breaking news
South African swimmer
-
200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో కొత్త ప్రపంచ రికార్డు
టోక్యో: ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో దక్షిణాఫ్రికా స్విమ్మర్ తాత్యానా షున్మేకర్ ఈ ఘనత సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును 24 ఏళ్ల తాత్యానా 2ని:18.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2ని:19.11 సెకన్లతో 2013లో రికీ మోలెర్ పెడర్సన్ (డెన్మార్క్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తాత్యానా బద్దలు కొట్టింది. -
ఈతకొలనులో బంగారు చేప
అంగవైకల్యాన్ని జయించిన నటాలీ నూడుల్ అని ముద్దుగా పిలుచుకునే 30 ఏళ్ల దక్షిణాఫ్రికా స్విమ్మర్ నటాలీ డూ టాయ్ట్ ఈతకొలనులో బంగారు చేప. అంతర్జాతీయంగా 21 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించింది. అయితే ఈమె అంగవైకల్యాన్ని జయించి మరీ ఈ పతకాలు సాధించడం విశేషం. 14 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో ఎడమ కాలిని కోల్పోయినా తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంతర్జాతీయ స్విమ్మర్‌గా రాణించాలన్న కసితో స్విమ్మింగ్‌లో సాధన చేసింది. ఫలితంగా 2002 కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. 2002, 06, 10 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం ఏడు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. పారా ఒలింపిక్స్లోనైతే నటాలీకి తిరుగే లేదు. 2004లో ఏథెన్స్లో 5.. 2008లో బీజింగ్‌లో 5.. 2012లో లండన్‌లో 3 బంగారు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. అంతేకాదు.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు పారా ఒలింపియన్లలో నటాలీ ఒకరు. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టయిల్, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో రాణించగల సత్తా ఆమె సొంతం. చిన్ననాటి నుంచే... దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జన్మించిన నటాలీకి చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండటంతో అనతికాలంలోనే ఈతకొలనులో బంగారు చేపలా తయారైంది. 14 ఏళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నటాలీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి స్కూలుకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. స్కూటర్‌పై వెళ్తున్న నటాలీని వెనక నుంచి వచ్చిన కారు గట్టిగా ఢీకొట్టింది. 2001లో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆమె ఎడమకాలిని దాదాపుగా మోకాలి వరకు తీసేశారు. అయితే కాలు పోయిందన్న బాధను దిగమింగి.. తన స్విమ్మింగ్ భవిష్యత్తుపై దృష్టిపెట్టింది. 2002 కామన్వెల్త్ గేమ్సే లక్ష్యంగా సాధన చేసింది. మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్గేమ్స్తో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న నటాలీ ఇక వెనుదిరిగి చూడలేదు.