breaking news
Sitarganj constituency
-
చిల్డ్రన్స్ డే రోజు విషాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి
డెహ్రాడూన్: బాలల దినోత్సవం (నవంబర్ 14) రోజున విషాదం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితో సహా ఉపాధ్యాయుడు మరణించారు. మరికొంతమంది చిన్నారులు గాయపడ్డారు. నాయగావ్ భట్టే పరిధిలోని కిచ్చా ప్రాంతానికి చెందిన వేదారం స్కూల్ విద్యార్థులను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిక్నిక్కు తీసుకెళ్లారు. సితార్‌గంజ్ ప్రాంతంలో బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్ పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే? -
ఆయన.. ఇద్దరు భార్యల సమరం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు సాగుతోంది. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన మాలతి బిశ్వాస్ తాను పీసీసీ మాజీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్ భార్యనని చెబుతుండగా.. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిందా బిశ్వాస్ కూడా తానే శ్యామ్ బిశ్వాస్కు నిజమైన భార్యనని చెబుతున్నారు. బిందా (52), మాలతి (56) ఇద్దరూ సమర్పించిన అఫిడవిట్లలో తమ భర్త పేరును శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్‌గా పేర్కొన్నారు. ఈ విషయంపై శ్యామ్ మాట్లాడుతూ.. మాలతి తనకు చట్టబద్ధమైన భార్యని, బిందా తనపై పుకార్లు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇంతకుమించి తాను మాట్లాడబోనని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిరాకరించిన మాలతి.. తాను శ్యామ్ భార్యనని పేర్కొన్నారు. ఇక బిందా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మాలతిపై పోరాడుతున్నానని, ఇది న్యాయం కోసం, తన హోదా కోసం పోరాటమని చెప్పారు. 1976లో కోల్‌కతాలో శ్యామ్‌ను పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తనను బృందావనం తీసుకెళ్లాడని, అక్కడే తాము స్థిరపడ్డామని తెలిపారు. ఆయన ఓ కేసులో ఇరుక్కుని ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వెళ్లారని, వ్యాపారంలో ఎదిగేందుకు తమ కుటుంబం సాయం చేసిందని చెప్పారు. ఆ తర్వాత శ్యామ్ మాలతిని వివాహం చేసుకుని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. బిందాకు ముగ్గురు కుమార్తెలు, మాలతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సతుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి. బీడీ కంపెనీ యజమాని అయిన శ్యామ్ బెంగాలీ. సితార్‌గంజ్‌లో ఆయన వర్గానికి చెందినవారు 30 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఇదే చోట నుంచి బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కొడుకు సౌరభ్ బహుగుణ పోటీ చేస్తున్నారు.