breaking news
Siva Karthikeya
-
పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!
వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్డమ్తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!విత్ లవ్:‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.తాయ్ కిళవి:ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.యూత్:తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.బ్లాస్ట్:అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న 'డాన్' దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సీబీ చక్రవర్తి వివాహబంధంలో అడుగుపెట్టాడు. హీరో శివ కార్తికేయన్‌కు 'డాన్' వంటి హిట్ సినిమా అందించి సౌత్ ఇండియాలో పాపులర్ డైరెక్టర్‌గా చక్రవర్తి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను డైరెక్షన్ చేసిన మొదటి సినిమా 'డాన్'తో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్‌లో రికార్డ్ సెట్ చేశాడు. 2022లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో శివకార్తికేయన్‌తో పాటు ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య తదితరులు నటించారు.దర్శకుడు సీబీ చక్రవర్తి సెప్టెంబర్ 5న వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీ వర్షిణితో కలిసి ఏడడుగులు వేశాడు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. చెన్నై ఈరోడ్‌లోని ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 5న వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా సీబీ చక్రవర్తి పనిచేశాడు. తన మొదటి సినిమాతోనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జరిగిన తన వివాహ వేడుకలో శివ కార్తికేయన్, అట్లీ పాల్గొన్నారు. సీబీ చక్రవర్తి చేతిలో ఒక బిగ్ సినిమా ఉంది. శివ కార్తికేయన్, రష్మిక మందన్న జోడీగా ఆయన ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య కూడా నటించనున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రానుంది. -
వదంతులకు భయపడే....
నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అయితే మన హీరోయిన్లు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెడుతున్నారని వాపోతుంటారు. వీరిలో రెండు రకాల హీరోయిన్లను చూస్తుంటాం. కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నాం అంటుంటారు. మరికొందరు ఆవేదన కలిగిస్తున్నాయంటుంటారు. మూడవ రకం కూడా ఉన్నారు. తమపై తామే వదంతులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ మూడు రకాల నాయికల్లో నటి ప్రియా ఆనంద్ ఏ రకానికి చెందుతారో గానీ వదంతులు వణికిస్తున్నాయంటున్నారు. పస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు బాగానే ప్రచారంలో ఉంది. చేతి నిండా చిత్రాలు కూడా ఉన్నాయి. ఎదిర్ నీచ్చల్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గాలి వీచేలా చేసింది. ఈ అమ్మడి గురించి పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యాలంటున్న ప్రియా ఆనంద్ తన వెర్షన్‌ను చెప్పుకొస్తూ ఇలాంటి అనవసరపు పుకార్లు పుట్టుకొస్తాయనే స్నేహితుల పుట్టిన రోజు పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఆశించిన స్థాయి లభించిందన్నారు. అరిమా నంబి, ఒరు ఊరుల రెండు రాజ, వై రాజా వై, ఇరుంబు కుదిరై చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాయికలు నేపథ్య గాయనీమణులుగా మారుతున్న సీజన్ తనలోను గాయనికి కావలసిన అర్హతలున్నాయన్నారు. వాటిని సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నానని చెబుతూ పాటలు పాడాలనే తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు. ఇకపోతే తన గురించి పుకార్లు పరుగులు తీస్తున్నాయని అలాంటి వాటిని జాలీగానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తానెవరితోను పోటీలకు వెళ్లనన్నారు. కారణం ఇలాంటి వదంతుల ప్రచారం అవుతాయనేనన్నారు. సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలకు కూడా వెళ్లనని అయినా తనపై వదంతులు ప్రచారం అవడం వింతగా ఉందని ప్రియా ఆనంద్ చెప్పుకుంటున్నారు.


