breaking news
sports film
-
డబుల్ బొనాంజ
శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. గురువారం (మార్చి 6) శర్వానంద్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘మూడు తరాల నేపథ్యం, ప్రేమ, కలలు... వంటి అంశాల నేపథ్యంతో ముడిపడి 1990, 2000ప్రారంభంలో సాగే మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్.నారీ నారీ నడుమ మురారి: శర్వనాంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇలా బర్త్ డేకి తన ఫ్యాన్స్‌కు శర్వానంద్ డబుల్ బొనాంజ ఇచ్చారు. -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
‘టెస్ట్’ కోసం రెడీ అవుతున్న నయనతార
లేడీ సూపర్‌స్టార్ నయనతార తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ బాద్షా షారూక్‌ఖాన్‌తో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈమె నటించి నిర్మించిన కనెక్ట్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఆశించిన విజయం సాధించకపోయినా ఇదో విభిన్న ప్రయత్నం. అయితే ఇటీవల నయనతారకు అవకాశాలు తగ్గాయని, ఆమె కూడా నటనకు స్వస్తి చెప్పి చిత్ర నిర్మాణ రంగంపై దృష్టి పెట్టబోతున్నార నే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే అదంతా ఒక ప్రచారం మాత్రమే. వాస్తవానికి నయనతార చిన్న గ్యాప్ తీసుకున్నారంటే. కవల పిల్లలకు తల్లి అవడం అదే విధంగా తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజా చిత్రం మిస్ కావడంతో కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా మళ్లీ నటిగా విజృంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె నటిస్తున్న 75వ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా శనివారం చైన్నెలో ప్రారంభమైంది. ఇది ఆమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. తాజాగా మరో భారీ చిత్రానికి కూడా నయనతార గ్రీన్ సిగ్న్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నయనతారతో పాటు నటుడు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. దీనిని నిర్మాత వై నాట్ శశి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారన్నమాట. ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. దీనిని ది టెస్ట్ అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సాధారణ చిత్రం కాదు..
ముంబై: ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన ‘మేరీ కోమ్’ సినిమాను మామూలు సినిమాల్లా పరిగణించవద్దని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోరింది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రను ఆధారంగా ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటించింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై గతేడాది విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో మేరీకోమ్ సినిమాను పోల్చడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది. దేశంలో మొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి జీవితాన్ని ఆధారంగా తీసిన ఈ సినిమాను వేరే సినిమాలతో పోలిస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని ప్రియాంక స్పష్టం చేసింది. మేరీకోమ్ మనజాతి గర్వించదగ్గ క్రీడాకారిణి.. అని ఆమె వ్యాఖ్యానించింది. ముంబైలో బుధవారం ‘మేరీకోమ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తన నటజీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు దేనికీ కష్టపడలేదని చెప్పింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించడమంటే మాటలు కాదని, అటువంటి అద్భుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంక పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమాలో మేరీలా శరీరాకృతిని ప్రదర్శించడానికి రోజూ 15 గంటలపాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని తెలిపింది. బాక్సింగ్‌లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి బాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరేలా ఒలంపిక్స్‌లో పతకం సాధించిందని ప్రియాంక వివరించింది. ఈ సినిమాకు డెరైక్టర్ దేబుటంగే ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ 5వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కానుంది.