breaking news
SpiceJet Company
-
ఎట్టకేలకు ప్రారంభమైన స్పైస్‌జెట్ సర్వీసులు
75 విమాన సర్వీసులు రద్దు న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి తన విమాన సర్వీసులను ప్రారంభించింది. అప్పటిదాకా చమురు కంపెనీలు విమానయాన ఇంధనాన్ని సరఫరా చేయకపోవడంతో స్పైస్‌జెట్ 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత 75 విమాన సర్వీసులను నడపటానికి చర్యలు తీసుకున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ట్వీటర్ ద్వారా స్పైస్‌జెట్ సీఈఓ సంజీవ్ కపూర్ క్షమాపణలు చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు స్పైస్‌జెట్‌కు ఇంధనాన్ని సరఫరా చేయలేదు. ఈ బకాయిలు రూ.14 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. కాగా విమాన సర్వీసుల పునరుద్ధరణపై సంజీవ్ కపూర్ ఇచ్చిన హామీపై స్పైస్‌జెట్‌ను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వివరణ కోరింది. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ ఈ సంస్థ మొత్తం రుణాలు రూ.2,000 కోట్లుగా ఉన్నాయి. తక్షణం కార్యకలాపాలు సాగించడానికి కనీసం రూ.1,400 కోట్లు అవసరం. ఆర్నెళ్ల నుంచి స్పైస్‌జెట్ కంపెనీ క్యాష్ అండ్ క్యారీ విధానంలో విమానయాన ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. స్పైస్‌జెట్ మూతపడకుండా ఉండటానికి ఈ సంస్థకు రుణాల చెల్లింపులకు 15 రోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చమురు కంపెనీలను, విమానశ్రయ అధికారులను మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కార్యకలాపాలు సాఫీగా జరగానికి రూ. 600 కోట్లు రుణాలుగా ఇవ్వాలని కూడా సదరు మంత్రిత్వ శాఖ బ్యాంకులను, ఆర్థిక సేవా సంస్థలను కోరింది. -
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్
స్పైస్‌జెట్ విమాన టికెట్లపై 25% వరకూ డిస్కౌంట్ న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద దేశీయ రూట్లలో ప్రయాణించే నలుగురు లేదా అంతకు మించిన(నాలుగు నుంచి తొమ్మిది మంది) ప్రయాణికులకు విమాన టికెట్లలో 25 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ బేస్ఫేర్కు వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ కింద ఒక్కో విమానంలో పరిమితమైన సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించగలదని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవిలి ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం చౌక ధరలకే విమానయానాన్నందించే సంస్థ ఇండిగో ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.