breaking news
South Bay auction company
-
ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా?!
హాంకాంగ్: నీలివర్ణంలో ధగధగలాడిపోతున్న ఈ వజ్రం బరువు 10.10 క్యారెట్లు. వందశాతం స్వచ్ఛమైన దీనిని వచ్చే నెల ఐదోతేదీన హాంకాంగ్లో సోత్బే వేలం సంస్థ వేలంవేయనుంది. దక్షిణాఫ్రికా కులినన్ గనిలో లభించింది. వేలంపాటలో ఇది రూ.234కోట్లు పలకవచ్చని నిర్వాహకులు అంచనావేస్తున్నారు. -
వజ్రం@ 201 కోట్లు!
నీలి రంగులో ధగధగలాడుతున్న ఈ వజ్రం బరువు దాదాపు 10క్యారెట్లు. అంటే దాదాపు రెండు గ్రాములు. ఇంత తక్కువ బరువున్న వజ్రం ధర మాత్రం చాలా ఎక్కువ. అక్షరాలా రూ.201 కోట్లు. గురువారం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత సోత్బే వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో ఇంతటి భారీ మొత్తానికి వజ్రం అమ్ముడుపోయింది. 100శాతం స్వచ్ఛమైన నీలిరంగు వజ్రం ఈ స్థాయి ధర పలకడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక్కో క్యారెట్ బరువుకు ధరను లెక్కించినా కూడా వజ్రం మరో ప్రపంచ రికార్డును సృష్టించిందని నిర్వాహకులు వెల్లడించారు. హాంకాంగ్కు చెందిన ఓ వ్యక్తి దీనిని కొనుగోలుచేశాడు.