breaking news
Stefanie Taylor
-
తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై వెస్టిండీస్ ప్లేయర్
వెస్టిండీస్ మహిళా సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఓవర్ ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ షార్ట్‌ఫైన్ దిశగా ఆడింది. షార్ట్ఫైన్లోనే ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలు బెణికినట్లయింది. దీంతో మైదానంలో కూలబడింది. టేలర్ పైకి లేవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే మెడికల్ సిబ్బంది స్ట్రెచర్‌పై ఆమెను గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్‌గా -
విండీస్ మహిళల బోణీ
చెన్నై: టి20 ప్రపంచకప్ మహిళల ఈవెంట్లో వెస్టిండీస్ 4 పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 103 పరుగులు చేశారు. స్టెఫాని టేలర్ (40) రాణించింది. పాక్ బౌలర్ ఆనమ్ అమిన్ 4 వికెట్లు తీసింది. తర్వాత పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది. బిస్మా 22 పరుగులు చేసింది.