breaking news
Sri Kanth Reddy
-
వైఎస్సార్సీపీలోకి చేరికల వెల్లువ
బొమ్మనహాళ్, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. దర్గాహొన్నూరులో టీడీపీ, కాంగ్రెస్ నుంచి దాదాపు 400 మంది శుక్రవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్.వన్నప్ప, రమేష్‌ల అధ్వర్యంలో పూజారి చిన్నవన్నూరప్ప, శీనప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.ఎల్లప్ప, చిన్నసిద్దప్ప, జలేంద్ర, ముత్యాలప్ప, పెద్దవన్నూరప్ప, రోగన్న, పాల్తూరు తిప్పేస్వామి, నాగరాజు, జి.వన్నూరప్ప, వన్నూరుస్వామి, వారి అనుచరులు పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాటిల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మాజీ ఎమ్పీపీలు రాజగోపాల్‌రెడ్డి, లాలుసాబ్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్‌కుమార్, హొన్నూరు రామక్రిష్ణ, నాగభూషణ, వన్నూరుస్వామి, సింగానహళ్ళి దేవణ్ణ, అంజినేయ, రామాంజినేయులు, తిప్పేస్వామి, కరెణ్ణ, ఉద్దేహాళ్ ఈశ్వర్‌రెడ్డి, శ్రీధరగట్ట చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాహ వేడుకల్లో సీఎం కిరణ్
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన పీలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి కుమార్తె రోహితరెడ్డి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులు రోహితరెడ్డి, కృపానందరెడ్డిని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీర్వదించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అల్పాహార విందును ఆరగించారు. వివాహానికి టీటీడీ బోర్డు సభ్యులు జీవీ.శ్రీనాథరెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. భారీ బందోబస్తు పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రాకను పురస్కరించుకుని లక్ష్మీపురం సర్కిల్ నుంచి టీవీఎస్ షోరూం వైపు వెళ్లే వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ జాం చేశారు. దాదాపు రెండు గంటలపాటు లక్ష్మీపురం సర్కిల్ వైపు నుంచి ఎయిర్‌బైపాస్‌రోడ్డు వైపు వాహనాలు రాకుండా కట్టడి చేశారు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అత్యవసరంగా వెళ్లాలని వాహనదారులు వేడుకున్నా వినలేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉన్నవాళ్లు కార్యాలయాలకు వెళ్లేందుకు, పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు.