breaking news
summer fest
-
జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్..) -
జోస్ ఆలుక్కాస్లో సమ్మర్ ఫెస్ట్
వజ్రాలపై 15 శాతం తగ్గింపు హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ జోస్ ఆలుక్కాస్ సమ్మర్ ఫెస్ట్‌లో భాగం గా కొత్త కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన డెమైండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 7,000 ప్రారంభ ధర కలిగిన డైమండ్ పెండంట్లను కూడా ఆఫర్ చేస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఈ నెల 14 వరకూ ప్రత్యేక ఆఫర్లుగా రూ.25,000కు మించిన స్వర్ణాభరణాల కొనుగోళ్లపై ఉచిత బంగారు నాణాన్ని, అలాగే వజ్రాలపై 15 శాతం తగ్గింపునిస్తామని వివరించారు. వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.