breaking news
strip-searched
-
ఇది అత్యాచారం కన్నా తక్కువేం కాదు..
చెన్నై : స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న ‘నో ఫ్రిల్స్ కారియర్’కు వ్యతిరేకంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీలో భాగంగా ఎయిర్‌లైన్ అధికారులు వారి భద్రతా సిబ్బంది చేత ఇబ్బందికరరీతిలో తమపై వ్యక్తిగత తనిఖీలు నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులగా విమానాలు డీబోర్డింగ్ అయ్యాక భద్రతా సిబ్బంది తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నారని, చివరకు తమ హ్యండ్బాగ్లో నుంచి శానిటరి ప్యాడ్స్‌ను కూడా తొలగించాలని చెప్తున్నారని ఎయిర్ హోస్టెస్‌లు చెప్తున్నారు. ‘తనిఖీల పేరుతో వారు మా శరీరాన్ని అసభ్యకర రీతిలో తాకుతున్నారు. ఇది మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మా సానిటరి ప్యాడ్స్‌ను తీసివేయాలని, మా శరీరాన్ని తాకాలని మీ పాలసీలో ఉందా? ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం మమ్మల్ని నియమించుకున్నారు. కానీ మా భద్రత గౌరవం మాటేంటి’ అంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ పట్ల భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే తక్కువగా ఉందా అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌హోస్టెస్‌లు ఆహారపదార్థలు, ఇతర పదర్థాలను అమ్మడానికి ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్నారనే అనుమానంతో కొద్దికాలం నుంచి స్పైస్‌జెట్ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్ అయ్యాక వారిని భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తుంది. తనిఖీలు నిర్వహించే వరకు బాత్రూంలోకి కూడా వెళ్లకూడదని ఎయిర్‌హోస్టెస్‌లను ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలపడంతో స్పైస్‌జెట్ అధికారులు వారితో గుర్గావ్లోని తమ కార్యలయంలో మీటింగ్ నిర్వహించారు. దీనివల్ల ఆ రోజు రెండు ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యంగా నడిచాయి. అందులో ఒకటి కొలొంబో వెళ్లే విమానం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యూనిఫామ్ ధరించిన కొంతమంది ఎయిర్‌హోస్టెస్‌లు, సాధారణ దుస్తుల్లో ఉన్న కొంతమంది గుంపుగా నిలబడి ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. -
దుస్తులిప్పి నగ్నంగా తనిఖీ చేశారు: నటి
సాక్షి, హాలీవుడ్: అమెరికాలోని ఉత్తర డకోటాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు హాలీవుడ్ నటి షైలెనె వుడ్లీను పోలీసులు అరెస్టు చేశారు. 2016 అక్టోబర్‌లో డకోటా యాక్సెస్ పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ జాతులు ఈ ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనలో పాల్గొన్న ఆమె నిరసన ప్రదర్శనను ఫేస్బుక్ లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా తనను అరెస్టు చేసిన పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని ఆమె వెల్లడించారు. 'డైవర్జెంట్', 'బిగ్ లిటిల్ లైస్' వంటి సినిమాల్లో నటించిన మేరీ క్లయిర్ యూకే షోలో తాజాగా ముచ్చటించారు. 'నా దుస్తులిప్పి నగ్నంగా తనిఖీలు నిర్వహించారు. నాతో చాలా క్రూరంగా అసభ్యంగా ప్రవర్తించారు. నేను డ్రగ్స్ కలిగి ఉన్నాన్నేమోనంటూ క్రూరంగా తనిఖీలు చేశారు' అని ఆమె తెలిపారు. 'జైలు సెల్లో ఉన్నప్పుడు తలుపులను మూసివేశారు. ఇక ఎవరూ రక్షించలేని పరిస్థితి. సెల్లో అగ్నిప్రమాదం జరిగి.. తలుపులు తెరవొద్దని జైలు సిబ్బంది భావిస్తే.. అందులోని వారు చనిపోయినట్టే. మీ పరిస్థితి బోనులోని జంతువు మాదిరి ఉంటుంది' అని ఆమె వివరించారు. తన అరెస్టు తర్వాత ఎంతో మానసిక క్షోభ (పీటీఎస్డీ)ను అనుభవించానని, మూడు నెలలు సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఒంటరిగా గడిపానని, ఎంతో కుంగుబాటుకు లోనయ్యానని ఆమె తెలిపారు. ప్రస్తుతం 'అడ్రిఫ్ట్' సినిమాలో సామ్ క్లెఫ్లిన్ సరసన కథానాయికగా నటిస్తున్న ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని చెప్పారు.