రేపటి నుంచి ‘శాప్’ వాటర్ స్పోర్ట్స్ క్యాంప్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్), ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌తో కలిసి సంయుక్తంగా వార్షిక సమ్మర్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్‌లో నిర్వహించనున్నారు. కానోయింగ్ కయాకింగ్, సెయిలింగ్, రోయింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోచింగ్ క్యాం ప్లో పాల్గొనే ఆసక్తి గల వారు ఇతర వివరాలకు శాప్ వాటర్ స్పోర్ట్స్ పరిపాలనాధికారి ఎ. అలీ మ్ ఖాన్ (99893-35840)ను సంప్రదించాలి.
5 నుంచి చెస్ కోచింగ్
నాగభవాని చెస్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ చెస్ శిక్షణ శిబిరం మే 5 నుంచి మణికొండలోని ఉస్మానియా కాలనీలో జరుగుతుంది. అండర్-3 నుంచి బాలబాలికలకు చెస్‌లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు తమ స్కూల్ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు (95335-29301)ను సంప్రదించవచ్చు.