breaking news
statutory liquidity ratio
-
బ్యాంకింగ్ ‘పరపతి’ సాధనంగా ‘పసిడి’ ప్రశ్నేలేదు!
న్యూఢిల్లీ: ద్రవ్య, పరపతి సాధనంగా బంగారం సరికాదన్న అభిప్రాయానికే కేంద్రం ఓటు చేస్తున్నట్లు కనబడుతోంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) అవసరాలకు- ప్రతిపాదిత ‘బంగారం డిపాజిట్’ పథకం ద్వారా సమీకరించిన మెటల్‌ను వినియోగించుకోవాలన్న ఆలోచనను కేంద్రం విరమించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయానికి విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకోరాదన్న ఉద్దేశమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. రెండు వారాల్లో బంగారం డిపాజిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుందని సమాచారం. సెప్టెంబర్ మొదటి వారం నుంచీ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: వడ్డీ రేట్లను మార్పు చేయకుండా ఉంచాలని, ద్రవ్య మార్కెట్ లో లిక్విడిటీ పెంచేందుకు ఎస్ఎల్ఆర్ ను 0.53 శాతం తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 25605 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 7651 వద్ద ముగిసింది. ఎస్ఎల్ఆర్ తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని స్టాక్ మార్కెట్ బ్రోకర్లు తెలిపారు. ఎస్ఎల్ఆర్ ను అరశాతం తగ్గించడం వలన 40 వేల కోట్లు ద్రవ్యమార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. అల్ట్రా టెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం కంపెనీలు రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భెల్, ఐడీఎఫ్ సీ కంపెనీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డు
ముంబై: స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు మంగళవారం ప్రకటించడంతో స్టాక్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,858.59 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 53.35 పాయింట్ల వృద్ధితో 7,415.85 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వద్ద క్లోజైంది. ఎస్ఎల్ఆర్ తగ్గింపుతో బ్యాంకులకు రూ.40 వేల కోట్ల మేరకు నిధులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎనిమిది కీలక రంగాలు ఏప్రిల్‌లో 4.2 శాతం వృద్ధి సాధించడం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపిందని బ్రోకర్లు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ తొలి ద్రవ్య విధాన సమీక్ష మంగళవారం జరిగింది. మార్కెట్ ఊహించినట్లుగానే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. బ్యాంకులు, రియల్టీ రంగానికి లబ్ధి కలిగించే ఎస్ఎల్ఆర్ కోతను ప్రకటించింది. ధరలకు అనుగుణంగా స్పందించే రియాలిటీ ఇండెక్స్ 3.15 శాతం పెరిగింది. చైనాలో ఫ్యాక్టరీ, సేవా రంగాలు చాలా కాలం తర్వాత మేలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో మెటల్ స్టాక్స్ ప్రకాశించాయి. టాటా స్టీల్ 6.69, సెసా స్టెరిలైట్ 6.53 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌లో 17 పైకి... సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 17 షేర్లు పెరగ్గా 13 దిగువముఖం పట్టాయి. ధర పెరిగిన షేర్లు : కోల్ ఇండియా 5.29, ఓఎన్జీసీ 4.40, భెల్ 3.48, హిందాల్కో 3.23, ఎన్టీపీసీ 3.14, హీరో మోటోకార్స్ 2.96, హెచ్డీఎఫ్సీ 1.69, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.15 శాతం వృద్ధి చెందాయి. డాక్టర్ రెడ్డీస్ 3.15, గెయిల్ ఇండియా 2.07, హెచ్‌యూఎల్ 1.51, ఐటీసీ 1.16 శాతం ధర క్షీణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ సూచీలను గమనిస్తే... మెటల్ 5.06, రియల్టీ 3.15, ఆయిల్ అండ్ గ్యాస్ 1.76, విద్యుత్తు 1.44, కన్సూమర్ బ్యూరబుల్స్ 1.44, కన్సూమర్ గూడ్స్ 1.25 శాతం ఎగిశాయి. మార్కెట్లో ట్రేడయ్యే మొత్తం షేర్లను పరిశీలిస్తే... 1,921 కంపెనీల స్టాక్స్ ధరలు పెరగ్గా, 1,089 కంపెనీల షేర్ల రేట్లు క్షీణించాయి. మిగిలిన 96 షేర్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం టర్నోవరు రూ.3,619.44 కోట్లు కాగా మంగళవారం రూ.4,084.34 కోట్లకు పెరిగింది. 20 శాతం వరకు పెరిగిన సుగర్ ఈక్విటీలు... బయ్యర్లు ఎగబడడంతో చక్కెర కంపెనీ షేర్ల ధరలు 20 శాతం వరకు ఎగిశాయి. దేశంలో పంచదార పరిశ్రమ పునరుత్తేజం పొందుతుందని బయ్యర్లు ఆశాభావంతో ఉన్నారు. మార్కెట్ ధోరణిని ప్రతిబింబిస్తూ త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ షేరు ధర 19.91 శాతం, ధామ్‌పూర్ సుగర్ మిల్స్ షేరు రేటు 11.44 శాతం పెరిగాయి. శ్రీరేణుకా సుగర్స్ 10.44, బజాజ్ హిందుస్థాన్ 9.82 శాతం వృద్ధిచెందాయి. దిగజారిన బ్యాంక్ షేర్లు ... కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో బ్యాంకుల షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 0.28, ఎస్బీఐ 0.03 శాతం క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.91, కోటక్ మహింద్రా బ్యాంక్ 1.46, ఐడీబీఐ బ్యాంక్ 1.27 శాతం తగ్గాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్ 0.18 శాతం తగ్గుదలతో 17,478.99 పాయింట్ల వద్ద ముగిసింది.