breaking news
Spondylitis
-
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
స్పాండిలైటిస్‌కు హోమియోపతితో సంపూర్ణ నివారణ
నేటి మానవ జీవన విధానానికి ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటలు సమయం ప్రయాణానానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ మీద పనిచేయడం వలన వెన్నెముకపై అధిక ఒత్తిడి వలన స్పాండిలైటిస్‌కు దారి తీయడం సహజం. స్పాండిలైటిస్: వెన్నుపూసల మధ్య జరిగే ఇన్ఫ్లమేషన్ స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ మధ్య భిన్న వ్యత్యాసం ఉన్నది. స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా 20-40 ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్పైనల్ జాయింట్ల మధ్య ఇన్ఫ్లమేషన్ వల్ల ఇది వస్తుంది. స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇది ఎక్కువగా 40 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుంది. వెన్నెముకలో ఉండే మృదులాస్థి, దాని చుట్టూ ఉండే కణజాలం డీ జనరేటివ్ మార్పులకు గురి కావడం వలన ఇది వస్తుంది. ఇందులో రెండు పూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు డిస్క్ వాచటం, డిస్క్ బయటికి పొడుచుకొని రావడం వలన వెన్నెముకల మధ్యలో ఉండే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. స్పాండిలైటిస్ గాని, స్పాండిలోసిస్ గాని వెన్నెముకలో ఏ భాగంలోనైనా జరిగే అవకాశం ఉంటుంది. కాని ముఖ్యంగా మెడ దగ్గర (Lovical spondilitis) వెన్నెముక - లుంబార్ స్పాండిలైటిస్ అంటారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బలు తగలటం అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం సరి అయిన డ్రైవింగ్ పద్ధ్దతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్) క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease) ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు. లుంబార్ స్పాండిలైటిస్ లక్షణాలు నడుమునొప్పి, కాలి నొప్పి, నడుము నుంచి క్రింది కాలివేళ్ళ వరకు లాగడం, పిరుదుల్లో నొప్పి, మంటగా ఉండడం, తొడదగ్గర తిమ్మిరిగా ఉండడం. కారణాలు: సియాటికా అనే నరం నడుము నుండి కాలివేళ్ళ వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం L4-L5 ఒత్తిడికి గురి కావడం వలన ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది లుంబార్ స్పాండిలైటిస్‌లో సర్వసాధారణంగా కనిపించే లక్షణం. కొన్ని సందర్భాలలో దీనివలన పేషెంట్ నడవడం కూడా చాలా కష్టం అవుతంది. కొంతకాలం పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. రకాలు సర్వైకల్ స్పాండిలోసిస్ లుంబార్ స్పాండిలోసిస్ ఆంకిలైజింగ్ స్పాండిలోసిస్ పాట్స్ డిసీజ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు: వెన్నెముకలో వచ్చే ఒత్తిడిని బట్టి లక్షణాలు ఉంటాయి. మెడ దగ్గర నొప్పి రావడం, వెనుక భాగంలో అరల కదలికలో నొప్పి ఎక్కువ కావడం, మెడ, ఛాతి, భుజాలు, ఛాతి మొత్తంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. మంట, మొద్దు బారినట్లుగా ఉండడం, తిమ్మిరిగా ఉండటం జరుగుతుంది. ఈ తిమ్మిరి ఛాతీ నుంచి వీపు వరకు ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం, వాంతులు కావడం, కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఇది జీవనక్రియల్లో జరిగే మార్పుల వలన వచ్చే ఆటో ఇమ్యూనో డిసీజ్. దీనిలో ముఖ్యంగా వెన్నెముక, దానిచుట్టూ కణజాలం మృదుత్వాన్ని కోల్పోయి వెన్నెముక కదలికలు అన్నీ ఆగిపోయి గట్టిగా కర్రలా తయారవుతుంది. దీనిని ‘బాంబూ’ అంటారు. జన్యుపరమైన కారణాల వలన ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా వెన్నెముక, తుంటి ఎముకలు శాక్రో ఇలియాక్ జాయింట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడి పోతాయి. దానిమూలంగా వెన్నెముకలో సాధారణ కదలికలు నిలచిపోతాయి. ఇది ఎక్కువగా 15-40 ఏళ్ళు వయసు ఉన్న వారిలో కనిపిస్తుంది. దీనిని హెచ్ఎల్బీ-27 అనే పరీక్ష ద్వారా నిర్థారించవచ్చును. లక్షణాలు: వెన్నెముక గట్టిపడి కదలికలను తగ్గించడం వెన్నునొప్పి వెన్నెముక బయటకు పొడుచుకొని రావడం జ్వరం నీరసం, బరువు తగ్గడం. నిర్థారణ పరీక్షలు : ఎక్స్-రే స్పైన్ ఎమ్ఆర్ఐ ఆఫ్ స్పైన్ సీబీపీ, ఈఎస్ఆర్ హెచ్‌సీబీ-27 హోమియో చికిత్స హోమియో వైద్య విధానం ద్వారా కేవలం రోగ లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలు తగ్గించడమే కాకుండా జబ్బు యొక్క మూలాలనుండి పూర్తిగా మరియు శాశ్వతంగా తగ్గించటం. హోమియోకేర్‌లో గ్రూప్ ఆఫ్ డాక్టర్లు స్పాండిలైటిస్ మీద ప్రత్యేకమైన అధ్యయనం చేసి జెనెటిక్ కాన్సిట్యూషన్ సిమ్యూలిమ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా దీనిని సంపూర్ణంగా నయం చేయవచ్చని నిర్థారించారు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.