breaking news
Slag overs
-
మహిళల మూడో వన్డే రద్దు
లండన్:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టును కూడా వరుణుడు వదిలి పెట్టలేదు. సోమవారం జరగాల్సిన భారత-ఇంగ్లండ్ ల పురుషుల తొలి వన్డేకు వర్షం ఆటంకం కల్గించడంతో ఆ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల విభాగంలో జరగాల్సిన మూడో వన్డేను కూడా వర్షం అడ్డుకుంది. లార్డ్స్ లో భారీ వర్షం కురవడంతో మూడో వన్డేను రద్దు చేయకతప్పలేదు. తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు 2-0తో సిరీస్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న భారత మహిళలకు ఆ ఆశ తీరలేదు. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ మహిళలు విజయం సాధించినా.. వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమైయ్యారు. -
భారత మహిళల పరాజయం
►2-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం ►ఎడ్వర్డ్స్ అజేయ సెంచరీ స్కార్బోరో: స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-0తో గెలుచుకుంది. నార్త్ మెరైన్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 214 పరుగులు చేసింది. చార్లెటీ ఎడ్వర్డ్స్ (145 బంతుల్లో 108 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగింది. టేలర్ (23) మినహా మిగతా వారు విఫలమైనా...ఎడ్వర్డ్స్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. టేలర్‌తో కలిసి రెండో వికెట్‌కు 50; విన్ఫీల్డ్ (10)తో కలిసి మూడో వికెట్‌కు 36; స్కివెర్ (17)తో కలిసి ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4, గోస్వామి 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసి ఓడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (43) టాప్ స్కోరర్. స్మృతి మందన (32), కెప్టెన్ మిథాలీ రాజ్ (30), వనిత (23) ఫర్వాలేదనిపించారు. హర్మన్‌ప్రీత్ మూడు కీలక భాగస్వామ్యాలు జోడించినా ప్రయోజనం లేకపోయింది. గున్ 4, శ్రుబ్సోలె, నైట్ చెరో 2 వికెట్లు తీశారు. ఎడ్వర్డ్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే సోమవారం లార్డ్స్‌లో జరుగుతుంది.