-
Telangana: ఉత్తమ ఠాణాల జాబితాలో మనవి మూడు
పినపాక: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీసు స్టేషన్ల జాబితాలో తెలంగాణ నుంచి సైబరాబాద్, ఏడూళ్ల బయ్యారం, ఆలేరు ఠాణాలకు చోటు దక్కింది. 2020–21 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీసు స్టేషన్ అవార్డులు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 16,671 పోలీసు స్టేషన్లతో కేంద్రం ఓ ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ 3 స్టేషన్లకు చోటు లభించింది. పోలీసు స్టేషన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడం, నేరాలు జరగకుండా ముందస్తు కట్టడి, సంఘ విద్రోహశక్తులను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల వంటి అంశాలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ జాబితాను రూపొందించింది. వడపోత అనంతరం రాష్ట్రంలో రెండు స్టేషన్లకు అవార్డు లభించే అవకాశముందని సమాచారం. ఇలా ప్రతీ రాష్ట్రంలో రెండు స్టేషన్లకు ఉత్తమ ఠాణా అవార్డులు ఇస్తారు. కాగా, జాబితాలో పేరు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పనితీరు, దాని పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజలతో పోలీసుల ప్రవర్తన.. తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన అధికారులు తాజాగా రెండు రోజులపాటు స్థాని కంగా వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించారు. -
రాష్ట్ర ఉత్తమ పశు వైద్యాధికారిగా సునీల్‌దత్
ఝరాసంగం: మండలంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా.సునీల్‌దత్త్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలందించినందుకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారిగా అవార్డును అందజేసింది. సోమవారం హైదారాబాద్‌లోని పశుసంవర్దకశాఖ కమీషనరు కార్యాలయంలో క్రిష్ణ ఎండోమెంటు వారి ఆధ్వర్యంలో పశుసంవర్దకశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సురేష్‌చంద్ర, డైరెక్టరు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అవార్డును అందుకోవటం జరిగిందన్నారు. ఈయన 2012సంవత్సరంలో నారాయణఖేడ్ నుండి ఝరాసంగంకు బదిలీపై వచ్చి విధులను నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు నారాయణఖేడ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి ఉత్తమ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అవే రీతిలో మండలంలోని ఆయా గ్రామాలలో ఎప్పటికప్పుడు పర్యటించి పశుపోషకుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసేవాడు. గ్రామాలలోని మూగజీవాలు వ్యాధుల బారినపడకుండా ముందస్థుగా వ్యాక్సినేషన్ వేసి తీసుకోవాల్పిన జాగ్రత్తలను వివరించేవాడు. ఈ విధంగా మండలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా విశిష్ఠ సేవలందించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవార్డు రావటంతో ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మండలంలో అందించే సేవల్ని ప్రభుత్వం గుర్తించి అవార్డును అందించింది. అవార్డుతో పాటు మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో తనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పశువైద్యాదికారికి అవార్డు రావటంజరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8మంది పశుపోషకులను కూడా అవార్డులను అందించారన్నారు. మండలంలోని ప్రజల సహకారంతో, తోటి సిబ్బందితో మరిన్ని సేవలను అందిస్తానన్నారు. తాను అందించే సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలన్నారు. అవార్డు రావటం పట్ల ఆయనకు తోటి సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement