breaking news
smart robbery
-
ఇదో ‘స్మార్ట్’ దోపిడీ
ఎంపీ దత్తత గ్రామానికి దిక్కు లేదు తమ్ముడి గ్రామంలో కోట్ల కుమ్మరింపు కమీషన్ల కక్కుర్తితో నేతల సిఫార్సు లేఖలు అవసరం లేకపోయినా అద్దంలా రహదారులు అద్దంలా...అనగనగా అంబాజీపేట... దానికి కూతవేటు దూరంలో ఉన్న పల్లె. గంగలకుర్రు. అక్కడి జనాభా 5 వేలులోపే. అక్కడ అభివృద్ధి పనులకు ఎంత మంజూరు చేశారో తెలుసా... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్లు. కేటాయింపులూ ఇంపుగానే సాగి పోయాయి. నిజంగా ఆ గ్రామానికి అంత మొత్తం అవసరమైతే ఓకే. కానీ అక్కడో తెలుగు తమ్ముడి పబ్బం కోసం ఈ కోట్లు వెచ్చించారు. ఆ నేత పంట పొలాలు, ఇంటి చుట్టూ ఎంచక్కా రింగ్ రోడ్డు మాదిరిగా కరెన్సీని పరిచేశారు. అధ్వానంగా... ఇదే మండలంలో ఆదర్శ గ్రామంగా ఎంపికైన పుల్లేటికుర్రు గ్రామాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఇక్కడ అభివృద్ధి జాడే లేదు. ఇక్కడే కాదు ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తారని ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నా నేతలు పట్టించుకున్న పుణ్యాన పోలేదు. ఈ రోడ్లపై తరచూ ప్రయాణించే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కోనసీమ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొబ్బరి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అంబాజీపేట... ఆ పేటకు కూతవేటు దూరంలో ఉందొక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు గంగలకుర్రు. ఆ గ్రామ జనాభా ఐదువేలులోపే. ఒకసారి ఆ గ్రామంలో అడుగుపెడితే స్మార్ట్ విలేజ్‌ను మించిపోయి అద్దంలా దర్శనమిస్తోంది. ఆ చిన్న పల్లెటూర్లో సువిశాలమైన రహదారులు జాతీయ, రాష్ట్ర రాహదారులతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తాయి. ఇదంతా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలోని గంగలకుర్రు అనే గ్రామంలో పరిస్థితి. ఈ మండలంలో సంసద్ ఆదర్శ గ్రామంగా ఎంపికైన పుల్లేటికుర్రు గ్రామాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు దత్తత తీసుకున్నారు. కానీ ఎంపీ దత్తత గ్రామాన్ని మించిన అభివృద్ధి గంగలకుర్రు గ్రామంలో కనిపిస్తోంది. వెడలై్పన రహదారులు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్తు తదితర సౌకర్యాలన్నీ ఆ గ్రామంలో దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఎవరికైనా ఈర‡్ష్య కలగకుండా ఉండదు. ఎందుకంటే ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న అనేక గ్రామాల్లో కనీసం కాలినడకకు కూడా అక్కరకురాని ఎన్నో రహదారులు ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చుట్టుపక్కల అభివృద్ధిని విస్మరించి గంగలకుర్రులోనే కోట్లు కుమ్మరించడం వెనుక అవినీతి తొంగిచూస్తోందన్న విమర్శలున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే... ‘వడ్డించేవాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా మెక్కేందుకు దక్కుతుంద’న్న సామెతను ఆ గ్రామంలో నిజం చేశాడో తెలు గు తమ్ముడు. రాష్ట్రంలో కొందరు అమాత్యులు, జిల్లాలో పని చేసి వెళ్లిన సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఉన్న అనుబం« దంతో అల్లా ఉద్దీ¯ŒS అద్భుత దీపంలా తలచిందే తడవుగా నిధులు తెచ్చి రోడ్ల పాల్జేశారు. ఇందుకు తగ్గట్టు తమ్ముడు అడగడమే పాపం అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి నిధుల కోసం సిఫార్సు లేఖలు రెండు చేతులతో ఎడాపెడా సంతకాలు చేసేసి తమ్ముడు చేతిలో పెట్టేశారు. పర్సంటేజీలతోనే ఆ సిఫార్సు లేఖలు తమ్ముడికి దక్కాయంటున్నారు. ఆ సంతకాలతో ఉన్నత స్థాయిలో ఉన్న పలుకుబడిని ఉపయోగిం చి ఆ ఒక్క గ్రామానికి కోట్లు కుమ్మరించేశారు. ఏడాది కాలంగా ఆ గ్రామం, గ్రామం పొలిమేరల్లో సుమారు రూ.20 కోట్లు అంచనా వ్యయంతో పలు పనులు చేపడుతున్నారు. రోడ్డు డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) నుంచి 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల్లో నిధులు విడుదలయ్యాయి. ఇన్ని కోట్ల పనులు చేపట్టాలంటే ఐదు లక్షలు దాటి చేపట్టే పనులకు టెండర్లు పిలవాలనే నిబంధనలున్నా యి. తస్మదీయులకు పనులు కట్టబెట్టాలంటే టెం డర్లు పిలవకూడదు. అలా చేయాలంటే ఏమి చేయా లా అని ఆలోచించి చివరకు ఒక్కో పనిని రూ.5 లక్షలుగా విభజించారు. విభజించిన పనులను రావులపాలేనికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ఊరకనే ఎందుకు చేస్తారు...? ఈ నిధులకు ఆ నేతలు ఊరకనే సిఫార్సు చేశారనుకుంటే పొరపాటుపడ్డట్టే. ఎవరి తాంబూలం వారికి సమర్పించుకోవడంతోనే తమ్ముడి పని సులువైందంటున్నారు. అందుకే తమ్ముడు చెప్పిన చోటల్లా నిధులు వరద పారించేశారు. గ్రామంలో ప్రధాన రహదారి, మరికొన్ని అంతర్గత రహదారులను నూరుశాతం బీటీ, సీసీ రోడ్లు, కోనసీమలో ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ విద్యుత్తు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టారు. తింటే తిన్నాడు గానీ పనులు మాత్రం జరిగాయని గ్రామస్తులు మురిసిపోతున్నా ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు తరచి చూస్తే అభివృద్ధి ముసుగులో ప్రజాధనం వృధా అయిన వైనం స్పష్టమవుతోంది. ఆ తమ్ముడు పనిలో పనిగా హైదరాబాద్ రింగ్ రోడ్డును తలదన్నేలా తన పంట పొలాల చుట్టూ ఒక సువిశాలమైన రింగు రోడ్డును కూడా వేయించుకున్నాడు. గంగలకుర్రులో అప్పటి వరకు మట్టిరోడ్డుగా ఉన్న అప్పరకౌశిక గట్టు రోడ్డు సుమారు కిలో మీటరున్నరమేర హఠాత్తుగా బీటీ రోడ్డుగా మర్చేశారు. కారణం ఆ రోడ్డు పొడవునా ఆ తమ్ముడి పంట పొలాలు, పశువుల మకాంలు ఉండటమే. స్మార్ట్ విలేజ్ పేరు చెప్పి గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి సంతోషించాలో ... అవసరం లేకున్నా పొలాల చుట్టూ 22 అడుగుల వెడల్పుతో వేసిన రోడ్లు చూసి ఏమనాలో అర్థం కావడం లేదంటున్నారు ఆ గ్రామస్తులు. అక్కడ అలా,..ఇక్కడ ఇలా... ఇదే నియోజకవర్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే అత్యంత ప్రధానమైన రెం డు ప్రధాన రహదారుల అభివృద్ధిని నేతలు పట్టించుకోవడం లేదు. పి గన్నవరం– గంటి వరకు పంట కాలువ వెంట అత్యంత ప్రమాదకరంగా అ«ధ్వానంగా ఉండే ఈ రోడ్డు కాలువ కోతకు గురవుతూ అనేక ప్రమాదాల్లో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. దాదాపు ఇదే పరిస్థితుల్లో ఈదరపల్లి–ముక్కామల పంటకాలువ పై ఏడు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రెండు రహదారులు రాజమహేంద్రవరానికి వెళ్లే కోనసీమ వాసులకు దూరాభారం తగ్గించే బైపాస్ రోడ్లుగా ఉపయోగపడుతున్నాయి. ్రఈ రెండు రోడ్లపై తరచూ ప్రయాణించే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కోనసీమ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఇటువంటి రోడ్లు గాలికొదిలేసి ఒకే ఒక్క గ్రామానికి అన్ని కోట్లు గుమ్మరించడం, వాటిలో సొంత పొలాల చుట్టూ రోడ్లు వేయించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదో ‘స్మార్ట్’ దోపిడీ ఎంపీ దత్తత గ్రామానికి దిక్కు లేదు తమ్ముడి గ్రామంలో కోట్ల కుమ్మరింపు కమీషన్ల కక్కుర్తితో నేతల సిఫార్సు లేఖలు అవసరం లేకపోయినా అద్దంలా రహదారులు అద్దంలా...అనగనగా అంబాజీపేట... దానికి కూతవేటు దూరంలో ఉన్న పల్లె. గంగలకుర్రు. అక్కడి జనాభా 5 వేలులోపే. అక్కడ అభివృద్ధి పనులకు ఎంత మంజూరు చేశారో తెలుసా... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్లు. కేటాయింపులూ ఇంపుగానే సాగి పోయాయి. నిజంగా ఆ గ్రామానికి అంత మొత్తం అవసరమైతే ఓకే. కానీ అక్కడో తెలుగు తమ్ముడి పబ్బం కోసం ఈ కోట్లు వెచ్చించారు. ఆ నేత పంట పొలాలు, ఇంటి చుట్టూ ఎంచక్కా రింగ్ రోడ్డు మాదిరిగా కరెన్సీని పరిచేశారు. అధ్వానంగా... ఇదే మండలంలో ఆదర్శ గ్రామంగా ఎంపికైన పుల్లేటికుర్రు గ్రామాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఇక్కడ అభివృద్ధి జాడే లేదు. ఇక్కడే కాదు ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తారని ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నా నేతలు పట్టించుకున్న పుణ్యాన పోలేదు. ఈ రోడ్లపై తరచూ ప్రయాణించే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కోనసీమ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొబ్బరి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అంబాజీపేట... ఆ పేటకు కూతవేటు దూరంలో ఉందొక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు గంగలకుర్రు. ఆ గ్రామ జనాభా ఐదువేలులోపే. ఒకసారి ఆ గ్రామంలో అడుగుపెడితే స్మార్ట్ విలేజ్‌ను మించిపోయి అద్దంలా దర్శనమిస్తోంది. ఆ చిన్న పల్లెటూర్లో సువిశాలమైన రహదారులు జాతీయ, రాష్ట్ర రాహదారులతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తాయి. ఇదంతా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలోని గంగలకుర్రు అనే గ్రామంలో పరిస్థితి. ఈ మండలంలో సంసద్ ఆదర్శ గ్రామంగా ఎంపికైన పుల్లేటికుర్రు గ్రామాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు దత్తత తీసుకున్నారు. కానీ ఎంపీ దత్తత గ్రామాన్ని మించిన అభివృద్ధి గంగలకుర్రు గ్రామంలో కనిపిస్తోంది. వెడలై్పన రహదారులు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్తు తదితర సౌకర్యాలన్నీ ఆ గ్రామంలో దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ఎవరికైనా ఈర‡్ష్య కలగకుండా ఉండదు. ఎందుకంటే ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న అనేక గ్రామాల్లో కనీసం కాలినడకకు కూడా అక్కరకురాని ఎన్నో రహదారులు ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చుట్టుపక్కల అభివృద్ధిని విస్మరించి గంగలకుర్రులోనే కోట్లు కుమ్మరించడం వెనుక అవినీతి తొంగిచూస్తోందన్న విమర్శలున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే... ‘వడ్డించేవాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా మెక్కేందుకు దక్కుతుంద’న్న సామెతను ఆ గ్రామంలో నిజం చేశాడో తెలు గు తమ్ముడు. రాష్ట్రంలో కొందరు అమాత్యులు, జిల్లాలో పని చేసి వెళ్లిన సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఉన్న అనుబం« దంతో అల్లా ఉద్దీ¯ŒS అద్భుత దీపంలా తలచిందే తడవుగా నిధులు తెచ్చి రోడ్ల పాల్జేశారు. ఇందుకు తగ్గట్టు తమ్ముడు అడగడమే పాపం అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి నిధుల కోసం సిఫార్సు లేఖలు రెండు చేతులతో ఎడాపెడా సంతకాలు చేసేసి తమ్ముడు చేతిలో పెట్టేశారు. పర్సంటేజీలతోనే ఆ సిఫార్సు లేఖలు తమ్ముడికి దక్కాయంటున్నారు. ఆ సంతకాలతో ఉన్నత స్థాయిలో ఉన్న పలుకుబడిని ఉపయోగిం చి ఆ ఒక్క గ్రామానికి కోట్లు కుమ్మరించేశారు. ఏడాది కాలంగా ఆ గ్రామం, గ్రామం పొలిమేరల్లో సుమారు రూ.20 కోట్లు అంచనా వ్యయంతో పలు పనులు చేపడుతున్నారు. రోడ్డు డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) నుంచి 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాల్లో నిధులు విడుదలయ్యాయి. ఇన్ని కోట్ల పనులు చేపట్టాలంటే ఐదు లక్షలు దాటి చేపట్టే పనులకు టెండర్లు పిలవాలనే నిబంధనలున్నా యి. తస్మదీయులకు పనులు కట్టబెట్టాలంటే టెం డర్లు పిలవకూడదు. అలా చేయాలంటే ఏమి చేయా లా అని ఆలోచించి చివరకు ఒక్కో పనిని రూ.5 లక్షలుగా విభజించారు. విభజించిన పనులను రావులపాలేనికి చెందిన ఒక బడా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ఊరకనే ఎందుకు చేస్తారు...? ఈ నిధులకు ఆ నేతలు ఊరకనే సిఫార్సు చేశారనుకుంటే పొరపాటుపడ్డట్టే. ఎవరి తాంబూలం వారికి సమర్పించుకోవడంతోనే తమ్ముడి పని సులువైందంటున్నారు. అందుకే తమ్ముడు చెప్పిన చోటల్లా నిధులు వరద పారించేశారు. గ్రామంలో ప్రధాన రహదారి, మరికొన్ని అంతర్గత రహదారులను నూరుశాతం బీటీ, సీసీ రోడ్లు, కోనసీమలో ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ విద్యుత్తు, డ్రైనేజీ వంటి పనులు చేపట్టారు. తింటే తిన్నాడు గానీ పనులు మాత్రం జరిగాయని గ్రామస్తులు మురిసిపోతున్నా ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు తరచి చూస్తే అభివృద్ధి ముసుగులో ప్రజాధనం వృధా అయిన వైనం స్పష్టమవుతోంది. ఆ తమ్ముడు పనిలో పనిగా హైదరాబాద్ రింగ్ రోడ్డును తలదన్నేలా తన పంట పొలాల చుట్టూ ఒక సువిశాలమైన రింగు రోడ్డును కూడా వేయించుకున్నాడు. గంగలకుర్రులో అప్పటి వరకు మట్టిరోడ్డుగా ఉన్న అప్పరకౌశిక గట్టు రోడ్డు సుమారు కిలో మీటరున్నరమేర హఠాత్తుగా బీటీ రోడ్డుగా మర్చేశారు. కారణం ఆ రోడ్డు పొడవునా ఆ తమ్ముడి పంట పొలాలు, పశువుల మకాంలు ఉండటమే. స్మార్ట్ విలేజ్ పేరు చెప్పి గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి సంతోషించాలో ... అవసరం లేకున్నా పొలాల చుట్టూ 22 అడుగుల వెడల్పుతో వేసిన రోడ్లు చూసి ఏమనాలో అర్థం కావడం లేదంటున్నారు ఆ గ్రామస్తులు. అక్కడ అలా,..ఇక్కడ ఇలా... ఇదే నియోజకవర్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణించే అత్యంత ప్రధానమైన రెం డు ప్రధాన రహదారుల అభివృద్ధిని నేతలు పట్టించుకోవడం లేదు. పి గన్నవరం– గంటి వరకు పంట కాలువ వెంట అత్యంత ప్రమాదకరంగా అ«ధ్వానంగా ఉండే ఈ రోడ్డు కాలువ కోతకు గురవుతూ అనేక ప్రమాదాల్లో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. దాదాపు ఇదే పరిస్థితుల్లో ఈదరపల్లి–ముక్కామల పంటకాలువ పై ఏడు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రెండు రహదారులు రాజమహేంద్రవరానికి వెళ్లే కోనసీమ వాసులకు దూరాభారం తగ్గించే బైపాస్ రోడ్లుగా ఉపయోగపడుతున్నాయి. ్రఈ రెండు రోడ్లపై తరచూ ప్రయాణించే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కోనసీమ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఇటువంటి రోడ్లు గాలికొదిలేసి ఒకే ఒక్క గ్రామానికి అన్ని కోట్లు గుమ్మరించడం, వాటిలో సొంత పొలాల చుట్టూ రోడ్లు వేయించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అభివృది్ధకి ఆమడ దూరం సంసద్ ఆదర్శ గ్రామం’ పుల్లేటికుర్రు నుంచి ముక్కామల వెళ్ళే రహదారి అధ్వానంగా ఉంది. గ్రామంలో ప్రజలకు, రైతులకు అవసరమైన పీహెచ్సీ సబ్ సెంటర్, పశువైద్య శాలలు శిథిలమైపోయాయి. వాటి నిర్మాణం కోసం నేటికీ పట్టించుకోలేదు. సంసద్ ఆదర్శ గ్రామంగా ఎన్నికైన తరువాత తూతూ మంత్రంగా పనులు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పించలేదు. – అందె వెంకట ముక్తేశ్వరరావు, మాజీ సర్పంచ్ -
స్మార్ట్‌గా దోపిడీ
ఓటరు కార్డుల పంపిణీలో చేతివాటం రూ.20 నుంచి రూ.50 వసూలు మీ సేవ కేంద్రాల్లోనూ ఇదే తంతు అమలుకు నోచుకోని ఎన్నికల సంఘం హామీ పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు యథేచ్ఛగా వసూళ్ల పర్వం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన ఓటరు స్మార్ట్‌కార్డుల పంపిణీలో పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.పది విలువ జేసే కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి ఓటరుకు బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ఉండేలా పూర్తిస్థాయి వివరాలు, చిరునామాలతో స్మార్ట్‌కార్డుల పంపిణీకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటు కోసం ఇటీవల ఆరు వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న 13 వేల మందికి ఎన్నికల సంఘం స్మార్ట్‌కార్డులను జారీ చేసింది. వీటిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గంలో 213 మంది బూత్ లెవల్ సిబ్బందిని నియమించింది. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు వేలకు పైచిలుకు స్మార్ట్‌కార్డులు జారీ అయ్యూరుు. 225 మంది బూత్ లెవల్ సిబ్బంది స్మార్ట్‌కార్డుల పంపిణీ చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఓటర్లకు ఉచితంగా అందచేయాల్సిన స్మార్ట్‌కార్డులకు ధర నిర్ణయించి ఓటర్లను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు తీసుకుని పంపిణీ చేస్తున్నారు. వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తుండడంతో అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. ఉచితంగా ఇవ్వాల్సిన కార్డులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా అడిగితే... ‘మీ ఇష్టం... ఎండలో తిరుగుతున్నాం... ఎంతో కొంత ఇవ్వాల్సిందే...’ అని దబాయిస్తుండడం గమనార్హం. మీ సేవ కేంద్రాల్లోనూ వసూళ్లు ఎన్నికల సంఘం ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన స్మార్ట్‌కార్డులను ఎక్కువగా మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. బూత్ లెవల్ సిబ్బంది సకాలంలో ఓటరు స్మార్ట్‌కార్డులను పంపిణీ చేయకపోవడం... ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కార్డుల కోసం ఓటర్లు మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా... మీ సేవ కేంద్రాల నిర్వహకులు ఓటర్ల నుంచి అధికసొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.50 నుంచి రూ.100 వరకు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి... ఉచితంగా స్మార్ట్‌కార్డుల జారీ చేస్తామన్న ఎన్నికల సంఘం హామీ అమలుకు కృషి చేయూలని ఓటర్లు కోరుతున్నారు.