breaking news
special category
-
విదేశీ విద్యార్థులకు రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలు
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ–స్టూడెంట్ వీసా, ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసాలను కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రకాల వీసాల కోసం విదేశీ విద్యార్థులు స్టడీ ఇన్ ఇండియా(ఎస్ఐఐ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి. ఈ–స్టూడెంట్ వీసాలను అర్హులైన విదేశీ విద్యార్థులకు మంజూరు చేస్తారు. వారిపై ఆధారపడినవారు ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసా ద్వారా భారత్‌కు రావచ్చు. వీటి కోసం పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్–టర్మ్, షార్ట్–టర్మ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర విద్యా శాఖ ప్రాజెక్టు కింద దేశంలో 600కు పైగా విద్యా సంస్థలు విదేశీయులకు ప్రవేశాలు కలి్పస్తున్నాయి. వేర్వేరు రంగాలకు సంబంధించి 8 వేలకు పైగా కోర్సులు అందిస్తున్నాయి. -
U19 WC: ద్రవిడ్, లక్ష్మణ్ మాస్టర్ ప్లాన్.. వాళ్ళ రాతలు మారిపోతాయి!
న్యూఢిల్లీ: మనోజ్ కల్రా... 2018 అండర్–19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. అయితే నాలుగేళ్ల తర్వాత కూడా అతని కెరీర్ ఊపందుకోలేదు. కల్రా మాత్రమే కాదు... ఎంతో మంది కుర్రాళ్లు వరల్డ్‌కప్ లాంటి విజయం తర్వాత కూడా ముందుకు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అండర్–19 వయో విభాగానికి, రంజీ ట్రోఫీకి మధ్య ఉన్న అంతరం కారణంగా వారికి సరైన మార్గనిర్దేశనం లేకుండా పోతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వారు అధిగమించలేక వెనుకబడిపోతున్నారు. ఇలాంటి ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ‘19 ప్లస్’ పేరుతో ఉండే ఈ బృందంలో అండర్–19 వరల్డ్‌కప్ విజేతలతో పాటు అదే వయో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఆటగాళ్లను చేరుస్తారు. పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తూ సాధనతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా (అండర్–25 తదితర) ఆయా రాష్ట్ర జట్ల తరఫున ఆడే అవకాశం కల్పిస్తారు. ఇదంతా ఎన్సీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లు జాతీయ సీనియర్, జూనియర్ సెలక్టర్లతో ఈ అంశంపై చర్చించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. -
నాలుగేళ్లు హోదా విషయంలో మోసం చేశారు