breaking news
survey process
-
AP: ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వే
సాక్షి, అమరావతి: డిజిటల్ క్రాప్ సర్వే (కేంద్ర ప్రాయోజిత పథకం) పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజ తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సహా ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ ఆహూజ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మ్యాచింగ్ గ్రాంట్‌గా 40 శాతం నిధులు సమకూరుస్తోందన్నారు. కేంద్రం తన వంతుగా రూ.47.59 కోట్లు కేటాయించిందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రతి రైతుకు యూనిక్ ఐడీ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన సమాచార సేకరణ, నిర్వహణతోపాటు ప్రతి రైతుకూ యూనిక్ ఐడీలను ఇవ్వాల్సి ఉంటుందని ఆహూజ తెలిపారు. అలాగే యూనిఫైడ్ ఫార్మర్ సరీ్వస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్‌ఎస్‌ఐ)ను అందుబాటులోకి తేవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం, ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే వివిధ పంటలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చన్నారు. ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభిస్తామని చెప్పారు. సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే మంచి నిర్ణయమన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేపై వివిధ సందేహాల నివృత్తికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడతారన్నారు. ఈ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. దీని అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి -
ఉంటాయో... ఊడుతాయో!
- సరికొత్త షరతులతో పింఛన్‌దారుల ఆందోళన - పింఛన్ పెంపు ఆనందాన్ని ఆవిరి చేసిన ఆంక్షలు - సర్వే కమిటీల్లో రాజకీయులకే ప్రాధాన్యం - రాజకీయ విభేదాలతో రద్దు చేస్తారన్న అనుమానాలు - జిల్లాలో 15 శాతం వరకు కోత పడే సంకేతాలు - కమిటీల నియామకం పూర్తి చేయని అధికారులు - శుక్రవారం ప్రారంభం కాని సర్వే ప్రక్రియ శ్రీకాకుళం పాత బస్టాండ్, నరసన్నపేట రూరల్: ఎన్నికల హామీ మేరకు సామాజిక పింఛన్ మొత్తాలను వచ్చే నెల రెండో తేదీ నుంచి పెంచనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అంతకుముందే ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలను కుదించేందుకు సమాయత్తం కావడం పింఛనుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అనర్హులను గుర్తించే సర్వే కమిటీల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారే ఉండటం, అర్హతలపై పలు ఆంక్షలు విధించడంతో ఎవరి పాపం ఎవరికి చుట్టుకుంటుందో.. ఎవరు బలైపోతారోనన్న ఆందోళన వేలాది పెన్షనర్లను కుదిపేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాధారణ పింఛను మొత్తాన్ని రూ. 75 నుంచి రూ. 200కు పెంచారు. వికలాంగులకు రూ. 500 చేశారు. అర్షులందరికీ ఉదారంగా మంజూరు చేశారు. ఈ మొత్తాలను వరుసగా రూ.1000, రూ.1500కు పెంచనున్నట్లు టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ పార్టీయే అధికారంలోకి రావడంతో పింఛను పెరుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు, ప్రస్తుత సర్వే ఆందోళన కలిగిస్తోంది. గత ఏడేళ్లుగా నిరంతరాయంగా పింఛను పొందుతున్న వారిలో అభద్రతాభావం నెలకొంది. వైఎస్ అనంతరం క్రమంగా కుదింపు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి పింఛన్ రద్దు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 135 ద్వారా జిల్లాలో ఉన్న సామాజిక పెన్షన్లలో 15 శాతం వరకు కోత వేయనున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2010 తర్వాత నుంచి ఏదో రకంగా పెన్షనర్లను తగ్గిస్తూ వస్తున్నారు. అప్పట్లోనే 20 వేల వరకు తగ్గాయి. ఇక గత మూడు నాలుగేళ్లలో ‘సదరం’ పేరిట వికలాంగ పింఛన్లలో దాదాపు సగం కోత వేశారు. ఇప్పుడు మళ్లీ కోతకు సిద్ధమవుతున్నారు. లబ్ధిదారుల అర్హతలను నిర్థారించేందుకు ఈ జీవోలోనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని తలచుకుని పింఛనుదారులు అభద్రతకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఆధార్ అంశం వృద్ధులను ఆందోళనకు గురి చేస్తోంది. వయోభారంతో వేలిముద్రలు పడక చాలా మంది ఆధార్ కార్డులు పొందలేకపోయారు. ఇప్పుడు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇటువంటివారి పెన్షన్లు రద్దయ్యే ప్రమాదముంది. కమిటీల ఏర్పాటులో ఎంపీడీవోలు పెన్షన్ల సర్వేకు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా వివిధ స్థాయిల కమిటీల ఏర్పాటు పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో కమిషన ర్లు కీలకపాత్ర పోషిస్తారు. వాస్తవానికి కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, శుక్రవారం నుంచే సర్వే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోవడంతో సర్వే ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ కమిటీల్లో గ్రామ రెవెన్యూ ఆధికారి సభ్యుడు కాదు. అలాంటప్పుడు భూముల వివరాలు ఎవరు నిర్థారిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆధికారుల కంటే రాజకీయ నాయకులకే ప్రాధాన్యత కల్చించడంతో రాజకీయ కక్షలు రేగే ప్రమాదం కూడా ఉంది. కొత్త దరఖాస్తులకు అవకాశమిచ్చినా.. కొత్తవారి నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఇకనుంచి ఇప్పుడున్న లబ్ధిదారుల్లో మరణించిన లేదా రద్దయిన పెన్షనర్ల స్థానంలోనే కొత్తవారికి అవకాశం ఇస్తారు. దీంతో ముందు ముందు పింఛన్లకు డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు తమ అనుయాయులకు, పార్టీ వారికి పింఛన్తు మంజూరూ చేయిస్తామంటూ దరఖాస్తుల సేకరణకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులోనూ రాజకీయ ప్రమేయంతోనే పెన్షన్లు మంజూరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామస్థాయి కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో చేపట్టే సర్వేకు పంచాయతీ యూనిట్‌గా కమిటీ ఉంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, డ్వాక్రా సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఏదైనా గ్రామంలో 250 మందికి మించి పింఛనుదారులు ఉంటే రెండో కమిటీని వేస్తారు. విధిగా ఆధారాలు చూపాల్సిందే ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు సర్వేకు వచ్చే బృందాలు కోరిన ఆధారాలను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సర్వే జరిగే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోయినా, ఆధారాలు చూపకపోయినా ప్రస్తుతం అందుతున్న పింఛన్ రద్దవుతుంది.