breaking news
Surat businessman
-
ఉద్యోగులకు ఖరీదైన ఫ్లాట్స్: బిలియనీర్ గొప్పమనసు
Savji Dholakia ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, బంగారం లాంటి భారీ బహుమతులుఇవ్వడంలో సూరత్‌లోని వ్యాపారుల తరువాతే ఎవరైనా. తాజాగా సూరత్‌కుచెందిన బిలియనీర్ కార్మికులకు ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దీపావళికి తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతుల వర్షం కురిపించడం వజ్రాల వ్యాపారికి అలవాటు. (లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్ అంబానీ) సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 ఫ్లాట్లు , 1260 కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదిదీపావళి బోనస్‌గా ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా అందిస్తారు. జీవితంలో ఎవరికైనా తొలి కారు కొనుక్కోవడం అంటేచాలా గొప విషయం. తన ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఏటీ బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా ఒకసారి చెప్పారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్మెంట్ స్కూల్‌తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం. ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో తన జేబులో టిక్కెట్టు ఛార్జీగా కేవలం పన్నెండు రూపాయల యాభై పైసలతో సూరత్‌కు వచ్చారు. సూరత్‌లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. అంతేకాతు కుటుంబం తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని(గతంలో) నిర్ణయించడం విశేషం. అలాగే సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు. మొదట్లో ధోలాకియా మొదట గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా, హెటల్లో , వాచ్ అవుట్‌లెట్‌లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట.. రెండు రోజులు కూలి పని కూడా చేశాడు. చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. -
ఆ ఆరువేల కోట్ల సరెండర్ నిజమేనా?
నల్లధనంపై మెరుపుదాడి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేశారు. ఈ వార్త ఎంత సంచలనం సృష్టించిందో.. అదేవిధంగా సూరత్ వజ్రాల వ్యాపారి ఏకంగా రూ. ఆరువేల కోట్ల పెద్దనోట్లను కేంద్రానికి స్వాధీనం చేసినట్టు వచ్చిన వార్త కూడా అంతే సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం వల్లే ఒక్కసారిగా ఇది సాధ్యమైందని, ఇదేవిధంగా పెద్దమొత్తంలో నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. కానీ వాస్తవమేమిటంటే.. గత మంగళవారం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన కాసేపటికే వదంతులు షికారు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2వేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉన్నట్టు, దేశంలో పలుచోట్ల పెద్దనోట్ల బ్యాగులను వదిలేసి వెళ్లినట్టు వదంతులు వచ్చాయి. అదేవిధంగా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్ పటేల్ రూ. ఆరువేల కోట్ల పెద్దనోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్ట సంచలన కథనం హల్చల్ చేసింది. ఈ లాల్జీభాయ్ గతంలో ప్రధాని మోదీకి రూ. 4.3 కోట్లు విలువచేసే ఖరీదైన సూట్‌ను రూపొందించి ఇచ్చారు. ఈ సూట్‌పై వివాదం రేగడంతో తర్వాత వేలం వేశారు. దీంతో నిజంగానే ఆయన రూ. ఆరువేల కోట్లు ఇచ్చారేమోనని భావించి స్థానిక మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కానీ తాజాగా లాల్జీభాయ్ మీడియాతో మాట్లాడుతూ తానే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదని, తన గురించి వచ్చిన కథనాలన్నీ బూటకమేనని తేల్చారు. నిజానికి ఇలాంటి వదంతులు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. కాబట్టి నిజానిజాలు నిర్ధారించకుండా వీటిని షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.