breaking news
Subramaniam Reddy
-
మరో వైఎస్సార్సీపీ నేత టార్గెట్?
తిరుపతి, సాక్షి: మరో వైఎస్సార్సీపీ నాయకుడిని లేపడానికి టీడీపీ నేతలు కుట్ర చేశారా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుంగనూరులో సోమవారం రవాణశాఖ మంత్రి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కమ్మపల్లిలో సుమారు 150 కుటుంబాలు ఉన్నాయి. అందులో 13 కుటుంబాలు వైఎస్సార్సీపీకి చెందిన వారు. మిగిలిన వారంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు. కమ్మపల్లిలో సంఘమిత్ర మమత ఏడాది క్రితం పొదుపు సంఘాలకు చెందిన రూ.5 లక్షల నగదును స్వాహా చేశారు. ఈ విషయం గత ఏడాది నవంబర్ 21న వెలుగులోకి రావడంతో స్థానికులు నిలదీశారు. డిసెంబర్ 9న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉన్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ మూకలు వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేశారు. కట్ చేస్తే.. సాధారణ ఎన్నికల్లో బాధిత కుటుంబాల వారు వైఎస్సార్సీపీకి ఓటువేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది క్రితం జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని, గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన 13 కుటుంబాలను లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వైఎస్సార్సీపీకి చెందిన 13 కుటుంబాలపై దాడులకు తెగబడ్డారు. నివాసాల్లోకి దూరి చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా విచక్షణా రహితంగా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వచ్చి అలా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ సానుభూతి పరులను చిత్రహింసలకు గురిచేశారు. టీడీపీ మూకల దాడులకు భయపడి సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం అదే రోజు రాత్రి ఊరు విడిచి అడవిలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు బిక్కు బిక్కుమంటూ అడవిలోనే గడిపింది. అతికష్టమ్మీద పుంగనూరులోని కుమార్తె జయంతి నివాసానికి చేరుకున్నారు. వీరిని తిరిగి రప్పించాలంటూ మిగిలిన 12 కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీరి చిత్రహింసలకు భరించలేక మరో మహిళ ఊరు వదిలి వెళ్లిపోయింది. ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియదు.ఆస్తులు, పంట ఉత్పత్తులు ధ్వంసంసుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని ఊర్లోకి పిలిపించే వరకు 12 కుటుంబాల వారికి చెందిన పంట దిగుబడులు, పాలు విక్రయించడానికి వీల్లేకుండా చేశారు. సుబ్రమణ్యంరెడ్డి ఇటుక బట్టీలను ధ్వంసం చేశారు. సుమారు 20 ఎకరాల్లోని టమాటా పంటను విక్రయించకుండా అడ్డుకోవడంతో పూర్తిగా పాడైపోయింది. కమ్మపల్లిలో బంధీలుగా ఉన్న వైఎస్సార్సీపీ కుటుంబాలను టీడీపీ నేతలు మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమించమని అడిగి కాళ్లు పట్టుకునే వరకు వారిని విడిచి పెట్టలేదు. ఈ విషయాలు ఎవరికీ తెలియకుండా, ఫొటోలు, వీడియోలు తీయకుండా టీడీపీ మూకలు వారి వద్ద ఉన్న ఫోన్లు లాక్కున్నారు. వైఎస్సార్సీపీ కుటుంబాల జీవనం సాఫీగా సాగాలంటే సుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని ఊర్లోకి పిలిపించాలని ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు సుబ్రమణ్యంరెడ్డి కుటుంబాన్ని రప్పించేందుకు అప్పులు చేసి పారిపోయారని దుష్ప్రచారం చేశారు.మంత్రి పర్యటనలో స్కెచ్వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి పుంగనూరులోని కుమార్తె నివాసంలో తలదాచుకున్న విషయం టీడీపీ నేతలు తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి కుమార్తె జయంతికి గ్రామంలోని బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఫోన్లు చేయించి బూతులు తిట్టేవారు. ఊర్లోకి రాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సుబ్రమణ్యంరెడ్డి ఊర్లోకి రాకపోవడంతో పుంగనూరుకే వెళ్లి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు సోమవారం పుంగనూరులో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటనను వాడుకునేందుకు ప్రయత్నించారు. మంత్రి పర్యటన కోసం అంటూ కమ్మపల్లి నుంచి టీడీపీకి చెందిన కొందరు ప్రత్యేక వాహనాల్లో పుంగనూరుకు చేరుకున్నారు. సుబ్రమణ్యంరెడ్డి కుమార్తె నిర్వహిస్తున్న దుస్తుల దుకాణంలోకి చొరబడ్డారు. షాపులో ఉన్న టైలర్‌ను సుబ్రమణ్యంరెడ్డి, కుమార్తె జయంతి గురించి ఆరా తీశారు. దుకాణంలో రేపటి నుంచి పనిచేయవద్దని హెచ్చరించారు. లోపల ఉన్న కుట్టుమిషన్లు, అద్దాలు ధ్వంసం చేశారు. వెళ్తూ వెళ్తూ గదిని అద్దెకు ఇచ్చిన యజమానిని హెచ్చరించారు. దుకాణం వెంటనే ఖాళీ చేయించాలని హుకుం జారీ చేశారు. సుబ్రమణ్యం రెడ్డి ఆచూకీ కోసం సోమవారం రాత్రి వరకు గాలించారు. టీడీపీ నేతల స్కెచ్ మీడియాకు లీక్ అవడంతో పుంగనూరు నుంచి జారుకున్నట్లు సమాచారం.మా ప్రాణాలకు ముప్పు ఉందికమ్మపల్లికి చెందిన రమేష్‌నాయుడు, చిట్టిబాబునాయుడు, త్రిలోక్‌నాయుడు, మధుసూదన్‌నాయుడు తదితరుల నుంచి మా ప్రాణాలకు హాని ఉంది. మా అమ్మా నాన్నలతోపాటు నా కోసం వెతుకుతున్నారు. మా పంటలను ధ్వంసం చేశారు. ఇటుకలను ఎత్తుకెళ్లారు. పశువులకు మేతకూడా వేయకుండా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని, మా వాళ్లను చిత్రహింసలు పెడుతున్నారు. గ్రామంలో మా వాళ్లకు ఏం జరిగిందో, ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. – జయంతి, సుబ్రమణ్యంరెడ్డి కుమార్తె -
చెవిరెడ్డి తండ్రి పింఛన్ తీసుకున్నారనలేదు
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పింఛన్ జాబితా నుంచి తొలగించాలా? లేదా? అని మాత్రమే అడిగాను హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి పింఛన్ తీసుకున్నారని తాను చెప్పలేదని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు.ఆయన పేరు పింఛన్ జాబితా నుంచి తొలగించాలా? లేదా? అని మాత్రమే అడిగానన్నారు. తాను దరఖాస్తు చేయకుండా, తన ప్రమేయం లేకుండానే తన పేరు పెన్షన్ జాబితాలో చేర్చారంటూ సుబ్రమణ్యంరెడ్డి ప్రకటన చేయడంతోపాటు, తన తండ్రి వృద్ధాప్య పింఛను తీసుకున్నట్లు నిరూపించమంటూ ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి సవాలు విసిరిన నేపథ్యంలో.. పరకాల ప్రభాకర్ శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చారు. పింఛన్ల జాబితా నుంచి అనర్హులను తొలగించమనే మాట వారినుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నిధులిస్తుంది.. మేం పింఛన్లు ఇస్తాం సామాజిక పెన్షన్లకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోయినా.. కేంద్రం ఇచ్చే నిధులతో నెట్టుకొస్తామని ప్రభాకర్ చెప్పారు. బడ్జెట్లో లోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులు ఇస్తుందని, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. జన్మభూమిలో పింఛన్లు పంపిణీ చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పింఛన్ల జాబితాలో ఉన్న అనర్హులను గురించే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో ముగుస్తుందని తెలిపారు. పింఛన్ల కోసం 3,61,673 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. అర్హుల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా అన్లైన్లో ఉంచుతామని, అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయమని సూచించారు. అర్హుల పేర్లు జాబితాలో లేకుండా అధికారుల దృష్టికి తీసుకెళితే వారిని చేర్చడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


