breaking news
Sri Hari
-
ఇబ్రహీంపూర్ ఘటనలో నిందితుల అరెస్టు
సంచలనం కలిగించిన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ ఘటనపై రెండు జిల్లాల పోలీసులు చర్యలు ప్రారంభించారు. శ్రీహరి అనే మృతితో సంబంధం ఉందంటూ శుక్రవారం గ్రామంలో సర్పంచి ఇంటిపై దాడి జరిగిన విషయం విదితమే. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపూర్ సర్పంచి కుంబాల లక్ష్మి కుటుంబసభ్యులు ఆరుగురిపై కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సర్పంచి సంబంధీకులు కొట్టడంతోనే శ్రీహరి చనిపోయాడంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచి కుమారులు ఎల్లారెడ్డి, నాగిరెడ్డితోపాటు కుటుంబసభ్యులు ర జినీకాంత్రెడ్డి, మహేందర్రెడ్డి, మల్లికార్జున్రెడ్డిలపై హత్యకేసు నమోదుచేశారు. మరోవైపు సర్పంచి ఇంటిపై దాడి, ధ్వంసంతోపాటు మీడియా, పోలీసులపై దాడికి పాల్పడి న ఘటనల్లో పాల్గొన్న మృతుడు శ్రీహరి బంధువులు జిల్లెల్ల, తెర్లుమద్ది గ్రామాలకు చెందిన 30 మందిపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మెదక్ ఎస్పీ సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో తెర్లుమద్ది సర్పంచి కృష్ణ కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన పది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. -
ఇబ్రహీంపూర్ దాడి: శ్రీహరికి పోస్టుమార్టం పూర్తి
-
ఇబ్రహీంపూర్ దాడి: శ్రీహరికి పోస్టుమార్టం పూర్తి
మెదక్ : మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ దాడి ఘటనలో మృతి చెందిన బీడీ కంపెనీ యజమాని శ్రీహరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అతడి మృతదేహాన్ని సిరిసిల్ల మండలం జిల్లెల్లకు పోలీసులు తరలించారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లెల్ల - ఇబ్రహీంపూర్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. అలాగే ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటి వరకు చెర్లుమద్ది సర్పంచ్ సహా 30 మంది యువకులను సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే జిల్లెల్లలో శ్రీహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజీ నవీన్ చంద్ మాత్రం శుక్రవారం ఇరుగ్రామాలను సందర్శించి... పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
చివరిఆశలు
అదను దాటుతోంది ముసురు వానతో పొలాలకు అందని జీవతడి మరో రెండువారాలే కీలకం మైదానంలో కానరాని వరినాట్లు నారుమళ్లపై పురుగుల దాడి అనకాపల్లి : జిల్లాలో వరి సాగు ఆందోళనకర పరిస్థితుల్లో కొనసాగుతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్న పొలాలకు జీవతడిని అందించే స్థాయిలో లేకుండా పోయాయి. జూలై మాసంలో కురిసిన వర్షాలు వరి నారుమళ్లు వేసుకోవడానికి దోహదపడినప్పటికీ ఆగస్టు మొదటి రెండు వారాల్లో కురిసే వర్షపాతమే కీలకం కానుంది. జూలైలో 197.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 166.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో 15.61 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2లక్షల 8వేల 783 హ క్టార్లలో 23 రకాల పంటలు సాగు అవ్వాల్సి ఉండగా, ఇంకా నాట్లు ప్రక్రియ లేని పంటలు చాలా ఉన్నాయి. అధికంగా సాగు చేసే వరి సాగు విస్తీర్ణం 96,519 హెక్టార్లు అయితే 8,638 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. అది కూడా ఏజెన్సీలోనే అధికం. మైదానంలో కేవలం వరి నారుమళ్ల స్థాయిలోనే ఉంది. జూన్, జూలైల్లో వర్షపాతం ఆశిం చిన మేరకు నమోదు కాకపోవడంతో జిల్లాలో వరి రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు స్వల్ప కాలిక రకాలను వరి నారుమళ్లకు వినియోగించారు. సరిహద్దు జిల్లాల్లో సైతం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే జిల్లాలో మాత్రం నదులు, సాగునీటి కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మరో రెండువారాల్లో వర్షపాతం వరి రైతుల భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఇప్పటికే వరి నారుమళ్లు చాలాచోట్ల రంగుమారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదను దాటితే... ఆగస్టు 15 దాటితే అదును దాటిందని గుర్తించి నేరుగా వెదజల్లే పద్ధతిలో స్వల్పకాలిక రకాలైన కాటన్దొర సన్నాలు, నెల్లూరు సన్నాలను ఆశ్రయించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ప్రదీప్, కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవ్తేత శ్రీహరి చెబుతున్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్తలు అనకాపల్లి మండలంలోని మార్టూరుతో పాటు రాంబిల్లి, యలమంచిలి, పరవాడ మండలాలలో పొడి దుక్కులో వరివిత్తే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేళ్లలోను ఇదే తరహాలో ఆగస్టు వరకు వర్షపాత లోటు నమోదు కావడంతో నాట్లు వేసేటప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేసినప్పటికీ పంట కోత దశలో ముంచెత్తిన వర్షాలు దిగుబడిని ప్రభావితం చేశాయి. గత ఏడాది ఎకరాకు 16 నుంచి 17 బస్తాలు (75 కేజీల బస్తా) దిగుబడినిచ్చాయి. వాస్తవానికి జిల్లాలో 25 బస్తాల వరకు దిగుబడి రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా అదే తరహా పరిస్థితి పునరావృతమయితే అప్పులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వీకెండ్ లవ్ మూవీ స్టిల్స్