breaking news
sports certificate
-
సర్టిఫి‘కేట్లు’ కలకలం..!
సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. ఉమ్మడి విశాఖతోపాటు ఇతర జిల్లాల్లోనూ నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాతోపాటు వీహెచ్ (విజువల్లీ హ్యాండీక్యాప్డ్), ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కేటగిరీల్లోనూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి, మెరిట్‌ను పక్కనపెట్టి ఉద్యో గాలు పొందారన్నది పలువురు బాధిత అభ్యర్థుల ప్రధాన ఆరోపణ. 66.6 మార్కులొచ్చినా..విశాఖకు చెందిన దేవగుటపు సంతోష్ పార్వతి డీఎస్సీ పీజీటీ పరీక్షలో 66.6 మార్కులు (హాల్ టికెట్ నెం. ఎండీఎస్సీ 0124213) సాధించారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జోన్–1లో 92వ ర్యాంక్ లభించింది. పీజీటీలో మొత్తం 10 పోస్టులు ఉండగా తనకంటే చాలా తక్కువ మార్కులు సాధించిన వ్యక్తికి వీహెచ్ కోటా కింద ఉద్యోగం దక్కడం వల్ల తనకు అవకాశం చేజారిందని ఆమె వాపోతోంది. 46 మార్కులతో 852వ ర్యాంక్ పొందిన అశోక్‌కుమార్‌కు (హెచ్‌టీ నెం.ఎండీఎస్సీ 0242090) ఈడబ్ల్యూఎస్, వీహెచ్ కోటా కింద ఉద్యోగం లభించింది. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని నకిలీ వీహెచ్ సర్టిఫికెట్ ద్వారా పొందినట్లు సంతోష్ పార్వతి ఆరోపిస్తోంది. ఇదే రీతిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన భాస్కర్‌రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో 72.52 మార్కులతో 68వ ర్యాంక్ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదని సంతోష్ పార్వతి చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ నుంచి నకిలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ తెచ్చుకున్న గోనెగుంట సుభాషిణి టెట్ అర్హత కూడా లేకపోయినా 48 మార్కులతో ఉద్యోగం పొందారని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు మదనపల్లికి చెందిన అంజనప్పకు ఒక కన్ను లేకపోయినా.. వైద్య పరీక్షల్లో 30 శాతం వైకల్యమే ఉన్నట్లు నిర్ధారించడంతో ఉద్యోగం ఇవ్వలేదని బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. రీ–వెరిఫికేషన్‌లో 40 శాతం వైకల్యం ఉన్నట్లు తేలిందని పేర్కొంటున్నారు. తనకు ఇది చివరి డీఎస్సీ అని, వయసు కారణంగా మరోసారి పరీక్ష రాసే అవకాశం లేదని పార్వతి చెబుతున్నారు. బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు.700 మందికిపైగా నష్టపోయారా?రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ సాధించి 1 : 1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు హాజరైన 700 మందికిపైగా అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు. -
‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన తొలగింపు సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ గురువారం తెలిపిం ది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్/ స్పోర్ట్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. బీపీఈడీ చేసిన అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. నిర్ణీత మార్కులు కలిగిన డిగ్రీతో పాటు బీపీఈడీ ఉంటే సరిపోతుంది. 40% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్/3 ఏళ్ల బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిగ్రీ అభ్యర్థులకు నిర్ణీత విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్/గేమ్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధననూ తొలగించింది. క్రాఫ్ట్ టీచర్ పోస్టుల్లో నిర్ణీత విభాగాల్లో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) చేసిన వారికి, ఆర్ట్ టైలరింగ్ ఎంబ్రాయిడరీలో వొకేషనల్ ఇంటర్మీడియెట్ చేసిన వారికి, టీసీసీ లోయర్ చేసిన వారికి అవకాశం కల్పించింది. పోస్టులన్నింటికి 1999 జూలై 1 తర్వాత పుట్టినవారు, జనరల్ అభ్యర్థులు 1973 జూలై 2కు ముందు జన్మించిన వారు అర్హులు కాదు. తెలుగు, హిందీ, ఉర్దూ టీజీటీ, పీజీటీ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. -
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టుల్లో అవకాశం!
- రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల సర్టిఫికెట్లు ఉండాలని నిబంధన - ఆందోళనలో బీపీఈడీ అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు టీఎస్పీఎస్సీ విధించిన నిబంధన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) అభ్యర్థులకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. బీపీఈడీతో పాటు ఇంటర్ కాలేజీ, రాష్ట్ర, జాతీయ స్థాయి స్పోర్ట్స్‌లో పాల్గొన్నట్లు ఏదేని సర్టిఫికెట్ ఉంటేనే పీఈటీ పోస్టులకు అర్హులంటూ గురుకులాల్లో పీఈటీ పోస్టులకు టీఎస్పీఎస్సీ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిబంధన కారణంగానే.. బీపీఈడీ చేసినా పీఈటీ పోస్టులకు అనర్హులు అవుతున్నామని అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. ఇంటర్మీడియెట్‌లో 45% మార్కులు ఉండి, అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీపీడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) చేసిన వారు కూడా ఈ పీఈటీ పోస్టులకు అర్హులే. అయితే వారికి పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన మాత్రం లేదు. కేవలం బీపీఈడీ చేసిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలని నిబంధన విధించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం పీఈటీ పోస్టులకు యూజీపీడీ, డీపీఈడీ చేసిన వారు మాత్రమే అర్హులు. అయితే అంతకంటే ఎక్కువ అర్హతలైన డిగ్రీ, బీపీఈడీ ఉన్న వారికి కూడా పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సంక్షేమ శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. వారికి అవకాశం కల్పిస్తూనే స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన విధించడంతో ప్రయోజనం లేకుండాపోయింది. రాష్ట్రంలో యూజీపీడీ, డీపీఈడీ కాలేజీలకంటే బీపీఈడీ కాలేజీలే అధికంగా ఉన్నాయి. సాధారణ డిగ్రీ చదువుకున్న వారు కూడా బీపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో అనేక మంది బీపీఈడీ చేశారు. వారెవరికీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేవు. టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనతో బీపీఈడీ అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆవేదనలో పడ్డారు.


