breaking news
size zero movie
-
Birthday Special: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్
-
పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు!
సాక్షి, తమిళ సినిమా : అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్నేహితులంతా ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు ఈ బ్యూటీ కూడా భాగమతి చిత్రం తరువాత ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. మధ్యలో గుళ్లూ.. గోపురాలూ తిరిగి పూజలు, దోష నివారణ పరిహారాలు చేసింది. దీంతో అనుష్క పెళ్లిపై దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది. 38 ఏళ్ల అనుష్క పెళ్లి గురించి ఆమె అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సైజ్ జీరో’ చిత్రంలోని పాత్ర కోసం అమాంతం బరువు పెరిగిపోయిన ఈ అమ్మడు.. వెయిట్‌ను తగ్గించుకోవడానికి చాలానే కష్టపడుతోంది. యోగాలు, కసరత్తులతో ప్రయోజనం లేకపోవడంతో పూర్వ అందాల కోసం ఆస్ట్రేలియా పరిగెత్తింది. నాజూగ్గా తయారై తరువాత ఇండియాకు తిగిగొచ్చిన తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారని ప్రచారం జరిగినా.. అనుష్క మాత్రం కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే కథనాలు వైరల్‌గా మారాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఈ బ్యూటీ కాలివేలుకు మెట్టెలు ధరించినట్టు కనిపిస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈ ఫొటోకు క్యాప్షన్ అక్కర్లేదు అంటూ కామెంట్ పెట్టింది. దీంతో నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు చెప్పబోతున్నారని, పెళ్లి గురించి ఆమె ప్రకటించే అవకాశముందని ప్రచారం ఊపందుకుంది. ఈ కథనాల్లో వాస్తవమెంతో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.. View this post on Instagram No caption required 😍 A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Oct 27, 2018 at 4:41am PDT -
'పెళ్లెప్పుడో తెలియదు'
నా వివాహమెప్పుడో నాకే తెలియదు అంటున్నారు నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాలకు చిరునామాగా మారిన నాయకి ఈమె. ఇలా అసమాన పాత్రల్ని అవలీలగా నటించేస్తున్నారు అనుష్క. తాజాగా బొద్దుగా, ముద్దుగా, సన్నగా, నాజూకుగా అవన్నీ ఒకే చిత్రంలో, ఒకే పాత్రలో ఒదిగిపోయింది. సినీ రస హృదయాలను వశపరచుకుని పరవశింపజేయడానికి రానున్నారు. అవును అనుష్క నవరసభరితంగా నటించిన ద్విభాషా చిత్రం ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్) చిత్రం అందంగా ముస్తాబై శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా అందాల భామ అనుష్కతో చిన్న భేటీ. ప్ర: ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు? జ: ఫలానా కథా చిత్రాల్లో నటించాలని అనుకోవడం కంటే మంచి కథా చిత్రాల్లో నేనుండాలని ఆశిస్తాను. బాహుబలి, ఇంజి ఇడుప్పళగి లాంటి చిత్రాలు అలా అమరినవే. ఇంజి ఇడుప్పళగి చిత్రం అమ్మాయిలందరికి నచ్చుతుంది. అలాంటి పాత్రను నేనీ చిత్రంలో నటించాను. ప్ర: సాధారణంగా ఇప్పటి వరకూ నటులే పాత్రల కోసం బరువు తగ్గడం,పెరగడం లాంటివి చేస్తున్నారు. నటిగా మీరు ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్రగా మారడానికి బరువు పెరగడం గురించి? జ: ఈ చిత్రం కోసం తొలుత ఫొటో షూట్ చేసినప్పుడు పాత్రకు గెటప్ సరిగా సెట్ కాలేదు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో సరిచేద్దాం అన్నారు. మరి కొందరు అధిక మేకప్‌తో ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. బరువు పెంచడంలోనూ ఆపదే అన్నారు. అలాంటివి నాకు సంతృప్తినివ్వలేదు. చిత్ర కథా పాత్రకు తగ్గట్టు బరువు పెరగడమే సరైన చర్య అని నేను భావించాను. అలాంటి నిర్ణయం తీసుకున్న తరువాత మూడు నెలల్లో 17 కిలోల బరువు పెరిగాను. ప్ర: బరువు పెరగడం కష్టమా? తగ్గడం కష్టమా? జ: నిజం చెప్పాలంటే రెండూ కష్టమే ప్ర: ఇంజి ఇడుప్పళగి చిత్రంలో సందేశం లాటిదేమయినా ఉంటుందా? జ: ప్రత్యేకంగా సందేశం అంటూ ఏమీ ఉండదు. అందం అనేది సన్నం లావులను బట్టి ఉండదు. మంచి మనసున్న వారందరూ అందమైన వారేనని చెప్పే చిత్రం ఇంజి ఇడుప్పళగి. ప్ర: నటి కాకుంటే ఏమైఉండేవారు? జ: నేను 17వ ఏట నుంచే యోగా చేస్తున్నాను. కాబట్టి నటి కాకుంటే యోగా టీచర్ అయ్యేదాన్ని. ప్ర: విశాల్, సూర్య, ఆర్య, ప్రభాస్‌లలో మీకు సరైన జోడీ ఎవరనుకుంటున్నారు? జ: మీరు చెప్పిన వారందరూ నాకు మంచి స్నేహితులే. విక్రమ్, సూర్యలు సీనియర్ నటులు. యూనిట్‌లోని వారినందర్నీ గౌరవించే నటుడు సూర్య. నాకు ఏదైనా సందేహం కలిగినప్పుడు విక్రమ్‌తో చర్చిస్తుంటాను. ప్ర: సినిమాలో అధికంగా నేర్చుకుంది ఎవరి నుంచి? జ: రజనీకాంత్ నుంచీ చాలా నేర్చుకున్నాను. ఆయన నటన, జీవితం నాకు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్‌స్టార్ అయిన ఆయన నిరాడంబరత చాలా నచ్చింది. అలాగే నటి మనోరమ. అరుంధతి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటనపై ఆమె అంకితభావం నన్ను విస్మయపరచింది. ప్ర: తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఏ భాషా అభిమానులంటే మీకు ఇష్టం? జ: ఏ భాషా కథా చిత్రం అయినా నచ్చితేనే చేస్తాను. నన్ను గెలిపించేది అభిమానులే. వాళ్ల విషయంలో తారతమ్యాలు లేవు. ప్ర: చిత్ర రంగప్రవేశం చేసి దశాబ్దం దాటింది. ఏదైనా మంచి పాత్ర పోషించాలనే కోరిక ఉందా? జ: బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించాలని అందరూ కోరుకుంటారు. అలాంటి మంచి పాత్ర ఏదైనా ఉంటే చెప్పండి. సినిమా అనేది మాయాజాల లోకం. అసలు నేనీ రంగంలోకి వస్తాననే ఊహించలేదు. అంతా దైవేచ్ఛ. ప్ర: కథానాయికల మధ్య ఇప్పుడు పోటీ అధికం అంటున్నారే? జ: అలాంటి పోటీ అవసరమే. అప్పుడే ది బెస్ట్ ఔట్‌పుట్‌ను ఇవ్వగలం. అయితే నెంబర్ఒన్ పోటీపై నాకు నమ్మకం లేదు. దాని వల్ల అదనంగా లాభం ఉంటుందని కూడా అనుకోను. మంచి కథాపాత్రల్లో నటిస్తే చాలు. నాకు వరుసగా మంచి చిత్రాలు అమరడం సంతోషంగా ఉంది. ప్ర: మీరు నటించిన చిత్రాల్లో ఉత్తమ చిత్రాలుగా మారు చెప్పేది? జ: మొదటి వరుసలో నాగార్జునతో నటించిన సూపర్ చిత్రం. ఆ తరువాత వేదం, దైవతిరుమగళ్, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి ఇలా చెప్పుకుంటూపోవచ్చు. ప్ర: అందరూ అడిగే అరిగిన ప్రశ్నే. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: ఏడాది పొడుగునా నటులతోనో, వ్యాపారవేత్తలతోనో నన్ను కలుపుతు గ్యాసిప్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక నేను ప్రేమ వివాహమా? తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటానా? ... అసలు అది ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. అయితే పెళ్లి ఎప్పుడు జరిగినా రహస్యంగా మాత్రం జరగదు. -
'సైజ్ జీరో' లో నాగార్జున
'సోగ్గాడే చిన్ని నాయన' షూటింగ్ బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున 'సైజ్ జీరో' లో మెరవనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైజ్ జీరో' సినిమాలో కీలకపాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా నాగార్జున పాత్ర ప్లస్ అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైందని తెలిపాయి. తమిళ వెర్షన్ లో మరొకరు నటించే అవకాశముంది. లావుగా ఉన్న అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడే కథ ఇది. బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యం ముఖ్యమనేది ఈ చిత్ర కథాంశం. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు.