breaking news
Stellar light
-
పేలనున్న సూపర్నోవా!
అంతరిక్ష వీధిలో మరో తారకు ఆయువు మూడింది. అంతర్ధానానికి అతి సమీపానికి చేరింది. ఆ నక్షత్రం పేరు బెటెల్‌గేస్. ఓరియన్ నక్షత్రమండలంలో అత్యంత ప్రకాశవంతమైన తార ఇదే. బెటెల్‌గెస్ ఓ రెడ్ సూపర్‌జెయింట్ స్టార్. అంటే ఆయుఃప్రమాణం దాదాపుగా ముగింపుకు వచి్చన నక్షత్రమన్నమాట. అయితే కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద నక్షత్రమై ఉండి కూడా ఇది చూసేందుకు ఓ తోకచుక్క మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఒక కొస నుంచి తోక మాదిరిగా వాయుసమూహం సుదూరాల దాకా విస్తరించి ఉండటమే ఇందుకు కారణం. బహుశా ఇప్పటికే ఉనికిని కోల్పోయిన మరో నక్షత్రం తాలూకు శక్తిని కూడా బెటెల్‌గెస్ అందిపుచ్చుకుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.భారీ తారలు తమ చుట్టూ ఉన్న సంక్లిష్ట వ్యవస్థలతో ఎలా ప్రతిక్రియ జరుపుతాయో తెలుసుకునేందుకు బెటెల్‌గెస్ ఉదంతం బాగా ఉపయోగపడుతోందని వారంటున్నారు. ఈ నక్షత్రం సూపర్నోవాగా మారి అతి త్వరలో పేలిపోనుందని హబుల్ టెలిస్కోప్ తాజాగా ధ్రువీకరించింది. అది ఎప్పుడు జరగొచ్చన్నది వీలైనంత కచి్చతంగా అంచనా వేసేందుకు సైంటిస్టులు ప్రయతి్నస్తున్నారు.ఏమిటా తోక?: బెటెల్‌గెస్ తాలూకు ‘తోక’ఇప్పుడు శాస్త్రవేత్తల నడుమ హాట్ టాపిక్‌గా మారింది. నక్షత్రం నుంచి అది అస్తవ్యస్తంగా సుదూరాల దాకా పొడుచుకుని వచి్చనట్టుగా కనిపిస్తోంది. హబుల్ టెలిస్కోప్ తాలూకు అతి శక్తిమంతమైన పరారుణ ఇమేజింగ్ సాయంతో ఈ తోక ఆనుపానులను సైంటిస్టులు తాజాగా అతి స్పష్టంగా కనిపెట్టారు. ఈ తోక ప్రాంతం మరో నక్షత్రం ప్రభావానికి, దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతోందని, అందుకే అస్తవ్యస్తంగా వంపులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందని వివరించారు. ‘‘ఆ తార స్పష్టంగా హబుల్ కంటికి చిక్కకపోయినా దాని ప్రభావం మాత్రం సుస్పష్టం.ఎందుకంటె బెటెల్‌గెస్ నుంచి బయటికి వెరజిమ్ముతున్న ప్రతి పదార్థమూ బయటి శక్తి ద్వారా ఒకరకమైన బలమైన లాగుడుకు లోనవుతోంది. చ్రి™కవిచిత్రమైన ఆకారాలు దాలుస్తోంది’’అని వారు చెప్పుకొచ్చారు. ఎందుకంత ప్రాధాన్యం?: బెటెల్‌గెస్ తోక తాలుకు స్వరూప స్వభావాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా కీలకంగా మారనుంది. ఇప్పటిదాకా మిస్టరీగానే ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ తాలూకు పలు చిక్కుముడులను విప్పడంలో ఇది ఎంతగానో దోహదపడవచ్చన్నది సైంటిస్టుల ఆశాభావం. అంతేగాక ఇలాంటి భారీ నక్షత్రాలు సూపర్నోవాగా మారి పేలినప్పుడు వాటినుంచి బయటికి విరజిమ్మే మూలకాలు, పదార్థాలు అంతరిక్షాన్ని మరింత సుసంపన్న చేస్తాయని చెబుతున్నారు.నిజానికి బెటెల్‌గెస్ ప్రవర్తన, దాని తీరుతెన్నులు ఇటీవలి కాలం దాకా సైంటిస్టులను బాగా తికమక పరిచాయి. ముఖ్యంగా 2019–20 నడుమ అది ఉన్నట్టుండి పూర్తిగా కాంతివిహీనంగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది! ‘‘అందుకే ఈ భారీ నక్షత్రం గురించి తెలుసుకుంటున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా గొప్ప విషయం’’అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూగ్రహాల అన్వేషణకు ధూళి మేఘాల అవరోధం!
మన సమీపంలోని ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిలాంటి గ్రహంపై వాతావరణం, అతిప్రకాశమంతమైన నక్షత్రకాంతి, ఆకాశంలో ధూళిమేఘాలను చూపుతూ రూపొందించిన ఈ ఊహాచిత్రాన్ని సోమవారం యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు విడుదలచేశారు. మన భూమి మాదిరిగా జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహాల అన్వేషణ కోసం.. వెరీ లార్జ్ టెలిస్కోపుతో అనేక నక్షత్రాలపై అధ్యయనం చేసిన వీరు తొమ్మిది నక్షత్రాల చుట్టూ భారీ ధూళిమేఘాలను కనుగొన్నారు. నక్షత్రాలకు మరీ దూరంగా, దగ్గరగా లేకుండా అనుకూలమైన దూరంలో ఉన్న గ్రహాల ప్రాంతంలోనే ఈ ధూళిమేఘాలు ఏర్పడటం వల్ల భూమిలాంటి గ్రహాల అన్వేషణకు తీవ్ర అవరోధం కలుగుతోందట. గ్రహశకలాలు ఢీకొట్టుకోవడం, తోకచుక్కలు క్షయం అవడం వల్ల అంతరిక్షంలోకి పెద్ద ఎత్తున ధూళికణాలు విడుదలై ఇలా మేఘాలుగా ఏర్పడి నక్షత్రకాంతితో ప్రతిఫలిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


