breaking news
Sivaraman Committee
-
నెలాఖరుకు రాజధానిపై నిర్ణయం: నారాయణ
-
నెలాఖరుకు రాజధానిపై నిర్ణయం: నారాయణ
హైదరాబాద్: జూలై నెలాఖరుకల్లా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశముందని మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సలహా కమిటీ ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు నారాయణ తెలిపారు. రాజధాని వ్యవహారంపై చర్చించేందుకు సోమవారం మంత్రి నారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశరాజధానిలో రాజధాని ఎంపిక చేసేందుకు నియమించిన శివరామకృష్ణన్ కమిటీతో నారాయణ భేటీ అవుతారు. రాజధాని ప్రతిపాదనను నారాయణ కమిటీకి అందజేయనున్నారు.


