-
IPL 2021: సన్‌రైజర్స్ అవుట్!
హైదరాబాద్ ఆట ఈ సీజన్లో అందరికంటే ముందుగా ఇంటి బాట పట్టే విధంగా తయారైంది. ఇప్పటిదాకా ఒక్కటే గెలిచిన జట్టు ఏకంగా ఏడింట ఓడి దాదాపుగా లీగ్ నుంచి ని్రష్కమించినట్లే! మరో వైపు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించి మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బౌలింగ్‌లో నోర్జే, రబడా బ్యాటింగ్‌లో ధావన్, అయ్యర్ రాణించి జట్టును గెలిపించారు. దుబాయ్: తీరు మార్చుకోని సన్‌రైజర్స్ ఐపీఎల్లో ఇక ముందుకు వెళ్లే అవకాశం లేదు. దేశం మారినా ఈ ఫ్రాంచైజీ దశ మారట్లేదు. ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలోనూ ఆ తీవ్రత కనబర్చలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగతా బ్యాట్స్‌మెన్‌ను ఢిల్లీ బౌలర్లు తేలిగ్గానే కట్టడి చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే (2/12) కీలక వికెట్లను పడగొట్టగా, రబడాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), పంత్ (21 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వార్నర్ డకౌట్ హైదరాబాద్ ఆట ఆరంభించగానే పరుగుకు ముందే కష్టాలెదురొచ్చాయి. వార్నర్ (0) డకౌటయ్యాడు. నోర్జే బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్... అక్షర్ పటేల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. కెపె్టన్ విలియమ్సన్ (18; 1 ఫోర్) వచ్చీ రాగానే బౌండరీ బాదాడు. అప్పటికే రెండు ఫోర్లు కొట్టిన ఓపెనర్ సాహా (17 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) రబడా బౌలింగ్‌కు దిగితే భారీ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికే ఔటయ్యాడు. తర్వాత మెరుపుల్లేని ఆట పేలవంగా సాగిపోయింది. రిషభ్ పంత్, పృథ్వీ షా క్యాచ్‌లు జారవిడవడంతో రెండు సార్లు లైఫ్‌లు పొందినా కెప్టెన్ విలియమ్సన్ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మనీశ్ పాండే (17; 1 ఫోర్), కేదార్ జాదవ్ (3)లు జట్టును గట్టెక్కించలేకపోయారు. దీంతో 90 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అబ్దుల్ సమద్ ఇన్నింగ్స్‌లో అందరికంటే ఎక్కువగా చేసిన పరుగులు, రషీద్ ఖాన్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆడిన తీరుతో సన్‌రైజర్స్ పరువు నిలిచే స్కోరు చేయగలిగింది. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. ధావన్ పరిచిన బాటలో... కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు ఓపెనర్ శిఖర్ ధావన్ చక్కని బాట వేశాడు. పృథ్వీ షా (11) విఫలమైనా... శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. శిఖర్ ఔటయ్యాక మిగతా బాధ్యతల్ని అయ్యర్, కెపె్టన్ రిషభ్ పంత్ పంచుకున్నారు. అజేయంగానే మిగిలిపోయిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో భువనేశ్వర్ వేసిన 16వ ఓవర్లో, ఖలీల్ 17వ ఓవర్లో రిషభ్ పంత్ చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. హోల్డర్ 18వ ఓవర్లో భారీ సిక్సర్‌తో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ను ముగించాడు. అబేధ్యమైన మూడో వికెట్‌కు పంత్, అయ్యర్ 67 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అక్షర్ (బి) నోర్జే 0; సాహా (సి) ధావన్ (బి) రబడా 18; విలియమ్సన్ (సి) హెట్‌మైర్ (బి) అక్షర్ 18; పాండే (సి) అండ్ (బి) రబడా 17; కేదార్ (ఎల్బీ) (బి) నోర్జే 3, సమద్ (సి) పంత్ (బి) రబడా 28; హోల్డర్ (సి) పృథ్వీ షా (బి) అక్షర్ 10; రషీద్‌ఖాన్ రనౌట్ 22; భువనేశ్వర్ నాటౌట్ 5; సందీప్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–0, 2–29, 3–60, 4–61, 5–74, 6–90, 7–115, 8–133, 9–134. బౌలింగ్: నోర్జే 4–0–12–2, అవేశ్‌ఖాన్ 4–0–27–0, అక్షర్ పటేల్ 4–0–21–2, రబడా 4–0–37–3, స్టొయినిస్ 1.1–0–8–0, అశ్విన్ 2.5–0–22–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) విలియమ్సన్ (బి) అహ్మద్ 11; ధావన్ (సి) అబ్దుల్ సమద్ (బి) రషీద్ ఖాన్ 42; శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 47; పంత్ నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–20, 2–72. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–33–1, భువనేశ్వర్ 3–0–21–0, హోల్డర్ 3.5–0–33–0, రషీద్ ఖాన్ 4–0–26–1, సందీప్ శర్మ 3–0–26–0. ఐపీఎల్లో నేడు ముంబై X కోల్‌కతా వేదిక: అబుదాబి; రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
నైట్‌రైడర్స్ రైట్ రైట్...
► ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా ► చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై విజయం ► 22 పరుగులతో ఓడిన సన్‌రైజర్స్ యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే మెరుపు బ్యాటింగ్... నరైన్ బౌలింగ్ మాజీ చాంపియన్ కోల్‌కతాను ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు చేర్చాయి. మ్యాచ్ గెలిస్తే రన్రేట్లతో సంబంధం లేకుండా నేరుగా ముందంజ వేసే అవకాశం ఉన్న స్థితిలో సొంతగడ్డపై చెలరేగిన నైట్‌రైడర్స్, హైదరాబాద్‌ను మట్టికరిపించి ముందంజ వేసింది. భారీ లక్ష్య ఛేదనలో ధావన్ చెలరేగినా... ఇన్నింగ్స్‌లో మొత్తం 50 డాట్ బాల్స్ ఆడిన సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. కోల్‌కతా: గౌతం గంభీర్ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరో సారి ప్లే ఆఫ్‌లోకి అడుగు పెట్టింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 22 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యూసుఫ్ పఠాన్ (34 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (30 బంతుల్లో 48; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 49 బంతుల్లోనే 87 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. సునీల్ నరైన్ (3/26) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. కీలక భాగస్వామ్యం: భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) కోల్‌కతాకు శుభారంభం అందించాడు. అయితే బరీందర్ అతని దూకుడుకు బ్రేక్ వేయగా, ఆ తర్వాత హుడా తన వరుస ఓవర్లలో మున్రో (10), గంభీర్ (16)లను అవుట్ చేశాడు. ఈ దశలో పాండే, పఠాన్ భారీ షాట్లతో దూకుడును ప్రదర్శించారు. కరణ్ వేసిన రెండు వరుస ఓవర్లలో వీరిద్దరు కలిసి 33 పరుగులు రాబట్టారు. 16వ ఓవర్లో విలియమ్సన్ చక్కటి క్యాచ్‌తో పాండే వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదించింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధావన్ మినహా: ఈ సీజన్ ఆసాంతం సాధారణ స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ధావన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్ ఉన్నంత సేపు సన్ ఆశలు నిలిచాయి. అయితే అతను అవుటయ్యాక సన్ ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) విలియమ్సన్ (బి) బరీందర్ 25; గంభీర్ (సి) హెన్రిక్స్ (బి) హుడా 16; మున్రో (సి) ఓజా (బి) హుడా 10; పాండే (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 48; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 52; హోల్డర్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 3; షకీబ్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 7; సూర్యకుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1-33; 2-48; 3-57; 4-144; 5-153; 6-164.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-31-2; బరీందర్ 4-0-31-1; విలియమ్సన్ 1-0-7-0; హుడా 2-0-16-2; కరణ్ శర్మ 3-0-39-0; హెన్రిక్స్ 2-0-14-0; ముస్తఫిజుర్ 4-0-32-1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (సి) మున్రో (బి) కుల్దీప్ 51; వార్నర్ (బి) నరైన్ 18; ఓజా (సి) ఉతప్ప (బి) నరైన్ 15; యువరాజ్ (సి) (సబ్) సతీశ్ (బి) షకీబ్ 19; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 7; హుడా (రనౌట్) 2; హెన్రిక్స్ (బి) నరైన్ 11; కరణ్ శర్మ (నాటౌట్) 8; భువనేశ్వర్ (సి) (సబ్) సతీశ్ (బి) రాజ్‌పుత్ 5; బరీందర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-28; 2-86; 3-92; 4-110; 5-115; 6-117; 7-136; 8-144.; బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 1-0-4-0; రాజ్‌పుత్ 3-0-21-1; షకీబ్ 4-0-34-1; నరైన్ 4-0-26-3; హోల్డర్ 3-0-21-0; మున్రో 1-0-8-0; కుల్దీప్ 4-0-28-2.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement