breaking news
subrahmanya temple
-
విశాఖ శారదాపీఠంలో సుబ్రమణ్య షష్టి వేడుకలు
-
క్షీరాభిషేకానికి సిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు
విజయనగరం టౌన్ : విజయనగరం పూల్బాగ్లోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శుక్రవారానికి మూడేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి శుక్రవారం వేకువ జామునుంచే పాలాభిషేకం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అరవై అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహానికి మోటార్ల ద్వారా స్వామివారి శిరస్సు పైకి పాలు, అభిషేక జలం వెళ్లేలా విగ్రహం నిర్మాణ సమయంలోనే పూర్తి ఏర్పాట్లు చేశారు. దేశంలోనే ఈ విగ్రహం అత్యంత ఎత్తయింది కావడం విశేషం. మలేషియాలోని కౌలాలంపూర్లో 140 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. దర్శించి తరించండి సర్వరోగాలను పటాపంచలు చేసే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించి తరించండి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. –కర్రి వెంకటరమణ సిద్దాంతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త -
నాగుపాము మృతి
పావగడ : నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన నాగుపాము ఆదివారం మృతి చెందింది. స్వామి సన్నిధిలో కొలువుదీరి సాక్షాత్తు శంకరుని మెడలోని నాగుపామే దిగి వచ్చి ఆలయంలో సాక్షాత్కరించిందా అనే విధంగా భక్తులకు దర్శనమిచ్చిన పాము చనిపోయింది. నాగుపామును దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. అయితే పాము మృతి చెందిన వార్త విని శోకంలో మునిగిపోయారు. ఆ పాముకు ఆలయ ఆవరణలోని నాగులకట్ట వద్ద దహన సంస్కారాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బదరీనాథ్ తెలిపారు. -
కార్తికేయుని సన్నిధిలో నాగుపాము
పావగడ : పావగడలోని నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న నవ గ్రహ విగ్రహాల వద్దకు ఓ నాగుపాము చేరుకుంది. వారం రోజులుగా అక్కడే ఉండిపోయింది. అత్యంత ప్రీతిపాత్రమైన నాగుపాము స్వామి వారి సన్నిధిలో ఉండడంతో ఆశ్చర్యానికి గురైన భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. పాముకు ఆహారంగా పాలు పోసి కొలుస్తున్నారు. ఈ వింత సంఘటనను చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి వస్తున్నారు. భక్తులు పామును వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా పాము కదలక పోవడం విశేషం.