breaking news
space telescope
-
ఆకాశానికి ఆమె పేరు.. విశ్వానికి కొత్త చూపు...
నక్షత్రాల వైపు చూడొద్దన్నారు... కానీ ఆ నక్షత్రాల మధ్యే తన పేరు రాసుకుంది. అమ్మాయిలకు సైన్స్ ఎందుకన్నారు... కానీ ఆ సైన్స్ చరిత్రలోనే తన సంతకాన్ని చిరస్థాయిగా నిలుపుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో మగవాళ్ల పేర్లే పై చేయి అవుతున్న చోట నింగిని చూసే సరికొత్త కళ్లకు తన పేరును బహుమతిగా ఇచ్చిందామె. నాసా నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఫ్లాగ్షిప్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆమె పేరే పెట్టింది.‘నాన్సీ గ్రేస్ రోమన్’... ఆ అసాధారణ మహిళా శాస్త్రవేత్త స్ఫూర్తి గాథ ఇది.‘అమ్మాయిలు హోమ్‌సైన్స్ మాత్రమే చదవరు.అంతరిక్షాన్ని కూడా ఛేదిస్తారు’.... అన్నది ఆ అమ్మాయి ‘ఏం చదువుతావు’ అని అడిగిన స్నేహితులతో. ఆగస్ట్ 30, 2026. కెన్నడి స్పేస్ సెంటర్ నుంచి నాసా... ‘హబుల్’ కంటే వందరెట్లు శక్తివంతమైన సరికొత్త టెలిస్కోప్‌ను నింగిలోకి పంపింది. దానితో పాటు ‘రోమన్’ అనే అక్షరాలు కూడా నింగిలోకి వెళ్లాయి. ఎందుకంటే ఆ టెలిస్కోప్‌కు నాసా ‘నాన్సీ గ్రేస్ రోమన్’ పేరు పెట్టింది. ఒకప్పుడు ప్రపంచం ఆమెను తారలకు దూరంగా పెట్టాలని చూస్తే నేడు ఆ పేరు ఏకంగా ఆకాశానికే చేరింది. అంతరిక్ష రంగంలో హబుల్, జేమ్స్ వెబ్ వంటి ప్రసిద్ధ పురుషుల పేర్లే వినిపిస్తుంటే ఆ పురుషాధిక్య కోటను బద్దలు కొడుతూ మారుమోగుతున్న నాన్సీ గ్రేస్ రోమన్ ఎవరు?అమ్మాయిలకు సైన్స్ ఎందుకు? 1925లో అమెరికాలో జన్మించిన నాన్సీకి ఐదేళ్ల వయసులోనే నక్షత్రాలంటే పిచ్చి. హైస్కూల్ చదివే రోజుల్లో ఆమె ‘ఆస్ట్రానమీ క్లబ్’ పెట్టాలని చూస్తే ‘ఇది అమ్మాయిల సబ్జెక్ట్ కాదు, నువ్వు హోమ్ సైన్స్ చదువుకో’ అని టీచర్లు నిరుత్సాహపరిచారు. కాని నాన్సీ వినలేదు. సైన్స్ చదవడం తన కల అని చెప్పింది. కాలేజీలో ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఆమె ఒక్కతే అమ్మాయి. 1949లో చికాగో యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రంలో పిహెచ్.డి. చేస్తున్నప్పుడు విచిత్రమైన వివక్ష ఎదురైంది. ఆడవాళ్లు రాత్రిపూట అబ్జర్వేటరీ (నక్షత్రశాల)లో ఉండకూడదనే నిబంధనతో ఆమెను రానిచ్చేవారు కాదు. నక్షత్రాలను చూడకుండా పరిశోధన చేయాలన్నమాట. దానికీ నాన్సీ వెనకడుగు వేయలేదు. పగలంతా డేటాను విశ్లేషించి, రాత్రిపూట అసిస్టెంట్స్‌తో పరిశీలనలు చేయించేది. అలా ఆమె చేసిన ‘నక్షత్రాల కదలికల పరిశోధన’ (ఉర్సా మేజర్ మూవింగ్ గ్రూప్) ఎంత గొప్పదంటే ఇప్పటికీ ఖగోళ శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ప్రాథమిక పాఠంగా నిలిచింది. నక్షత్రాల వయసును బట్టి వాటి కదలికలు, అవి ఉండే గెలాక్సీ ప్రాంతాలు మారుతాయని నాన్సీ కనిపెట్టిన విషయం ఖగోళ శాస్త్రంలో పెద్ద దార్శనికత అయ్యింది. అయినప్పటికీ ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరితే మగ ప్రొఫెసర్ల జీతంలో 60 శాతం మాత్రమే ఇచ్చేవారు. కారణం? ఆమె స్త్రీ కావడమే!సొంత క్యాబిన్ కూడా లేని చీఫ్!1959లో నాసా ఏర్పడితే, కేవలం ఆరు నెలలకే నాన్సీని పిలిచి ‘చీఫ్ ఆఫ్ ఆస్ట్రానమీ’గా బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆమె ఖ్యాతి అది. దాంతో నాసా చరిత్రలో అత్యున్నత ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టిన మొదటి మహిళగా నిలిచింది. అయినా ఆఫీసులో వివక్ష తప్పలేదు. మొదట్లో ఆమెకు సొంత క్యాబిన్ కూడా ఇవ్వలేదు. మీటింగుల్లో మగవాళ్లు ఆమె మాటను లెక్కచేసేవారు కాదు. అయినా తలవంచకుండా నిలబడింది. ‘టెలిస్కోపులను భూమి మీద కాకుండా ఆకాశంలో పెడితేనే విశ్వం గుట్టు విప్పగలము’ అనే తన ఆలోచనను నిజం చేయడానికి పోరాడింది.మదర్ ఆఫ్ హబుల్భూమి వాతావరణం అంతరిక్షంలోని నక్షత్రాలను చూడటానికి అడ్డు. అందుకే టెలిస్కోపును నేరుగా అంతరిక్షంలోకి పంపాలని నాన్సీ గ్రహించింది. ఒక భారీ అంతరిక్ష టెలిస్కోప్‌ను నిర్మించాలని ఆమె ప్రతిపాదించినప్పుడు.. ‘ఇది చాలా ఖరీదైన వ్యవహారం’ అంటూ అందరూ చేతులెత్తేశారు. అయినా నాన్సీ వెనక్కి తగ్గలేదు. అమెరికన్ పార్లమెంట్ దగ్గరకు స్వయంగా వెళ్లి, ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించి ఒప్పించింది. ఆమె చేసిన అలుపెరగని పోరాటం 1990లో చారిత్రాత్మక ‘హబుల్ స్పేస్ టెలిస్కోప్’ను నింగిలోకి ప్రవేశపెట్టింది. విశ్వం వయసును లెక్కగట్టడంలో, ‘బ్లాక్ హోల్స్’ ఉనికిని ప్రపంచానికి చూపించడంలో హబుల్ సాధించిన విజయాల వెనుక నాన్సీ కృషే ఉంది. అందుకే ఆమెను ‘మదర్ ఆఫ్ హబుల్’ అంటారు. ప్రాజెక్టును కాపాడిన ఆమె పేరు2018లో, 93 ఏళ్ల వయసులో నాన్సీ కన్నుమూసినా ఆమె పేరుకు ఉన్న విలువ అమెరికాలో కొనసాగుతూనే ఉంది. హబుల్ కంటే వందరెట్లు సామర్థ్యం ఉన్న కొత్త అంతరిక్ష టెలిస్కోపు ప్రాజెక్టుకు నాసా సిద్ధమైనప్పుడు బడ్జెట్ కారణాల వల్ల ఐదుసార్లు రద్దు చేయాలని చూశారు. అయితే నాసా సైన్స్ హెడ్ థామస్ జుర్బుచెన్ మాస్టర్ ΄్లాన్ వేసి ఆ ప్రాజెక్టుకు నాన్సీ పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన ప్రాజెక్టును మూలన పడేయడం అప్రదిష్ట కనుక అడ్డంకి తొలిగి పోయింది. 2020లో నాసా ఈ ప్రాజెక్టును ‘నాన్సీ గ్రేస్ రోమ¯Œ స్పేస్ టెలిస్కోప్’ అని ప్రకటించి గౌరవించింది. ఈ భారీ టెలిస్కోప్ ఆగస్టు 30న రాకెట్ సహాయంతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి ప్రస్తుతం ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన నిర్దేశిత కక్ష్య వైపు పయనిస్తోంది. త్వరలో విశ్వాన్ని చూసే కొత్త చూపు మానవజాతికి ఇవ్వనుంది. ఇకపై ఆకాశంలో మెరిసే ప్రతి నక్షత్రం నాన్సీ పేరు వల్ల కూడా మరింత ఉజ్వలంగా వెలగనుంది. -
James Webb Telescope: కొత్త ప్రపంచాలకు కిటికీ
జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్ 2022 జూలై నెలలో అంతరిక్షంలో అంతకుముందు అందని లోతుల చిత్రాలను పంపించింది. అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించారు. చిత్రాలతోబాటే అప్పట్లో ఒక గ్రాఫ్‌ను కూడా ప్రకటించారు. అటువంటి వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం మామూలే. ఆస్ట్రాన మర్లు మాత్రం ఆ వంకర గీతను చూచి అవాక్కయినట్టు తరువాత తెలిసింది. మన గ్రహం మీద కాక మరెక్కడయినా జీవం కొరకు జరుగుతున్న వెదుకు లాటలో ఈ గీత ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఎక్కడో మారుమూలన దాగి ఉన్న వాస్ప్ 96 బి అనే ఒక గ్రహం చుట్టూ వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్టు ఈ గ్రాఫ్ ఆధారంగా అర్థమయింది. అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వల్ల అవుతుంది అని ఎవరూ ఊహించని సమాచారాన్ని అది అందిస్తున్నది అంటున్నారు పరిశోధకులు. సుదూర ప్రాంతాల గ్రహాల చుట్టూ గల వాతావరణాల సంగతులను టెలిస్కోప్ తెలియజేస్తున్నదని అర్థం. కనిపించిన దృశ్యాల అందం కన్నా పరిశోధకులకు ఈ సమాచారం మరింత ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. కనుకనే వారంతా గ్రాఫ్ గురించి మరింత పరిశోధనలకు పూనుకున్నారు. అంతకుముందెన్నడూ లేనంత వివరంగా, అజ్ఞాత ప్రపంచాల వాతావరణ సంగతులు తెలుసుకుంటు న్నారు. అక్కడెక్కడయినా జీవం ఉంటేగింటే, వివరాలు తెలుసుకునే వీలు మాత్రం అందింది అంటున్నారు. అట్లాగని జీవం ఆనుపానులు దొరికినట్టే అనుకునే పద్ధతి సరికాదని మనకు తెలుసు. గతంలో 2022లోనే హబుల్ టెలిస్కోప్ ఆధారంగా ఇటువంటి పరిశీలనలు సాగినాయి. కొత్త టెలిస్కోప్ హబుల్ కన్నా బలం గలది గనుక ఈసారి పరిశీలనలు మరింత బాగా సాగుతాయి. పరిశీలిం చదగిన గ్రహాలను ఇప్పటికే గుర్తించేశారు కూడా. జీవం ఉనికి పరిశోధన మరింత బాగా కొనసాగుతున్నది. ‘గొప్ప ప్రయత్నం మరో సారి బలపడి ముందుకు జరిగే సందర్భం ఇది’ అన్నారు జర్మనీ పరిశోధకురాలు లారా క్రెయిడ్బెర్గ్ ఈ మధ్యన. కొంతకాలంగా సుదూర గ్రహాల వాతావరణంలోని మూలకాలు, రసాయన సమ్మేళనాల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో దుర్భిణీ యంత్రాల పాత్ర అందరికీ అర్థమయింది. ఇక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కారణంగా, మరింత లోతుగా అక్కడి వాతావరణాలలోకి చూడగలుగుతున్నారు. అందుకు ముఖ్యంగా మూడు కారణాలు ఆధారంగా నిలిచి వీలు కలిగిస్తున్నాయి. ఈ టెలిస్కోప్ భూమి నుంచి చాలా దూరంలో ఉంది. గమ్యాలను నిశ్చలంగా, నిశితంగా గమనించి ఎక్కువ లోతైన వివరాలను సేకరించగలుగుతుంది. తక్కువ బలంగల సంకేతాలను గూడా అది గుర్తించ గలుగుతుంది. ఈ టెలిస్కోప్‌లోని అద్దం డయామీటర్ 6.5 మీటర్లు. హబుల్ అద్దం 2.4 మీటర్లు మాత్రమే. అంటే కొత్త టెలిస్కోప్ ఎక్కువ కాంతిని, మరీ చిన్న వివరాలను కూడా చూడగలదు. ఇక ఇన్ఫ్రారెడ్ వర్ణపటం మొత్తాల్ని జేమ్స్ వెబ్ పరిశీలించగలుగుతుంది అన్నది మూడవ అంశం. అంటే గ్రహాల వాతావరణాలలోని రసాయనాల వివరాలు మరింతగా అర్థం అవుతాయి. ఒక నక్షత్రం చుట్టూ, సూర్య గోళం చుట్టూ మన భూగ్రహంలాగే తిరుగుతున్న గ్రహాలను మరింత బాగా పరిశీలించి జీవం ఉనికి నిర్ధారించడం సులభంగా వీలవుతుందని తేలిపోయింది. ఈ గమ్యం కొరకు పరిశీలించ వలసిన మరో రెండు మూడు సుదూర గ్రహాలు ఈ పట్టికలో ఉన్నాయి. ఇవన్నీ తమ తమ నక్షత్రాల చుట్టూ, జీవం ఉండ గల దూరాలలో తిరుగుతున్నాయి. వాటి మీద నీరు ఉండే వీలు ఉందని అర్థం. అయితే అవన్నీ భూమికన్నా చిన్నవి అయితే, వాటి వాతావరణం కూడా తక్కువగా ఉంటుంది. అవి తిరుగుతున్న నక్షత్రాలు కూడా సూర్య గోళానికి సమంగా వేడి గలవి కావు. భూమి నుంచి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్ గ్రహాలు, తమ నక్షత్రాలకు మరీ దగ్గరగా ఉన్నాయి. ఆ నక్షత్రాలు చల్లగా ఉన్నాయి. అంటే సూర్యునితో పోలిస్తే, అంత వేడిగలవి కావు. మనమిప్పుడు ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాము. కానీ భూమి మీద మొదట్లో ఉన్న జీవులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా శక్తిని సిద్ధం చేసుకుని ఆక్సిజన్‌ను, ఇప్పటి మొక్కల్లాగే వదిలిపెట్టేవి. ఆ వాయువును వాడుకుని బతికే జీవులు, ఆ తరువాత వచ్చాయి. మొత్తానికి సుదూర గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ ఉన్నట్టు తెలిస్తే, అక్కడ జీవం ఉన్నదని సూచన అనుకోవచ్చు. జీవులుంటేనే ఈ వాయువులుంటాయి. ‘అనుకోని చోట, జీవం సంకేతాలు కనబడితే, అంతకన్నా ఆశ్చర్యం లేదు’ అంటారు పరిశోధకులు డెమింగ్. నిజానికి ఈ పరిశోధన కొత్త దారులు తొక్కుతున్నది. మరిన్ని రకాల రసాయనాల ఆధారంగా జీవం ఉనికిని గుర్తించవచ్చు. జేమ్స్ వెబ్‌తో ఈ అవకాశం పెరుగుతున్నది. త్వరలోనే ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసే అవకాశం ఉంది. విశ్వంలో మనకు తోడుగా మరె క్కడా జీవులు లేవా? లేరా? అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో! ఓపికగా ఎదురుచూడటం ఒకటే దారి. కె.బి. గోపాలం, వ్యాసకర్త రచయిత, అనువాదకుడు -
నాసా అతిపెద్ద టెలిస్కోప్!
-
నాసా అతిపెద్ద టెలిస్కోప్!
వాషింగ్టన్: అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా రూపొందించింది. హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ను అభివృద్ధి చేసినట్లు పరిశోధ కులు వెల్లడించారు. ఈ అత్యాధునిక టెలిస్కోప్‌ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. 26 ఏళ్లుగా హబుల్ టెలిస్కోప్ సేవలందిస్తోందని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను దాని తర్వాత తరానికి చెందినదిగా నాసా పేర్కొంది. ఇందులో ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో సున్నితమైన కెమెరాలను పొందుపరిచారు. ఈ కెమెరాలకు సూర్య కిరణాలు నేరుగా తగలకుండా ఉండేందుకు రక్షణగా ఐదు లేయర్లను ఏర్పరిచారు. ఇవి మానవుని వెంట్రుకల కంటే పలుచగా ఉంటాయి. ఈ టెలిస్కోప్ విశ్వం తొలినాళ్లలో ఏర్పడిన మొదటి నక్షత్ర మండలాల ఫొటోలను సైతం అందించగలదని నాసాకు చెందిన కెస్కి కుహా చెప్పారు. -
పువ్వు విచ్చుకుంటే...గ్రహం కనిపిస్తుంది!
విచ్చుకున్న పువ్వులాంటి ఈ డిజైన్ ఏమిటో... పక్కనే స్పేస్ శాటిలైట్ ఉండటమేమిటో? ఇవేనా మీ సందేహాలు. కానీ అది శాటిలైట్ కాదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) త్వరలో ప్రయోగించబోతున్న అంతరిక్ష టెలిస్కోపు. సువిశాల విశ్వంలో భూమి లాంటి గ్రహాల్ని వెతకడం దీని లక్ష్యం. మరి... ఆ పువ్వులాంటి నిర్మాణమేమిటి? అక్కడే వస్తున్నాం. ఈ అంతరిక్ష టెలిస్కోపు లక్ష్యసాధనలో దీనిదే కీలకపాత్ర. సూర్యుడి లాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నా... వాటిని చాలా దూరం నుంచి చూడాలంటే సూర్యుడి వెలుగు అడ్డంకిగా మారుతుంది. అదే మీరు సూర్యుడి వెలుగును అడ్డుకునేందుకు ఇలాంటి ఓ నిర్మాణాన్ని అడ్డం పెట్టారనుకోండి. కొంచెంకొంచెం వెలుగులు మాత్రమే చిమ్మే గ్రహాలను కూడా ఎంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. అందుకే నాసా ‘స్టార్‌షేడ్’ పేరుతో వచ్చే ఏడాది ఇలాంటి నిర్మాణాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనుందన్నమాట. బాగా మడతపెట్టేసిన స్టార్షేడ్ను టెలిస్కోపుతోపాటే అంతరిక్షంలోకి పంపిస్తారు. అక్కడ ఇది టెలిస్కోపు నుంచి విడిపోతుంది.. నెమ్మదిగా విచ్చుకుని ఇలా మారుతుంది. దీని సైజు ఎంతుంటుందో తెలుసా? దాదాపు కొన్ని వందల మీటర్ల వెడల్పు!


