breaking news
Social service programmes
-
సేవా కార్యక్రమాలతో పెద్ద మనసు చాటుకున్న నేతలు
సాక్షి, వైఎస్సార్/నెల్లూరు/చిత్తూరు: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వద్ద రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో ఎంతో మంది పేద ప్రజల ఆకలి బాధలు తీరతాయని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల్లో ఒకటైన రాజన్న క్యాంటీన్‌ను రైల్వేకోడూరులో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీధర్‌రెడ్డి పిలుపునివ్వగా.. 4 లక్షల 70 వేల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈ డబ్బును శ్రీధర్‌రెడ్డి ఆపరేషన్ నిమిత్తం బాధితుడికి అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజా నూతన సంవత్సరం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అప్పలాయ గుంటలో ఆమె వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రతి మంగళవారం నాలుగు రూపాయలకే భోజనం అందించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగిరిలో కేక్ కట్ చేసిన రోజా కొత్త పేటలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు అందించాలని నిర్ణయించారు. -
ఆత్మీయ స్పర్శ
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పదమూడవ కథనమిది... మనిషి చివరి ఘడియల్లో మనసును మరపించే ఆదరణ కావాలి. ఆత్మీయుల పలకరింపులు అంతిమ క్షణాల్లో కొండంత ఆనందాన్నిస్తాయి. నా అన్న వారి మధ్య తుదిశ్వాస విడిచే భాగ్యం కలిగినందుకు ఆ జీవి ప్రశాంతంగా మృత్యు కౌగిలిలో ఒదిగిపోతాడు. అనుబంధాలను కోరుకునే చివరి మజిలీలో మేం ఉన్నాం అంటోంది ‘స్పర్శ్’. ఆసరా లేకుండా గడవని అవసాన దశను ఆనందంగా దాటేలా చూస్తోంది. క్యాన్సర్ వంటి జబ్బులతో పోరాడుతూ మృత్యుముఖంలో ఉన్న వారికి ఆత్మీయ స్పర్శనందిస్తూ.. వారి కుటుంబానికీ సాంత్వన కలిగించడానికి ముందుకొచ్చిన ‘స్పర్శ్’ గురించి వివరంగా.. క్యాన్సర్.. మనిషి ఒంటిని, ఇంటిని గుల్ల చేసే భయంకరమైన జబ్బు. క్యాన్సర్ కణాలతో పోరాడుతూ కృష్ణపక్ష చంద్రునిలా కరిగిపోతూ.. మృత్యువుకు చేరువవుతుంటాడు. ఇక లాభం లేదని డాక్టర్లు చెప్పగానే.. కన్నీరు కార్చడం తప్ప ఏం చేయలేని పరిస్థితి కుటుంబ సభ్యులది. అలాంటి సమయంలో చివరి ఘడియ వరకూ ఆస్పత్రుల్లో ఉంచి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత అందరికీ ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బున్నా పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్లే చెబుతారు. అలాంటి సమయంలో రోగికి అందించాల్సిన సేవలు చాలా కష్టంగా ఉంటాయి. కానీ స్పర్శ్‌లో ఉంటున్న పేషెంట్లను చూస్తే అలా అనిపించదు. చాలా హాయిగా వారి జీవితాన్ని ముగించే వాతావరణం అక్కడ ఉంటుంది. స్పర్శ్ సన్నిధికి.. మూడేళ్లలో 470 మంది క్యాన్సర్ పేషెంట్లు స్పర్శ్ సన్నిధిలో సేదతీరారు. ఈ ఒక్క ఏడాదే 185 మంది స్పర్శ్ తలుపు తట్టారు. వీరిలో ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు కూడా కొందరున్నారు. ‘చాలా వరకూ క్యాన్సర్ పేషెంట్లపైనే దృష్టి పెడుతున్నాం. కొందరు చివరి ఘడియల్లో ఇక్కడికి వస్తే.. ఇక్కడకు వచ్చాక ఏళ్లు బతికిన వారు కూడా కొందరున్నారు. ఎంతటి బాధలో వచ్చినా చివరి ఘడియ వరకూ వారికి కావాల్సిన ఆత్మీయ స్పర్శ వారికి దగ్గరగా ఉండేట్టు చూడటం మా బాధ్యత’ అని చెప్పారు స్పర్శ్ వైద్యులు సుసిల్రెడ్డి. బాగుగా బాగోగులు.. స్పర్శ్ హాస్పీస్లో మొత్తం 12 బెడ్లున్నాయి. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లున్నారు. అందరూ క్యాన్సర్‌తో పోరాడుతున్నవారే. వీరికి నొప్పి, బాధ తెలియకుండా నార్కొటిక్స్ సహా రకరకాల మందులతో ఉపశమన చికిత్స అందిస్తారు. అవసరమైన వైద్య సేవలన్నీ అందిస్తారు. క్యాన్సర్ పేషెంట్లను ఎక్కువగా వేధించే పుండ్లు, రక్తస్రావం వంటి వాటికి డ్రెస్సింగ్ చేస్తారు. వారిని శుభ్రంగా ఉంచుతూ.. నర్సింగ్ సపర్యలన్నీ అందిస్తారు. రోగితో పాటు వారి బంధువులెవరైనా ఒకరు అక్కడే ఉండాలి. లేకపోతే నర్సులు, ఆయాలు దగ్గరుండి మరి వారి బాగోగులు చూసుకుంటారు. రోగికి అన్ని రకాల సేవలతో పాటు వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తారు. సినిమాలు చూపించడం, పుస్తకాలు చదివించడం.. నాలుగు మాటలు చెప్పి వారి బాధను దూరం చేస్తారు. ఇక ఇక్కడున్నవారందరికీ తాము బతికేది ఇంకొన్ని రోజులేనని తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణభీతి లేకుండా వారి మనసులోని ఆందోళనలు చెప్పుకునే అవకాశం కల్పించడం మరో గొప్పసేవ. హాయిగా.... స్పర్శ్‌కి వచ్చే రోగులు కేవలం హైదరాబాద్‌కి చెందినవారే కాకుండా నల్లగొండ, మచిలీపట్నం, వరంగల్ వంటి జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఉండడం విశేషం. ఒకరిద్దరూ పూర్తిగా అనాథలు. వారి వైద్యం, మరణించిన తర్వాత ఖర్చులు పూర్తిగా స్పర్శ్ సంస్థే భరించింది. ‘ఎక్కడివారు, ఎలాంటివారు, ఎవరు అనే ప్రశ్నలకు మా దగ్గర తావుండదు. వచ్చినవారికి ఎలాంటి సేవలందించాలి? వారి చివరి ఘడియలు ఎంత ప్రశాంతంగా ఉండాలన్నదే ముఖ్యం. అందుకే అందరికీ పుట్టినరోజులు చేయడం, పండుగలు సెలబ్రేట్ చేయడం వంటివి కూడా చేస్తుంటాం. ఈ మద్యనే ఒక రోగి హీరో అల్లు అర్జున్‌ని చూడాలని ఉందని చెబితే వెంటనే అతన్ని తీసుకొచ్చాం. ఆయన ఆ రోగితో ఒక గంట గడిపి వెళ్లారు. ఇలా మా పరిధిలో ఎంతవరకూ చేయగలమో అన్నీ చేస్తున్నాం. అయితే ఇంకా బెడ్స్ని పెంచాలనుకుంటున్నాం’ అని ముగించారు సుసిల్రెడ్డి. స్పర్శ్ సేవలు మరింత విస్తారించాలని మనమూ కోరుకుందాం. సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించిన సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజ హితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఇంకా మిమ్మల్ని అభినందించడానికి మరెందరో సెలబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెయిల్ టు.. sakshicityplus@ gmail.com ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com