breaking news
Summer tour
-
పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)
-
బోగీలు భగభగ
సాక్షి, సిటీబ్యూరో: వేసవి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.జనరల్, స్లీపర్ బోగీలు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. వడగాలులు, ఉక్కుపోతలతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బోగీలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రయాణికులు ఏసీ బోగీలపై ఆసక్తి చూపుతున్నారు. స్లీపర్ బోగీల్లో కంటే థర్డ్ ఏసీ బోగీల్లోనే వెయింటింగ్ లిస్టు వందల్లో నమోదవుతోంది. అయితే ప్రయాణికుల డిమాండ్ మేరకు అధికారులు అదనంగా ఏసీ బోగీలను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. కొన్ని రైళ్లకు మాత్రం అరకొరగా అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేసి చేతులు దులుపేసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఏసీ బోగీలు అందుబాటులో లేకపోవడంతో స్లీపర్ బోగీల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ బోగీల్లో బయటి ఉష్ణోగ్రతల కంటే ఒకటి,. రెండు డిగ్రీలు ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, పట్నా, కోల్కత, విశాఖ, భువనేశ్వర్, ముంబయి, చెన్నై, తదితర దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు స్లీపర్ బోగీల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వయోధికుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపతోంది. ఒకవైపు బోగీల్లో వేడి, మరోవైపు బయటి నుంచి వచ్చే వడగాలుల కారణంగా అవస్థలు పడుతున్నారు.‘ ఏసీ బోగీల్లో రిజర్వేషన్లు దొరకడం లేదు. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిపోయింది. దీంతో స్లీపర్ బోగీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ బోగీల్లో పైన ఫ్యాన్లు తిరిగినా అర్ధరాత్రి వరకు వేడిగాలులే వీస్తున్నాయి. రైలెక్కాలంటేనే భయమేస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏసీలు అరకొర... హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి మూడు వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ మధ్య నడిచే గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు 14 ఉండగా థర్డ్ ఏసీ బోగీలు 3 మాత్రమే ఉంటాయి. సెకెండ్ ఏసీ 2 బోగీలు మాత్రమే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది స్లీపర్ పైనే ఆధారపడుతారు. ప్రయాణ చార్జీల విషయంలో థర్డ్ ఏసీ, స్లీపర్ మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. అన్ని వేళల్లో కాకపోయినా వేసవి కాలంలోనైనా స్లీపర్ బోగీలను కొన్నింటిని తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు ఇటీవల కాలంలో చాలామంది ప్రయాణికులు స్లీపర్ కంటే ఏసీ బోగీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 24 గంటలకు పైగా స్లీపర్, జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే దూరప్రాంత రైళ్లలో వేడిగాలుల కారణంగా ప్రయాణికులు తరచూ వడదెబ్బకు గురవుతూ డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బోగీ సదుపాయాల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ అన్నింటిలోనూ ఏసీ బోగీలు పరిమితంగానే ఉన్నాయి. ఐదింటికే పరిమితం... వేసవి ఉష్ణోగ్రతలు, ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రైళ్లలో మాత్రమే థర్డ్ ఏసీ బోగీలను ఏర్పాటు చేశారు. తిరుపతి–లింగంపల్లి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్, కాచిగూడ–చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి,.లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లలో మాత్రం థర్డ్ ఏసీ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ సికింద్రాబాద్ నుంచి పట్నాకు రాకపోకలు సాగించే పట్నా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, ధానాపూర్, గోదావరి తదితర రైళ్లకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఏసీ బోగీలను పెంచకపోవడం గమనార్హం. -
ట్రావెల్ టిప్స్
ఈ వేసవి పర్యటనలలో మంచి ఫొటోలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకే. టిప్: 01: బరువైన కెమేరాలు విమానాల్లో తీసుకెళ్లడానికి నిబంధనలు ఉంటాయి. దుస్తులంత తేలికైన కెమేరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంట తీసుకెళ్లడానికి ఇబ్బందిలేని పాకెట్ కెమెరాలు ఉత్తమం. ముందుగా మీరు వెళ్లబోయే చోటు ఎలాంటిదో తెలుసుకోండి. టిప్: 02: సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే ఉషోదయ వేళలో ఉండే ప్రకృతి అద్భుత సౌందర్యాన్ని కెమేరాలో బంధించవచ్చు. అలాగే సూర్యాస్తమ సమయమూ అత్యద్భుతంగా ఉంటుంది. టిప్: 03: ప్రయాణంలో కెమేరా ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ వెళితే, సరైన ఫొటో మీకు లభించదు. బయల్దేరకముందే కెమరా, లెన్స్, ఫ్లాష్.. వంటివి ఇంటి వద్దే చూసి, నేర్చుకోవాలి. టిప్: 04: దేవాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు, నృత్యం, సంగీతం.. వంటివి ఫొటోలలో బంధించేముందు వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలను చదవడం వల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది. దీని వల్ల ఒక క్రమపద్ధతిలో కళాత్మకంగా ఫొటోలు తీసే నేర్పు అలవడుతుంది. టిప్: 05: టూర్ అన్నాం కదా అని అన్నీ వేగంగా చూసేస్తే సరిపోతుంది అనుకోకూడదు. దారిలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. ఆ ప్రాంత ప్రత్యేకత ఫొటోల ద్వారా తెలియజేయాలను కుంటే స్థానికులతో మాట్లాడితే సరైన సమాధానం లభిస్తుంది. -
త్రిష సమ్మర్ టూర్
టీనగర్: నటి త్రిష సమ్మర్ టూర్కు ఫారిన్ బయలుదేరి వెళ్లారు. మోహిని, చదురంగవేట్టై 2, గర్జనై అనే మూడు చిత్రాలు ఇటీవలే పూర్తిచేశారు నటి త్రిష. ఈ చిత్రాల విడుదలకు సంబంధించిన తుది విడత పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఇలావుండగా వరుసగా జరిగిన చిత్రాల షూటింగ్లతో అలిసిపోయిన త్రిష కాస్త విరామం తీసుకునేందుకు, వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు విదేశీ టూర్కు ప్లాన్ చేశారు. సా«ధారణంగా టూర్ వెళితే తన స్నేహితురాళ్లతో వెళ్లి ఉల్లాసంగా కాలం గడపడం త్రిషకు అలవాటు. అయితే, ఈ దఫా ఏమనుకున్నారో స్నేహితురాళ్లను కాదని తల్లి ఉమతో విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ టూర్ సమాచారాన్ని త్రిష తన వెబ్ పేజీలో తెలిపినప్పటికీ, వెళ్లే పర్యాటక స్థలం గురించి ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆమె న్యూయార్క్ వెళ్లి కొన్ని రోజులు అక్కడ బసచేస్తారని, ఆ తర్వాత మియామి, ఫ్లోరిడా ప్రాంతాలకు వెళ్లి సుమారు రెండు వారాలపాటు గడపనున్నట్లు సన్నిహితుల బోగట్టా.