breaking news
Srikrishna Praya
-
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. నైజీరియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకృష్ణప్రియ 21–12, 21–9తో డొర్కాస్ అజోక్ అడెసొకాన్ (నైజీరియా)పై అలవోకగా గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రెండో సీడ్ శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లో 17–21, 21–9, 21–6తో సోనియా గొన్కాల్వెస్ (పోర్చుగల్)ను ఓడించిం ది. ఫైనల్లో మూడో సీడ్ సెనియా పొలికర్పోవా -
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
ఖార్కివ్ (ఉక్రెయిన్): హైదరాబాదీ యువ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ ఫొర్జా ఖార్కివ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 6–21, 21–12, 21–14తో ఐదో సీడ్ మరియా మిత్సోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో 22–20, 21–4తో అలెసియా జయిత్సవ (బెలారస్)ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీకృష్ణప్రియ... ఉక్రెయిన్‌కు చెందిన ఏడో సీడ్ నటాలియా వొయెత్సెఖ్తో తలపడనుంది. కిడాంబి శ్రీకాంత్ సోదరుడు నందగోపాల్ మిక్స్డ్, పురుషుల డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత పొందాడు. మిక్స్డ్ సెమీస్‌లో మూడో సీడ్ నందగోపాల్–మహిమా అగర్వాల్ (భారత్) జంట 21–18, 21–15తో జోచిమ్ పెర్సన్–ఎమిలీ జువుల్ (డెన్మార్క్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ సెమీస్‌లో నందగోపాల్–రోహన్ కపూర్ (భారత్) జోడి 21–13, 21–14తో భారత్‌కే చెందిన ఉత్కర్‡్ష అరోరా–స్వర్ణరాజ్ బొరా ద్వయంపై గెలిచింది.