్పుడే సినిమాల మీద మక్కువ కలిగింది. చివరకు పెద్దక్క ఒప్పుకోకున్నా, అమ్మ, ఆమె వెంటే మా అమ్మమ్మ మద్రాస్‌కు బండెక్కే శారట. ‘నారద నారది’ (1946) అమ్మ తొలి సినిమా. గమ్మత్తేమిటంటే, అమ్మ మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకున్నా, సినీ రంగంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే క్యారెక్టర్ వేషాల వైపు మళ్ళారు. దానికి ఓ కారణం ఉంది. మద్రాసులో అమ్మ ఒకసారి రోడ్డు మీద వెళుతుంటే, ఓ యాక్సిడెంట్ జరిగింది. ముక్కు మీద మచ్చ పడింది. అది క్లోజప్‌లో తెలిసిపోతుందని గ్రహించి, నాయిక పాత్రలకు దూరంగా ఉన్నానని అమ్మే స్వయంగా చెప్పింది. అంతకు ముందు ఎన్నో పాత్రలతో పేరు తెచ్చుకున్నా ‘గుండమ్మ కథ’ (’62) నుంచి ‘సూర్యకాంతం శకం’ ఆరంభమైందని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభ చివరి దాకా కొనసాగింది. భానుమతికి ‘సూర్యం’... అంజలీదేవికి ‘అమ్మ’ సినీ రంగంలోని తోటి నటీనటులందరికీ అమ్మంటే ప్రాణం. తొలి రోజుల నుంచి నటి భానుమతి గారికి అమ్మతో మహా దోస్తీ. ఆవిడ కష్టసుఖాలు ఈవిడకీ, ఈవిడ కష్టసుఖాలు ఆవిడకీ చెప్పుకొనేవారు. అంత ఆంతరంగికులు. భానుమతి గారు అమ్మను ‘సూర్యం’ అని పిలిచేవారు. అలాగే, అంజలీ దేవి అమ్మను సాక్షాత్తూ కన్నతల్లిగా భావించేవారు. తెర మీద ఇద్దరూ ప్రత్యర్థుల్లా కొట్టుకున్నట్లు కనిపించినా ఛాయాదేవి, అమ్మ మంచి స్నేహితులు. మా ఇంట్లో శుభ కార్యాలన్నిటికీ ఆమె వచ్చేవారు. ఇక, కాంచన, గీతాంజలి, రమాప్రభ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. రాధాకుమారి అయితే వారానికి ఒకసారి అమ్మను కలవాల్సిందే. పండుగ, పబ్బం ఏదొచ్చినా తోటి నటులకు అమ్మ ఉండాల్సిందే. నటి - మాజీ ముఖ్య మంత్రి జయలలిత తల్లి సంధ్యతో అమ్మకు సాన్నిహిత్యం. తెరపై గయ్యాళి భార్య... ఇంట్లో నాన్నకు అనుకూలవతి నాన్న గారు పెద్దిభొట్ల చలపతిరావు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. మద్రాసుకొచ్చి, హైకోర్ట్‌లో వకీలుగా స్థిర పడ్డారు. ప్రసిద్ధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీగల్ అడ్వైజర్. ఆయనకు నాటకాలన్నా, పద్యాలన్నా తగని ప్రేమ. పద్యాలు బాగా పాడేవారు. ఆ కళాభిరుచితోనే 1950లో అమ్మను ద్వితీయ కళత్రంగా చేసుకున్నారు. తెరపై గయ్యాళి భార్యగా కనిపించే అమ్మ, జీవితంలో భర్త మనసెరిగి ప్రవర్తించే అనుకూలవతైన ఇల్లాలు. నాన్న కూడా అమ్మ మీద ఎప్పుడూ ఎలాంటి షరతులూ పెట్టలేదు. సినిమా వాతావరణం, ఆ భేషజాలు ఇంట్లో ఎక్కడా ఉండేవి కాదు. సాదా మధ్యతరగతి జీవితాన్నే అమ్మ ప్రేమించింది. వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి, రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే నన్ను దత్తత తీసుకున్నారు. వారి బిడ్డగా పెరగడం అదృష్టం. కుటుంబ సభ్యుల మీద అమ్మకెంత ప్రేమంటే, రాత్రి నిద్ర మధ్యలో లేచినప్పుడు ఒక్కసారి అందరినీ చూసొచ్చి కానీ పడుకొనేది కాదు. ఆ అలవాటే నాకూ వచ్చింది. విపరీతమైన భక్తి... విచిత్రమైన మొక్కులు అమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలు చేస్తుండేది. రోజూ తెల్లవారుజామున 4.30 కల్లా లేచి, స్నానాదికాలు ముగించుకొని, లక్ష్మీదేవికీ, వెంకన్నకీ ఓ అరగంట పూజ చేసి, అన్నపూర్ణాదేవికి పాలు నైవేద్యం పెట్టిన తరువాత కానీ బయటకు వెళ్ళేది కాదు. ఉదయం 7.30 కల్లా వంట చేసేసి, షూటింగ్‌కు వెళ్ళేది. తిరుమలలో అమ్మ పేరు మీద కాటేజీ ఉంది. రెండు నెలలకోసారి తిరు మల వెళ్ళాల్సిందే! అలాగే, సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ గుడి అంటే అమ్మకు మహాభక్తి. నెలనెలా వెళ్ళాల్సిందే! అప్పట్లో ఆ గుడి ఇంత ప్రాచుర్యం పొందలేదు, పెద్దదీ కాలేదు. చిన్న గుడి, బయటకు ఓపెన్‌గా ఉండేది. వచ్చే పోయేవారి కోసం అక్కడ గుడి పక్కనే గది కట్టించి, వసతులు కల్పించింది. అలాగే, ఏడాదికి ఒకసారి బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాద్రి అప్పన్న - ఇలా అందరినీ దర్శించుకొని రావాల్సిందే! సినిమాల్లో గయ్యాళిగా చేసిందే కానీ, అమ్మ స్వభావం అందుకు పూర్తి వ్యతిరేకం. పైకి గంభీరంగా, నిబ్బరంగా కనిపించినా, సున్నిత మనస్కురాలు. ప్రేమ అయినా, బాధ అయినా ఆమె పైకి పెద్దగా వ్యక్తం చేసేది కాదు. తనలో తానే ఉండేది. అందరి మంచీ కోరుకొనేది. ఆమెకు నమ్మకాలు ఎక్కువ. తన, పర భేదం లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ క్షేమం కోసం ‘దేవుడా! దేవుడా!’ అంటూ, మొక్కులు మొక్కడం అమ్మలోని ప్రత్యేక లక్షణం. ఆమె ఊతపదాన్ని ఆ మధ్య సినిమాల్లో కూడా పెట్టినటు ్లన్నారు. అలాగే, ‘‘ఏంటి తల్లీ! రోజూ పూజ చేస్తున్నా. డబ్బులివ్వవేంటీ?’’ అని మనం దరితో మాట్లాడుతున్నట్లే అమ్మవారితో అమ్మ మాట్లాడేది. నిర్మాత, దర్శకులను కన్న తల్లితండ్రుల్లా భావించేది. వాళ్ళ క్షేమం కోసమే తపించేది. పనివాళ్ళకు అనారోగ్యం వచ్చినా అంతే! ‘అదృష్టవంతులు’ చిత్ర సమయంలో ప్రమాదం జరిగి, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కారు మధ్యలో ఇరుక్కొన్నారు. వెంటనే అమ్మ ఇంట్లో మా అందరితో ‘మృత్యుంజయ మంత్రజపం’ చేయించడం నాకిప్పటికీ గుర్తు. ‘బందిపోటు దొంగలు’ అవుట్డోర్ షూటింగ్లో నటుడు జగ్గయ్య గుఱ్ఱం మీద నుంచి పడిపోతే, నిర్మాతెంతో నష్టపోతాడన్న భయంతో రకరకాల మొక్కులు మొక్కుకుంది. ఆమె మొక్కుకొనే మొక్కులు కనీవినీ ఎరగనివి. ఉదాహరణకు, ‘బాల బాలాజీ వ్రతం’ అనేది! ప్రతి శనివారం అయిదుగురు చిన్నపిల్లల్ని తీసుకురమ్మనేది. వాళ్ళను వెతికి పట్టుకురావడం నా పని. రకరకాల వంటలు వండి, మడిగా వడ్డించేది. స్కూళ్ళకు వెళ్ళే లోపల ఇవన్నీ చేసి వాళ్ళకు పెట్టి, స్కూల్లో తినడానికీ కట్టి పంపించేది. ఆ వ్రతం ఎక్కడా ఉండేది కాదు.. ఆమె అనుకొని చేసేసేది. అంతే! ఆరోగ్యం బాగుపడుతుందంటే, దర్గాకూ పంపేది. పుస్తకాల పురుగు... పది భాషల్లో ప్రవీణ! అమ్మకు దానగుణం కూడా ఎక్కువే. ఉన్న దాంట్లోనే దాన దర్మాలు చేసేది. చిన్న చిన్న పత్రికలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచేది. మా అమ్మ స్కూలు చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే కానీ, నవలలు, పత్రికలు, పురాణాలు - ఇలా ఏ పుస్తకమైనా తెగ చదివేది. పొద్దున్నే ‘ఆంధ్రపత్రిక’ డైలీ కాస్త ఆలస్యంగా వస్తే చాలు... పేపర్ కుర్రాడికి అమ్మ చేత అక్షింతలు పడేవి. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి నవలలంటే అమ్మకు ఇష్టం. ఇంట్లో ఉంటే అందరం ఎవరికి వాళ్ళం పుస్తకాలు చదువుకోవడమే. బాపు జోక్స్ అన్నా, ముళ్ళపూడి అన్నా అమ్మకు భలే ఇష్టం. అమ్మకు ఓ చిత్రమైన అలవాటుండేది. విమాన ప్రయాణంలో ఇచ్చే బోర్డింగ్ పాస్‌లు మందంగా ఉంటాయి కాబట్టి, పుస్తకాల్లో వాటిని బుక్మార్క్లుగా వాడేది. ఆమెకు కుక్కలు, చేపల పెంపకమంటే తగని పిచ్చి. చివరి దాకా వాటిని వదులుకోలేదు. చిన్నప్పుడు పెద్దగా చదువుకోకపోయినా, మద్రాసుకు వచ్చాక ఇంగ్లీషు నేర్చుకుంది. పుస్తకాలు చదివి చదివి తెలుగులో ప్రావీణ్యం సంపాదించింది. రకరకాల భాషలు నేర్చుకోవడం అమ్మకిష్టం. ఆమెకు 10 భాషలు వచ్చు. 50 ఏళ్ళ వయసులో ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచీ అమ్మది ఎడమచేతివాటం. సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. సహజనటి అయిన అమ్మ ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగ్ వింటే, ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకొనేది. అయితే, బహిరంగ సభలకు రావడం, మాట్లాడడం తక్కువ. మైక్ ఇచ్చారంటే, మాట్లాడలేదు. నవ్వేసి కూర్చొనేది. ప్రసిద్ధ రచయిత కొవ్వలి తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను అమ్మకు అంకిత మిచ్చి, నాన్న గారి ద్వారా సభకు ఒప్పించారు. ఆ సభకు కృష్ణశాస్త్రి, కొడవటిగంటి లాంటివారంతా హాజరయ్యారు. తెర మరుగైన సూర్యకాంతి సహజ నటి అయిన అమ్మకు ‘పద్మశ్రీ’లు ప్రభుత్వాలు ఇవ్వలేదు కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆమె గురించి గొప్పగా మాట్లాడతారు. ఊహించని రీతిలో చుట్టుపక్కలి మిత్రులే శత్రువులవడంతో నాకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు, అసహజ రోడ్డు ప్రమాదం అమ్మను కుంగదీశాయి. మనోవేదనతో 1994లో అమ్మ కన్నుమూసింది. నమ్మిన వాళ్ళ పన్నాగాలతో మాకు ఆస్తిపాస్తులు, చివరకు అమ్మ ఫోటోలు సైతం మిగలలేదు. పాత ఇల్లు పడేసి కట్టినచోట ఈ ఒక్క ఫ్లాట్ దక్కింది. అయితేనేం, ఇవాళ్టికీ సూర్యకాంతం గారి అబ్బాయినంటే దక్కే గౌరవం, ప్రేమ అంతా ఇంతా కాదు. అమ్మ నాకిచ్చివెళ్ళిన పెద్ద ఆస్తి అదే! ఆ తృప్తి చాలు. సంభాషణ: రెంటాల జయదేవ అమ్మది అమృతం లాంటి వంట... అన్నపూర్ణ లాంటి మనసు! అమ్మ చేతివంట అమృతం. అమ్మ చేసే ములక్కాడల పులుసు, ఉల్లి పాయల పులుసు, పులిహోర లాంటివి నాలుగు రోజుల పాటు పాడవకుండా ఉండేవి. షూటింగ్‌లకు కూడా రెండు బుట్టల్లో నాలుగు క్యారేజీల నిండా భోజనం, మిఠాయిలు, చిరు తిండ్లు పట్టుకు వెళ్ళేది. అమ్మ షూటింగ్లో ఉందంటే, సెట్లోని వాళ్ళకు పండగే! ఎన్టీఆర్ సైతం ‘అక్కయ్య గారూ.. ఏం తెచ్చారు’ అని అడిగి మరీ వడ్డించుకొనేవారు. తెల్లవారుజామునే లేచి పూజ చేసుకొని, వంట చేసి, మాకు క్యారేజీలు కట్టి, తను సిద్ధమై క్యారేజీలు తీసుకొని మరీ షూటింగ్‌కు వెళ్ళేది. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలు... అప్పటికప్పుడు వాళ్ళ కోసం ఫలహారమో, మిఠాయిలో, చిరుతిండ్లో స్వయంగా వండి పెట్టేది. ఇంటికి వచ్చినవాళ్ళు తప్పనిసరిగా ఏదైనా తిని వెళ్ళాలి. లేకపోతే, ఆమె మనసు ఊరుకోదు. చివరలో అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఇంటికి వస్తే, పెట్టడానికని జంతికలు, పాలకాయలు, సున్నుండల లాంటివి కొని డబ్బాల్లో ఉంచేది. కూల్‌డ్రింక్ సీసాలు క్యాన్లకు క్యాన్లు తెప్పించి ఉంచేది. ‘నాయనా! నేను లేవలేనురా! అక్కడ ఉన్న ఆ కూల్‌డ్రింక్ తీసుకొని, ఆ ఓపెనర్‌తో మూత తీసుకొని, తాగి వెళ్ళరా!’ అని చెప్పేది. చనిపోయేదాకా ఆవిడలోని ఆ అన్నపూర్ణేశ్వరి లక్షణం పోలేదు.