breaking news
smaller towns
-
స్మార్ట్‌ఫోన్.. ఆఫ్‌లైన్ రూట్!
ఇప్పటివరకు ఆన్లైన్ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు క్రమంగా ఆఫ్‌లైన్ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్‌లైన్ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఆన్లైన్ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్‌లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్‌లో షిప్మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్‌లైన్ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్‌లైన్‌కి షిప్మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. మోటరోలా షిప్మెంట్లు 64 శాతానికి డౌన్.. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్లైన్ షిప్మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్‌ప్లస్ విషయానికొస్తే ఇదే వ్యవధిలో షిప్మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్ ఫ్లాష్ సేల్స్‌తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఆమ్నిచానల్ వ్యూహం.. ప్రాథమికంగా ఆన్లైన్ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్‌లైన్ స్టోర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్‌లైన్ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్లైన్లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వివరించాయి. -
మ్యాక్ కంప్యూటర్లతో మార్కెట్ ను దోచేస్తాం
కోల్ కత్తా : భారత్ లో కేవలం ఐఫోన్ అమ్మకాలను మాత్రమే కాదు.. మ్యాక్ కంప్యూటర్లపై కూడా టెక్ దిగ్గజం యాపిల్ దృష్టి సారిస్తోంది. చిన్న చిన్న పట్టణాలకు మ్యాక్ కంప్యూటర్లను తీసుకెళ్తూ.. మ్యాక్ కంప్యూటర్ అమ్మకాల పంపిణీని పెంచుకుని భారత మార్కెట్ ను దోచేయాలని చూస్తోంది. ఇతర కంపెనీల ఎలక్ట్రానిక్ స్టోర్ల ద్వారా మ్యాక్ కంప్యూటర్లను వినియోగదారులకు చేరువలో ఉంచాలని భావిస్తోంది. మ్యాక్ కంప్యూటర్లకు టాప్-10 మార్కెట్ గా ఉన్న భారత్ లో, పర్సనల్ కంప్యూటర్ల పెట్టుబడులు పెంచాలని ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజం ప్లాన్ చేస్తుందని యాపిల్ కు సంబంధించిన ఇద్దరు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 75 సిటీలుగా ఉన్న మ్యాక్ కంప్యూటర్ల పంపిణీ అందుబాటును, వచ్చే రెండు, మూడేళ్లలో రెండింతలు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న కంప్యూటర్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ స్టోర్ల ద్వారా యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల పంపిణీని పెంచుకోనుందని చెప్పారు. ఇప్పడివరకూ మ్యాక్ కంప్యూటర్లు కేవలం యాపిల్ స్టోర్లలోనూ, ఆన్ లైన్ లోనూ, అతిపెద్ద రిటైల్ చైన్స్ క్రోమా, రిలయెన్స్ డిజిటల్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. యాపిల్ కలిగి ఉన్న కన్సూమర్ పీసీ విభాగ 8-9శాతం మార్కెట్ల షేరులో భారత్ కూడా ఒకటి. మ్యాక్ వ్యాపారాల రెవెన్యూలు గత కొన్నేళ్లలో 100శాతానికి పైగా పెరిగాయి. యాపిల్ కు మ్యాక్ పీసీ సరుకు రవాణా ఏడాదియేడాదికి 50 శాతం పైగా పెరుగుతున్నాయి. ఐఫోన్ బిజినెస్ లు పడిపోయి యాపిల్ నిరాశలో ఉన్నప్పటికీ మ్యాక్ కంప్యూటర్లకు వస్తున్న ఆదరణ ప్రస్తుతం యాపిల్ కు ఊరటగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ ట్రాకర్ ఐడీసీ నివేదిక ప్రకారం, భారత్ లో కంప్యూటర్ విభాగంలో 32.7శాతం షేరుతో జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అగ్రస్థానంలో ఉంది. హెచ్ పీ 29.1శాతం షేరు, డెల్ 17.1శాతం మార్కెట్ షేరును కలిగి ఉన్నాయి.