breaking news
Student unions concern
-
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాల్సిందే
గన్¸ఫౌండ్రి , లిబర్టీ: టీఎస్పీఎస్సీ నియామక పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పేపర్‌లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఆమ్ఆద్మీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. లీకేజీ నిర్వాకానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి యువతకు భరోసా ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో విద్యార్థి నాయకులను గోషామహల్ పోలీస్స్టేడియంతో పాటు పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం, గాంధీభవన్ వద్ద గుమికూడిన వ్యక్తులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసు కున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ విద్యార్థి యువజన విభాగం నేతలు రణదీర్‌సింగ్, రాణాతేజ్, రాకేష్‌సింగ్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా నాలుగు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
ఆందోళనల నడుమ మెడికల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/విజయవాడ/వరంగల్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. పెంచిన మెడికల్ ఫీజులను తగ్గించాలని, 39, 41 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్‌లోని జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక దశలో నాయకులు గోడెక్కి కౌన్సెలింగ్ కేంద్రంలోకి దూకారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఫలితంగా జేఎన్టీయూహెచ్లో 45 నిమిషాలు, ఉస్మానియాలో రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓయూలో 12, 28 ర్యాంకు విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కార్డులు అందజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, తెలంగాణ డీఎంఈ ఎం.రమణి జేఎన్టీయూహెచ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలపై వీసీ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్ కేవలం ప్రభుత్వ కళాశాలల్లో, ‘ఏ’ కేటగిరీ సీట్ల కోసమేనని చెప్పారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఫీజులు ఉన్నాయని పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కోటా విషయంలో ప్రైవేటు కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం తెలంగాణలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డీఎంఈ తెలిపారు. కాగా, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో, విజయవాడలో కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ కేంద్రంలో 118 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తొలి సీటును ఆరో ర్యాంకర్ పి.తేజేశ్వరరావు ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు తీసుకున్నారు. గురువారం జరిగే కౌన్సెలింగ్‌కు 1001 నుంచి 3వేల ర్యాంకుల వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు అభ్యర్థులను ఆహ్వానించారు. జేఎన్టీయూహెచ్లో 256, ఉస్మానియా వర్సిటీలో 184, కేయూలో 55, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 118 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా.. తొలి రోజు 498 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయినట్లు హెల్త్ యూనివర్సిటీ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు.