breaking news
Sri Lankan Tamils
-
రజనీకాంత్ బహిరంగ లేఖ
చెన్నై: శ్రీలంకలోని తమిళులు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానులకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న తమిళులను ఉద్దేశిస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. 'మీరు నా పట్ల చూపుతున్న అభిమానాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నా. మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు చాలడం లేదు. మంచిగా ఆలోచిస్తే, మంచి మాత్రమే జరుగుతుంది. సమయం వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. మీరు బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అని రజనీ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 9న శ్రీలంకలో జాఫ్నాలో కొత్తగా నిర్మించిన 150 ఇళ్లను తమిళులకు అందించే కార్యక్రమంలో రజనీ పాల్గొనాల్సివుంది. అయితే స్థానిక తమిళ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన లంక పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రజనీకి మద్దతుగా జాఫ్నాలోని తమిళులు ర్యాలీ నిర్వహించారు. -
నకిలీ పాస్‌పోర్టు ముఠా అరెస్ట్
కేకే.నగర్: నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేసి దాని ద్వారా శ్రీలంక తమిళులను విదేశాలకు పంపిన శ్రీలంకకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్టులు, దాన్ని తయారు చేసే కంప్యూటర్‌తో సహా కొన్ని పరికరాలను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. నిందితులను అరెస్టు చేయాలని పోలీసు కమిషనర్ టి.కె.రాజేంద్రన్, కేంద్ర క్రైం బ్రాంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్ర నేర విభాగ అదనపు పోలీసు కమిషనర్ అరుణాచలం నేతృత్వంలో ప్రత్యేక బృందం పోలీసులు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఆ సమయంలో తిరుముల్లైవాయల్ సమీపంలోని వైష్ణవి నగర్లో కొందరు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. దీంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో కొళత్తూరుకు చెందిన నాగూర్ మీరాన్ (46) వద్ద తొమ్మిది నకిలీ పాస్‌పోర్టులు పట్టుబడ్డాయి. వాటిని తిరుముల్లైవాయల్‌లోని గుణ నాయకం (64), సౌరిముత్తు (60)కు ఇవ్వడానికి వెళుతున్నట్లు తెలియడంతో వారిద్దరిని గత మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన వివరాల మేరకు ప్రదాన నిందితులైన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (66), మురళీధరన్, రాజన్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరు నకిలీ పాస్‌పోర్టులను, వీసాలను తయారు చేసి శ్రీలంకకు చెందిన వారిని విదేశాలకు పంపిస్తున్నారని తెలిసింది. కాలం చెల్లిన, నిరుపయోగమైన పాస్‌పోర్టులను మూడువేలకు కొని వాటి లామినేషన్ను తీసేసి పాస్‌పోర్టు కావాలని కోరిన వారి ఫొటోలను అతికించి నకిలీ పాస్‌పోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది. వీటిని రూ. 30 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా వీరిపై కేసు నమోదైనట్లు గుర్తించారు. బుధవారం నిందితుల నుంచి 28 నకిలీ పాస్‌పోర్టులను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. -
తమిళులకు అధికారాలు ఇవ్వాలి
శ్రీలంక తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను ఇవ్వాలి * 13వ రాజ్యాంగ సవరణను అమలుచేయాలి * భారత జాలర్లను ప్రోత్సహించాలి: ఉగ్రవాదంపై సమష్టిపోరు * భారత-శ్రీలంక చర్చల్లో ప్రధాని మోదీ * ఆరోగ్య, అంతరిక్ష విజ్ఞాన ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు. జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా పోరాడటంతో పాటు, ఇరుదేశాల మధ్య భద్రత, సుస్థిరతల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. శ్రీలంకలో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చిన విక్రమసింఘేను మోదీ ప్రశంసించారు. భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ఇరుదేశాల ప్రధానుల మధ్య విస్తృత ప్రాతిపదికన మంగళవారం చర్చలు జరిగాయి. తమిళులకు న్యాయం చేయటం పైనే ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ, రెండు దేశాల నడుమ సుదీర్ఘంగా నలుగుతున్న జాలర్ల సమస్య, వ్యాపార, రక్షణ వ్యవస్థల బలోపేతం, ఉగ్రవాదం, సముద్రజలాల సరిహద్దుల భద్రత వంటి అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరా యి. వైద్య-ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష విజ్ఞానంలో పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం మోదీ, విక్రమ సింఘేలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రక్షణ, భద్రత అంశాలలో పరస్పరం నిబద్ధతతో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ‘‘ఇరు దేశాల మధ్య రక్షణ ప్రయోజనాలను మేం గుర్తించాం. భద్రతా శిక్షణ రంగంలో భారత్‌కు అతి పెద్ద భాగస్వామి అయిన శ్రీలంకతో ఈ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. తమిళులతో పాటు, శ్రీలంక ప్రజలంతా సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవాలతో జీవించాలి. రాజ్యాంగపరంగా వారికి దక్కాల్సిన అధికారాలను అందించాలి. జాలర్ల సమస్యకు సంబంధించి రెండు దేశాల జాలర్ల సంఘాలు కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కారాన్ని అన్వేషించాలి. ఈ అంశాన్ని మానవీయ కోణంలో చూడాలని నేను విక్రమ సింఘేకు తెలిపాను. సముద్ర జలాల్లో మరింత లోతుల్లో చేపల వేటకు భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం ప్రోత్సహించాలి’’ అని మోదీ తెలిపారు. ఆర్థిక భాగస్వామ్యం అంశంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని, వచ్చేఏడాదికల్లా తుదిరూపుకొస్తుందని మోదీ అన్నారు. శ్రీలంకలో మౌలిక వనరులు, ఇంధన, రవాణా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మోదీ అన్నారు. శ్రీలంక ప్రధాని విక్రమసింఘే మాట్లాడుతూ, రాజ్యాంగం పరిధిలో తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. శ్రీలంకలో మైనారిటీలో ఉన్న తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటం కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని భారత్ చాలాకాలంగా శ్రీలంకను కోరుతోంది. 1987లో అప్పటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే, అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీల మధ్య జరిగిన ఒప్పందం మేరకే 13వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం తమిళులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు కొన్ని అధికారాలను ఇవ్వాల్సి ఉంటుంది. సంగక్కరకు అభినందనలు క్రికెట్ రంగం నుంచి ఇటీవలే రిటైర్ అయిన శ్రీలంక క్రీడాకారుడు కుమార సంగక్కరను మోదీ ప్రశంసించారు. సంగక్కర గొప్ప బ్యాట్స్‌మన్ అని.. శ్రీలంకతరఫున అతని ఆట చూడలేకపోవటం లోటేనని ఆయన అన్నారు. ‘మనం ఇటీవలే శ్రీలంకతో టెస్ట్‌సిరీస్ పూర్తి చేసి వచ్చాం.. ఇకపై గ్రేట్ కుమార సంగక్కరను మిస్అవుతున్నాం’ అని ఆయన అన్నారు. భారత్-లంకల మధ్య వారధి.. భారత్ శ్రీలంకల మధ్య రూ. 34 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన సముద్ర రహదారి, సముద్రగర్భం లో సొరంగ మార్గ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఓడరేవుల మంత్రి నితిన్ గడ్కారీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో మంగళవారం చర్చించారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం ఖరారైతే, శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత సరిహద్దులోని ధనుష్కోటి దాకా 22 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు.