breaking news
six men
-
బీబీసీ టాప్ యాంకర్ల జీతాల్లో కోత
సంస్థలో పురుష , మహిళా ఉద్యోగుల మధ్య ఆదాయ అసమానతలు ఆరోపణల నేపథ్యంలో బీబీసీకి చెందిన టాప్ న్యూస్ ప్రెజెంటర్లు దిగి రాక తప్పలేదు. తమ వేతనాలను తగ్గించుకునేందుకు ఆరుగురు యాంకర్లు ఆమోదం తెలిపారు. జెరెమీ వైన్, జాన్ హంప్రీస్, నిక్కీ క్యాంబెల్, హ్యూ ఎడ్వర్డ్స్, జాన్ సోపెల్, జెరెమీ వైన్, నిక్ రాబిన్ సన్ తమ వేతనాల్లో కోతకు అంగీకరించారు. ఒకే పని చేస్తున్న స్త్రీ పురుషులకు సమాన వేతనాలను అమలు చేయాలి పే కట్కు అంగీకరించిన జెరెమీ వైన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మహిళా సహోద్యోగులకే తన మద్దతు అని ప్రకటించారు. పురుష, మహిళా అంతర్జాతీయ ఎడిటర్ల వేతనాలలో అసమానతలకు నిరసనగా బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీబీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రేక్షకులతో నిజమైన సంబంధం కలిగి ఉన్న గొప్ప జర్నలిసులు, ప్రెజెంటర్లనీ తెలిపింది. వారు తమ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొంది. జులై, 2017లో బీబీసీ తమ సంస్థలో తమ సంస్థలో అత్యధిక వేతనాలు తీసుకుంటున్న వారిలో 2/3వంతు పురుషులే ఉన్నారని, ఇందులో ఏడుగురు ఎడిటర్లు ఉన్నారని నివేదించింది. 150,000 పౌండ్ల(సుమారు రూ.1.35 కోట్లు)కు పైగా వేతనాలు పొందుతున్న వారి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో క్రిస్ ఎవాన్స్ 2016/2017లో రూ.19.84 కోట్ల నుంచి రూ.22.54 కోట్ల వేతనంతో మొదటి స్థానంలో నిలిచారు. అదే సమయంలో మహిళల్లో అత్యధికంగా క్లాడియా వింకెల్‌మ్యాన్ రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు మాత్రమే వేతనంగా పొందినట్టు రిపోర్ట్ చేసింది. దీంతో బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో వివక్ష, వేతన వ్యత్యాసాలు అంశంపై వివాదం రాజుకుంది. కాట్టి కే, ఎమిలీ మెట్లిస్, అలెక్స్ జోన్స్ సహా దాదాపు 40మంది హై ప్రొఫైల్ మహిళా ఉద్యోగులు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలంటూ ఒక బహిరంగ లేఖ రాయడం కలకలం రేపింది. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసానికి నిరసనగా గత నెలలో బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు. దీనిపై బ్రిటీష్ కల్చరల్ సెక్రటరీ మాట్ హాన్ కాక్ కూడా దీనిపై స్పందించారు. బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగులకు న్యాయమైన, సమాన వేతనాలు ఉండాలని, బ్రిటిష్ విలువలకు ధృవతారలా బీబీసీ ఉండాలని సూచించారు. కాగా ఆన్-ఎయిర్ ప్రెజెంటర్లు, ఎడిటర్లు, కరస్పాండెంట్ల వేతనాల విషయంలో బీబీసీ అనుసరించే విధానాన్ని వచ్చే వారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. -
కస్టమర్‌ను చితక్కొట్టిన బౌన్సర్లు
న్యూఢిల్లీ: పబ్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ను వెంటాడి మరీ చితక్కొట్టిన వైనం ఢిల్లీని గుర్గావ్లో చోటుచేసుకుంది. బౌన్సర్ల సాయంతో వినియోగదారుడిపై యాజమాన్యం వాళ్లే దాడికి దిగి తీవ్రంగా గాయపర్చిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ అమానుషం హాట్ టాపిక్ గా మారింది. మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్‌కి వెళ్లిన రాకీ (24) డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తూలి పక్కనే ఉన్న బౌన్సర్లపై పడ్డాడు. అంతే అగ్రహానికి గురైన బౌన్సర్లు రాకీపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయినా వాళ్ల అరాచకం ఆగలేదు. విచక్షణరహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రాకీని కొంత దూరం పాటు వెంటాడి మరీ దాడి కొనసాగించారు. షాపింగ్ మాల్ ఆవరణలో 50 నిమిషాల పాటు కొనసాగిన వారి ఆగడాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై రాకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. అయితే పబ్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రాకీ, అతని స్నేహితులు మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది. -
పోలీసుల అదుపులో ఆరుగురు విఠులు, ముగ్గురు మహిళలు
హైదరాబాద్:నగరంలోని కూకట్ పల్లి సుమిత్రా నగర్ లో ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విఠులను అదుపులోకి తీసుకున్నారు.