breaking news
Stroke Treatment
-
మాట గొంతుకలోనే..
ఒక వ్యక్తికి పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చింది. చికిత్స తర్వాత ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులనూ గుర్తుపడుతున్నాడు. వారు చెప్పేది అర్థం చేసుకుంటున్నట్టూ కనిపిస్తున్నాడు. కానీ కొన్ని మాటలను పలకలేకపోతున్నాడు. ఒక్కోసారి మాట్లాడాలనుకున్నా మాట బయటకు రావడం లేదు. కొన్నిసార్లు భార్యాపిల్లలను పిలవాలనుకుంటున్నా... నోరు కదపలేకపోతున్నాడు. ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే సంబంధం లేని పదాలు వస్తున్నాయి. ఇలా భాషలోని పలుకులను పలకలేని కండిషన్‌ను ‘అఫేసియా’ అంటారు. నేడు స్ట్రోక్ డే సందర్భంగా ఇలా మాట సరిగా రాని ‘అఫేసియా’ కండిషన్‌పై అవగాహన కోసం ఇస్తున్న కథనం.కొందరిలో పక్షవాతం తర్వాత మాట గొంతుకలోనే ఆగిపోయి ఎంతకీ బయటకు రాకపోతే... ఆ నరకాన్ని వర్ణించడం కష్టమే. అందునా నిన్నామొన్నటివరకూ హాయిగా మాట్లాడిన వ్యక్తికి అకస్మాత్తుగా మాట రాకపోతే చాలా ఇబ్బందిగానే కాదు... నిరాశ, నిస్పృహలు కూడా ఉండవచ్చు. మరికొందరు డిప్రెషన్‌లోకీ వెళ్లిపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అఫేషియా అంటే ఏమిటో తెలుసుకోవాలి. అఫేసియా అంటే ఏమిటి?మన మెదడులో భాషను అర్థం చేసుకోవడానికి, మాటల రూపంలో వ్యక్తీకరించడానికి... సాధారణంగా మెదడులోని ఎడమ అర్ధగోళంలో భాషా కేంద్రాలు (లాంగ్వేజ్ సెంటర్స్) ఉంటాయి. కుడిచేతి వాటం ఉన్నవారిలో ఈ భాషాకేంద్రం ఎడమవైపు ఉన్నప్పటికీ 4–6 శాతం వ్యక్తుల్లో ఈ సెంటర్ కుడివైపే ఉండవచ్చు. ఇక ఎడమచేతి వాటం ఉన్న 27 శాతం మంది వ్యక్తుల్లో ఈ సెంటర్ మెదడు కుడి భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతాలకు స్ట్రోక్వల్ల రక్తప్రసరణ దెబ్బతిని భాషా సామర్థ్యాలు ప్రభావితమైతే ‘అఫేసియా’ రావచ్చు. ‘అఫేసియా’ ఉన్న వ్యక్తిలో కనిపించే సమస్యల్లో ఇవి కొన్ని.. → మాట్లాడాలనుకున్న పదం గుర్తుకు రాకపోవడం. → ఎదుటివారు చెప్పే మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. → వాక్యాలను సరిగ్గా నిర్మించలేకపోవడం. → చదవడం లేదా రాయడంలో ఇబ్బంది. → చెప్పాలనుకున్నది ఒకటైతే, నోటి నుంచి మరో పదం రావడం. అఫేసియా, మాట ముద్దగా రావడం ఒకటేనా?కాదు. అవి రెండూ వేర్వేరు. స్ట్రోక్ వచ్చిన కొందరిలో మాట ముద్దముద్దగా రావచ్చు. ఆ తేడాలేమిటో చూద్దాం. అఫేసియా: భాషను అర్థం చేసుకోవడం లేదా పదాల ద్వారా భావాలను వ్యక్తీకరించడంలో ఇబ్బంది.డిసార్థ్రియా: మాట్లాడటానికి అవసరమైన కండరాల నియంత్రణ దెబ్బతినడం వల్ల మాట స్పష్టంగా పలకలేకపోవడం.అ్రపాక్సియా ఆఫ్ స్పీచ్ : మాట్లాడటానికి అవసరమైన కండరాల కదలికలను మెదడు సరిగ్గా నియంత్రించలేకపోవడం. ఈ మూడూ వేర్వేరు సమస్యలు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ ఉండవచ్చు. ఎదురయ్యే సమస్యలివి.. ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చిన తర్వాత మాటలు సరిగ్గా రాకపోతే, ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చు.→ తన అవసరాలను ఇతరులకు చెప్పలేకపోవడం. → కుటుంబ సభ్యులతో సంభాషణ తగ్గిపోవడం. → స్నేహితులను కలవడానికి ఇష్టపడకపోవడం. → ఇతరులు తనను అర్థం చేసుకోవడం లేదనే బాధ. → ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. → ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు.ఇలా చూసినప్పుడు ‘అఫేసియా’ వల్ల పేషెంట్ తాలూకు సామాజిక సంబంధాలు, స్వతంత్రంగా జీవించే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతాయి. కొన్ని రకాల మందులతోనూ చికిత్స: అఫేసియా బాధితులకు న్యూరోఫిజీషియన్లు కొన్ని రకాల మందులతోనూ చికిత్స అందిస్తారు. ఉదాహరణకు వారికి డోనోపెజిల్, మెమాంటిన్, పైరాసెటామ్ వంటి మందులతో చికిత్స అందించి, మాట మెరుగయ్యేందుకు స్పీచ్ థెరపీని సూచిస్తారు. స్పీచ్ థెరపీ తర్వాత మాటలు మళ్లీ వస్తాయా? అఫేసియా వచ్చిన వ్యక్తికి మళ్లీ మాట్లాడే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఎంతవరకు మెరుగుదల వస్తుందనేది మెదడుకు జరిగిన నష్టం, అఫేషియా తీవ్రత, చికిత్స మొదలుపెట్టిన సమయం, పేషెంట్ వ్యక్తిగత ఆరోగ్యం, థెరపీలో పాల్గొనే తీరు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.కొంతమందికి మొదటి కొద్దివారాల్లోనే మెరుగుదల కనిపించవచ్చు. మరికొందరికి నెలల తరబడి సాధన అవసరమవుతుంది. కొందరిలో కొన్ని భాషా సమస్యలు చాలాకాలం పాటు కొనసాగవచ్చు. స్ట్రోక్ వచ్చి నెలలు గడిచిపోయాయని ఇక మాటలు రావనే నిర్ణయానికి రావడం సరికాదు. ఆలస్యమైన దశలో కూడా తగిన చికిత్సతో కొందరిలో మెరుగుదల సాధ్యమే. అందుకే ఏ దశలోనూ నిరాశ పడకూడదు. స్పీచ్ థెరపిస్టు ఏం చేస్తారంటే... స్పీచ్ థెరపిస్టును కేవలం మాటలు పలికించేందుకు అవసరమైన వ్యాయామాలు చేయించే వ్యక్తిగా చూడకూడదు. స్ట్రోక్ తర్వాత భాషను అర్థం చేసుకోవడం, మాట్లాడటం,చదవడం, రాయడం, రోజువారీ అవసరాలను ఇతరులకు తెలియజేయడానికి అవసరమైన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు.కుటుంబ సభ్యులెలా మాట్లాడాలి?స్ట్రోక్ వల్ల మాటలు రాని బాధితుడికి థెరపిస్టు అందించే సహాయం నిజానికి చాలా పరిమితం అని చెప్పవచ్చు. అయితే థెరపిస్టు రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఇంట్లో మిగతా సమయమంతా కుటుంబ సభ్యులు బాధితులతో సంభాషణ కొనసాగించడం, అభ్యాసం చేయించడం చాలా ముఖ్యం.2026లో ప్రచురితమైన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ , అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ మార్గదర్శకాలు కూడా భాషా సామర్థ్యాన్ని అంచనా వేసేటప్పుడు బాధితుడి భాషా నేపథ్యం, గతంలో ఉపయోగించిన భాషలు, రోజువారీ భాషా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలనిసూచిస్తున్నాయి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ – యాసీన్ -
అత్యాధునిక గుండెపోటు సంరక్షణ కేంద్రంగా అపోలో
హైదరాబాద్: అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఎ) నుండి కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సిఎస్ సి) సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ దేశంలో స్ట్రోక్ చికిత్సకు సంబంధించి నూతన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రత్యేక స్ట్రోక్ బృందాలు, అధునాతన ఇమేజింగ్‌తో స్ట్రోక్ డయాగ్నసిస్, క్రిటికల్ కేర్‌లో అత్యవసర ప్రతిస్పందనలతో అత్యంత కఠినమైన ప్రమాణాలను అందుకోగలదని ఏహెచ్ఎ సర్టిఫికేషన్‌తో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ విజయవంతంగా నిరూపించుకుంది. అత్యున్నత స్ట్రోక్-కేర్ సర్టిఫికేషన్‌ను పొందిన భారతదేశంలో మొట్టమొదటి సంస్థగా ఏహెచ్ఎ దీనిని గుర్తించింది. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ 24 గంటలూ పూర్తిగా అంకితం చేయబడిన, ప్రత్యేకమైన, మల్టీడిసిప్లినరీ స్ట్రోక్ బృందాన్ని కలిగి ఉంది,ఈ బృందంలో అత్యవసర వైద్యులు, న్యూరాలజిస్టులు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, ఇంటెన్సివిస్టులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందంలో డాక్టర్ అలోక్ రంజన్-సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి న్యూరోసర్జరీ, డాక్టర్ ఇమ్రాన్ సుభాన్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ ఎమర్జెన్సీ మెడిసిన్; డాక్టర్ కె. సుబ్బారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ & హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్: డాక్టర్ సురేష్ గిర్గాని, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ మరియు డాక్టర్ సి. రాజేష్ రెడ్డి, న్యూరాలజిస్ట్ ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, "భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా ప్రతిష్టాత్మకమైన ఏహెచ్ఎ సర్టిఫికేషన్ సాధించడం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతను వెల్లడిస్తుంది. సమయం, నైపుణ్యం ప్రాణాలను కాపాడుతుందని గుర్తించిన మేము మా శ్రేష్ఠత వినియోగంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోము. ఈ సర్టిఫికేషన్ రోగులకు వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సంరక్షణ మార్గదర్శకాలకు హామీ ఇస్తుంది, సాధ్యమైనంత ఉత్తమంగా కోలుకునేలా చేస్తుంది. ఇది మా నిరంతర శ్రేష్ఠత సాధన, ప్రపంచ నాణ్యత, రోగి భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ, శ్రీ వి. తేజస్వి రావు మాట్లాడుతూ "ఈ ధృవీకరణ మేము అందించే అత్యున్నత స్థాయి సంరక్షణకు గుర్తింపు, దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మార్చాలనే మా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.రోగ నిర్ధారణ నుండి రీహాబిలిటేషన్ వరకు స్ట్రోక్ కేర్‌కు క్రాస్-డిసిప్లినరీ విధానాన్ని అవలంబించడం ద్వారా, ప్రతి రోగికి వైకల్యాన్ని తగ్గించడానికి, కోలుకోవడాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన రీతిలో రూపొందించిన వైద్య సహాయం, క్రిటికల్-కేర్ మద్దతు లభిస్తుందని మేము నిర్ధారిస్తున్నాము. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, నిరంతర పరిశోధన కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా, ప్రతిచోటా రోగులు అత్యున్నత ప్రమాణాల తో చికిత్సను పొందగలిగేలా మేము స్ట్రోక్ కేర్‌ను పెంచుతున్నాము" అని అన్నారు. ఈ అక్రిడిటేషన్ మైలురాయి స్ట్రోక్ లక్షణాలు కనిపించటం నుండి రీ హాబిలిటేషన్, స్ట్రోక్ తరువాత రికవరీ ద్వారా రోగులకు మద్దతు ఇవ్వడం వరకూ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న సమగ్ర విధానాన్ని వెల్లడిస్తుంది. తరచుగా "బ్రెయిన్ స్ట్రోక్ " గా పిలువబడే స్ట్రోక్, మెదడుకు రక్త సరఫరా సరిగా జరగనప్పుడు సంభవిస్తుంది. సాధారణంగా మూసుకుపోయిన లేదా పగిలిన నాళం కారణంగా, రక్త ప్రవాహం సరిగా లేకపోవడం జరుగుతుంది.ఈ కారణం వల్ల మాట్లాడటం, కదలడం లేదా శరీరం ఒక వైపు ఉపయోగించగల సామర్థ్యం వంటి కొన్ని శారీరక విధులను అకస్మాత్తుగా కోల్పోవడం జరుగుతుంది. వైకల్యాన్ని తగ్గించడంలో, ప్రాణాలను కాపాడడంలో వేగవంతంగా గుర్తింపు, తక్షణ చికిత్స చాలా కీలకం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఇమ్రాన్ సుభాన్ మాట్లాడుతూ, "తెలంగాణలో నిర్వహించిన అధ్యయనాలు వ్యవస్థీకృత మల్టీడిసిప్లినరీ బృందాలుఅందించే స్ట్రోక్ కేర్ సేవలతో అత్యవసర స్ట్రోక్ కేసులకు చికిత్స చేయడంలో నిర్మాణాత్మక క్లినికల్ నిర్వహణను అందించాల్సిన అవసరాన్ని చూపించాయి.మా అంకితమైన అత్యవసర సంబర్ 1066 తో రోడ్డుపై ఉన్నప్పుడు కూడా రోగికి చికిత్స చేయగల రీతిలో సౌకర్యాలు కలిగిన అంబులెన్స్‌లు, బాగా శిక్షణ పొందిన అత్యవసర వైద్యులు, నర్సులతో, మేము ఇప్పటికే ప్రపంచ స్థాయి స్ట్రోక్ కేర్‌ను అందిస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటి ఏహెచ్ఎ-ధృవీకృత సమగ్ర స్ట్రోక్ సెంటర్‌గా ఉండటం గర్వకారణం" అని అన్నారు. జీవనశైలి మార్పులతో భారతదేశం స్ట్రోక్ విషయంలో గణనీయమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాలలో, అవగాహన లేకపోవడం, తగినంత అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు అందుబాటులో ఉండక పోవటం చేత సమయానికి తగిన చికిత్స అందించటం కష్టమవుతుంది.ఈ కారణం చేత రోగుల నాడీ వ్యవస్థ దెబ్బతినడం లేదా మరణంతో సహా అధ్వాన్నమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పుడు, అపోలో హాస్పిటల్స్ వద్ద, కొత్త ఏహెచ్ఎ-సర్టిఫైడ్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ స్ట్రోక్ కేసులను ఎలా గుర్తించవచ్చు, చికిత్స చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు అనే దానిలో ఒక అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది.అత్యాధునిక ఇమేజింగ్ పరికరాలు, ఈఎంఎస్, హాస్పిటల్ బృందాల మధ్య రియల్-టైమ్ కమ్యూనికేషన్, ఉత్తమ ప్రపంచ పద్ధతులతో సమలేఖనం చేయబడిన, స్థిరపడిన చికిత్సా ప్రోటోకాల్‌లను కలపడం ద్వారా, అపోలో హాస్పిటల్స్ లోని రోగులు ఇప్పుడు ఏకీకృత సంరక్షణ అనుభవాన్ని పొందుతున్నారు, ఇది తక్కువ సమస్యలతో కోలుకునే అవకాశాలను పెంచుతుంది. కార్డియోవాస్కులర్, హార్ట్, స్ట్రోక్ కేర్‌లో ప్రపంచ సాధికార సంస్థ అయిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా సమగ్ర స్ట్రోక్ సెంటర్ ధృవీకరణ పొందటం అనేది ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కేర్‌కు అత్యున్నత ప్రమాణం. ఆసుపత్రులు కఠినమైన ప్రమాణాలను అనుసరించిన మీదట మాత్రమే ఈ ధృవీకరణ అందిస్తారు. అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, ఈ అవసరాలలో ప్రతిదాన్ని తీర్చింది లేదా అధిగమించింది, భారతదేశంలో స్ట్రోక్ కేర్ కోసం అత్యుత్తమ ప్రమాణాన్ని నెలకొల్పింది. వీటిలో..* స్ట్రోక్ రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే వారిని త్వరగా గుర్తించేలా చేసే అత్యంత సమర్థవంతమైన స్ట్రోక్-అలర్ట్ వ్యవస్థతో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ మరియు స్ట్రోక్ మార్గాలు. ఇందులో అత్యవసర వైద్య సేవలు (EMS), క్రమబద్ధీకరించబడిన ట్రయాజ్ ప్రక్రియ, తగిన సమయంలో క్లాట్-బస్టింగ్ ఔషధాల తక్షణ నిర్వహణ మధ్య సమన్వయం ఉన్నాయి. • స్ట్రోక్ రకం, తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించడానికి సిటి స్కాన్లు, ఎంఆరా లు మరియు ఇతర ప్రత్యేక న్యూరోఇమేజింగ్ వంటి సామర్థ్యాల 24/7 లభ్యత, లక్ష్య జోక్యాలను అనుమతిస్తుంది.అధునాతన ఇమేజింగ్ ఏ సమయంలోనైనా ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ (కాథెటర్ ద్వారా క్లాట్లను తొలగించడం) వంటి అధునాతన స్ట్రోక్ చికిత్సల కోసం ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవల 24/7 లభ్యత, రోగి ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. * క్రిటికల్ కేర్, స్ట్రోక్ నిర్వహణలో నిపుణులతో కూడిన ప్రత్యేక న్యూరో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కొనసాగుతున్న రోగి పరిశీలన, స్థిరీకరణ మరియు కోలుకోవడానికి అవసరం. వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు స్ట్రోక్ కేర్‌లో నిరంతర పరిశోధన, విద్య మరియు రోగి అవగాహన కార్యక్రమాలు అత్యున్నత నిర్వహించడానికి తోడ్పడతాయి. ప్రమాణాల సాధనను భారతదేశంలో వైద్య పురోగతి పరంగా అపోలో హాస్పిటల్స్ నిరంతరం ముందంజలో ఉంది. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్, 2006లో స్ట్రోక్ నిర్వహణ కోసం యునైటెడ్ స్టేట్స్ వెలుపల వ్యాధి-నిర్దిష్ట దృవీకరణ పొందిన మొట్టమొదటి ఆసుపత్రిగా గుర్తింపు పొందింది . ఈ శ్రేష్ఠత వారసత్వం భారతదేశంలో పెరుగుతున్న స్ట్రోక్ భారాన్ని ఎదుర్కోవడానికి వినూత్న సాంకేతికతలు, బహుళ విభాగ బృంద కృషి, పరిశోధన-ఆధారిత పద్ధతులను ఉపయోగించుకునే అధునాతన కార్యక్రమాలకు పునాది వేసింది. -
ఇక బ్రెయిన్ స్ట్రోక్‌లకు భయం లేదు
లండన్: వైద్య విజ్ఞానరంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తున్నాయి. ఆంజియోగ్రామీ ద్వారా గుండెనాళాల్లోని రక్తపు గడ్డలను శుద్ధి చేసినట్లుగా మెదడు నరాల్లోని బ్లడ్ క్లాట్లను ఇక సులభంగానే తొలగించవచ్చు. కొత్తగా కనుగొన్న ఈ విధానాన్ని వైద్య పరిభాషలో 'మెకానికల్ త్రోంబెక్టమీస్' అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో అనుభవజ్ఞులైన కొంత మంది న్యూరాలజిస్టులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రక్తం గడ్డగట్టిన మెదడు రక్తనాళంలోకి కాథెరిన్ (మెత్తటి గొట్టం లాంటి పరికరం) పంపిస్తారు. అనంతరం అందులోకి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను పంపిస్తారు. అది రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత మెష్ విస్తరించిన గడ్డ కట్టిన రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అనంతరం కాథెరిన్ నుంచి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను తొలగిస్తారు. సాధారణంగా అనస్థిషియా బదులు సెడిషన్ (మత్తించే మందులు) డ్రగ్స్ ఇచ్చి ఈ వైద్య ప్రక్రియను చేపడుతున్నారు. రక్తాన్ని పలుచపరిచే మందుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగులు 30 శాతం కోలుకుంటుంటే ఈ 'మెకానికల్ త్రోంబెక్టమీస్' వల్ల 80, 90 శాతం కోలుకునే అవకాశం ఉందని లండన్ వైద్యులు చెబుతున్నారు. రంగ్బీ మ్యాచ్‌లో గాయపడి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కార్నర్ లైన్స్ అనే 14 ఏళ్ల బాలుడికి మాట, కాళ్లు, చేతులు పడిపోవడంతో ఆ బాలుడికి 2015, మార్చి నెలలోనే ఈ కొత్త విధానం ద్వారా బ్లడ్ కాట్స్ను తొలగించారు. అనతికాలంలోనే కోలుకున్న ఆ బాలుడికి మాటతో సహా అన్ని అవయవాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతానికి లండన్‌లోని సెంట్ జార్జి ఆస్పత్రి సహా 24 న్యూరోసైన్స్ సెంటర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రోత్సహించడం కోసం నేషనల్ హెల్త్ స్కీమ్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆమోదిస్తామని, వీటి వల్ల వచ్చే ఏడాది నుంచి కనీసం వెయ్యి మంది రోగులకు ఇలాంటి చికిత్స అందించవచ్చని భావిస్తున్నామని సీఈవో సైమన్ స్టీవెన్స్ తెలిపారు. ఇంగ్లండ్‌ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి. చనిపోతున్న వారిలో నాలుగొంతుల మంది చావుకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. ఈ కారణంగా ఏడాదికి ఎన్హెచ్ఎస్పై 300 కోట్ల పౌండ్ల భారం పడుతోంది. మెకానికల్ త్రోంబెక్టమీస్ తరహాలోనే ఇప్పుడిప్పుడే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లడ్ క్లాట్స్‌ను తొలగిస్తున్నారు.


