breaking news
stages protest
-
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్‌కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్‌కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్‌కుమార్‌కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
కాపురానికి తీసుకెళ్లలేదని భార్య మౌనపోరాటం
-
'మౌనం వీడే వరకు మేమింతే'
న్యూఢిల్లీ: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు భారీ సంఖ్యలో. అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే.. ఒక్కసారిగా నినాదాలు, చేతిలో ప్లకార్డులు, నిరసన హోరులు.. ఇదంతా కూడా బుధవారం పార్లమెంటు వద్ద తాజా దృశ్యం. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో లలిత్ మోదీ వ్యవహారాన్ని చేతిలో ఆయుధంగా పెట్టుకొని అధికార పక్షాన్ని ఇరుకున పెడుతుంటే బయటకూడా అలాంటి కాకనే కాంగ్రస్ పార్టీ తన యువజన విభాగం ద్వారా సృష్టించింది. లలిత్ మోదీకి వీసా ఇచ్చేందుకు సహకరించిన సుష్మా స్వరాజ్‌ను, ఆమెతోపాటు ఉన్న ఇతర నిందితులు ముఖ్యమంత్రులు వసుంధర రాజే, వ్యాపం స్కాంకు సంబంధించి శివరాజ్ సింగ్ చౌహన్‌ను వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం డిమాండ్ చేసింది. ప్రధాని వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని, ఆయన చెప్పేవరకు పార్లమెంటు ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.


