breaking news
surrender to court
-
సజ్జన్ కుమార్ లొంగుబాటు
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు విధించబడిన మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ సోమవారం ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ అదితి గార్గ్ ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్‌ను ఈశాన్య ఢిల్లీలోని మందోలి జైలుకు తరలించాలని న్యాయస్ధానం ఆదేశించింది. తనను తీహార్ జైలులో ఉంచాలన్న సజ్జన్ కుమార్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు తనకు భద్రత కల్పించాలని, ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించాలన్న వినతిని అంగీకరించింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్‌ను దిగువ కోర్టు తప్పించడాన్ని తోసిపుచ్చుతూ డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇక లొంగుబాటుకు నిర్ధేశించిన గడువును పొడగించాలన్న సజ్జన్ వినతినీ ఈనెల 21న కోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో ఐదుగురు సిక్కుల ఊచకోత, గురుద్వారకు నిప్పంటించిన కేసులో సజ్జన్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 73 సంవత్సరాల సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
భార్యపై వేధింపుల కేసులో ఎస్ఐ లొంగుబాటు
చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే విలన్ గా మారాడు. భార్యకు నరకయాతన చూపించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో కోర్టులో లొంగిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. అనిల్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. శ్వేత అనే యువతిని పెళ్లిచేసుకున్నారు. కాగా ఏడాది నుంచి అనిల్ తనను వేధిస్తున్నాడని శ్వేత ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఈ కేసులో అనిల్ సోమవారం న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు.