త్రిష సమ్మర్‌ టూర్‌ | Trisha Summer Tour | Sakshi
Sakshi News home page

త్రిష సమ్మర్‌ టూర్‌

Apr 27 2017 1:25 AM | Updated on Sep 5 2017 9:46 AM

త్రిష సమ్మర్‌ టూర్‌

త్రిష సమ్మర్‌ టూర్‌

నటి త్రిష సమ్మర్‌ టూర్‌కు ఫారిన్‌ బయలుదేరి వెళ్లారు. మోహిని, చదురంగవేట్టై 2, గర్జనై అనే మూడు చిత్రాలు ఇటీవలే పూర్తిచేశారు

టీనగర్‌: నటి త్రిష సమ్మర్‌ టూర్‌కు ఫారిన్‌ బయలుదేరి వెళ్లారు. మోహిని, చదురంగవేట్టై 2, గర్జనై అనే మూడు చిత్రాలు ఇటీవలే పూర్తిచేశారు నటి త్రిష. ఈ చిత్రాల విడుదలకు సంబంధించిన తుది విడత పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఇలావుండగా వరుసగా జరిగిన చిత్రాల షూటింగ్‌లతో అలిసిపోయిన త్రిష కాస్త విరామం తీసుకునేందుకు, వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు విదేశీ టూర్‌కు ప్లాన్‌ చేశారు. సా«ధారణంగా టూర్‌ వెళితే తన స్నేహితురాళ్లతో వెళ్లి ఉల్లాసంగా కాలం గడపడం త్రిషకు అలవాటు.

అయితే, ఈ దఫా ఏమనుకున్నారో స్నేహితురాళ్లను కాదని తల్లి ఉమతో విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఈ టూర్‌ సమాచారాన్ని త్రిష తన వెబ్‌ పేజీలో తెలిపినప్పటికీ, వెళ్లే పర్యాటక స్థలం గురించి ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆమె న్యూయార్క్‌ వెళ్లి కొన్ని రోజులు అక్కడ బసచేస్తారని, ఆ తర్వాత మియామి, ఫ్లోరిడా ప్రాంతాలకు వెళ్లి సుమారు రెండు వారాలపాటు గడపనున్నట్లు సన్నిహితుల బోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement