breaking news
SP Hinduja
-
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత
SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్‌లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు. ‘దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తాను ఉంటున్న యూకే, స్వదేశమైన భారత్‌ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. సిరిచంద్ పరమానంద్ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్‌లో పెద్దవాడు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
కుబేరులు తగ్గారు.. సంపద పెరిగింది..
♦ మళ్లీ టాప్‌లో ముకేశ్ అంబానీ ♦ సంపద విలువ 26 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: దేశంలోని కుబేరుల సంఖ్య తగ్గింది. చైనా సంస్థ ‘హురుణ్ రిపోర్ట్’ తాజాగా రూపొందించిన అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో 1 బిలియన్ డాలర్లు/అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గింది. ♦ కుబేరుల సంఖ్య తగ్గినా కూడా వీరి మొత్తం సంపద మాత్రం 16 శాతంమేర ఎగసింది. ♦ అంబానీ తర్వాత 14 బిలియన్ డాలర్ల సంపదతో ఎస్పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు. ♦ సన్‌ఫార్మా ప్రమోటరు దిలీప్ సంఘ్వీ కూడా 14 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. ♦ 12 బిలియన్ డాలర్ల సంపదతో పల్లోంజీ మిస్త్రీ, లక్ష్మీ మిట్టల్, శివ్ నాడార్ వరుసగా నాల్గవ, ఐదవ, ఆరవ స్థానాల్లో ఉన్నారు. ♦ సైరస్ పూనావాలా (11 బిలియన్ డాలర్లు) ఏడో స్థానంలో, అజీమ్ ప్రేమ్‌జీ (9.7 బిలియన్ డాలర్లు) 8వ స్థానంలో, ఉదయ్ కొటక్ (7.2 బిలియన్ డాలర్లు) 9వ స్థానంలో నిలిచారు. ♦ ఇక డేవిడ్ రూబెన్, సైమన్ రూబెన్ (6.7 బిలియన్ డాలర్లు) పదవ స్థానంలో ఉన్నారు. ♦ ముంబై కుబేరులకు పుట్టినిల్లు. ఇక్కడ 42 మంది బిలియనీర్లు ఉన్నారు. తర్వాత ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌లో 9 మంది బిలియనీర్లు ఉన్నారు. ♦ రాష్ట్రాల వారీగా చూస్తే బిలియనీర్ల సంఖ్య మçహా రాష్ట్రలో 51గా, ఢిల్లీలో 22గా, గుజరాత్లో 10గా, కర్ణాటకలో 9గా ఉంది. ♦ స్వశక్తితో బిలియనీర్‌గా ఎదిగిన ఒకే ఒక మహిళగా కిరణ్ మజుందార్ షా నిలిచారు.